ప్రసవానంతరం లేదా గర్భధారణ సమయంలో మతిమరుపు, నిరాశ వంటి సమస్యలు చాలా మంది మహిళలను ఇబ్బంది పెడుతున్నాయి. ఇది నిజంగానే జరుగుతుందా లేదా మహిళలు అనవసరంగా ఆందోళన చెందుతున్నారా అనే సందేహం చాలా మందిలో ఉంది. దీనికి సమాధానం కోసం స్పెయిన్‌లో ఓ పరిశోధనా బృందం దీని గురించి లోతుగా స్టడీ చేసింది. వారి పరిశోధనలో తెలిసిన విషయం ఏంటంటే.. గర్భధారణ అనేది మహిళల మెదడును ప్రభావితం చేస్తుందట. దీని వల్ల అనేక మార్పులు సంభవిస్తాయని వెల్లడైంది. గర్భధారణ సమయంలో, తర్వాత సంభవించే మెదడు సంబంధిత సమస్యల గురించి వివరంగా తెలుసుకుందాం రండి.
గర్భధారణ, ప్రసవ సమయంలో మహిళల్లో అనేక శారీరక మార్పులు సంభవిస్తాయి. కానీ ఈ మార్పులు కేవలం శారీరకమైనవి మాత్రమే కాదు, వీటికి మెదడుతో కచ్చితంగా సంబంధం ఉంటుంది. నేచర్ కమ్యూనికేషన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, గర్భధారణ చివరి దశలో మెదడులో ఉండే U-ఆకారపు బూడిద పదార్థం (gray matter) పరిమాణం తగ్గుతుంది. ఇది ప్రసవం తర్వాత 6 నెలలకు కొంతవరకు సాధారణ స్థితికి వస్తుంది.
గర్భిణీ స్త్రీ మెదడులో ఈ మార్పులకు కారణం హార్మోన్ల హెచ్చుతగ్గులు కూడా కావచ్చు. ఇవి తల్లి కావడానికి మానసికంగా సిద్ధం కావడానికి, శిశువుతో ప్రత్యేక అనుబంధం ఏర్పరచుకోవడానికి దోహదపడతాయి. గర్భధారణ సమయంలో సంభవించే ఈ మార్పులు మహిళల సామాజిక, భావోద్వేగ అవగాహనను కూడా ప్రభావితం చేస్తాయి.
తల్లి కావడం మహిళల్లో నాడీ జీవసంబంధమైన, మానసిక మార్పులను ప్రేరేపిస్తుంది. కానీ ఆశ్చర్యకరంగా, ఈ విషయంపై ఎలాంటి అధ్యయనం జరగలేదు. పరిశోధకులు మొదటిసారి తల్లులు కాబోతున్న 127 మంది మహిళలపై పరిశోధన చేశారు. గర్భధారణకు ముందు నుండి ప్రసవం తర్వాత ఆరు నెలల వరకు వీరి మెదడును ఐదు మాగ్నెటిక్ ఇమేజింగ్ సెషన్‌ల ద్వారా పరిశీలించారు.
వీరిని గర్భధారణకు ముందు, తర్వాత 18 వారాలకు, 34 వారాలకు, ప్రసవం తర్వాత, 6 నెలల తర్వాత చేశారు. దీని ద్వారా పరిశోధకులకు మహిళల మెదడు నిర్మాణం గర్భధారణకు ముందు నుండి ప్రసవానంతరం వరకు ఎలా ఉందో తెలిసింది. దీనిని పోల్చి ఇమేజింగ్ డేటా చేశారు.
ఇందులో బూడిద పదార్థం పరిమాణంపై దృష్టి పెట్టింది. ఇది నిర్మాణాత్మక మెదడు మార్పులకు ఒక ముఖ్యమైన సూచిక. గర్భిణీ స్త్రీ మెదడులో ఈ U-ఆకారపు బూడిద పదార్థం (gray matter) గర్భధారణ చివరి నెలల్లో తగ్గుతుందని, ప్రసవం తర్వాత కొంత సమయానికి సాధారణ స్థితికి వస్తుందనీ, మరి కొందరికి రాకపోవడం వల్ల ఇలా విషయాలను మర్చిపోవడం జరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు.
మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఈ మార్పులు గర్భిణీ స్త్రీల మెదడులో మాత్రమే కనిపించాయి. పిల్లలు లేని మహిళలు లేదా గర్భవతి కాని మహిళల మెదడులో ఇటువంటి మార్పులు కనిపించలేదు.