Smell in Periods: పీరియడ్స్ రక్తం నుంచి దుర్వాసన అధికంగా వస్తుందా? వాటికి కారణాలు ఇవి కావచ్చు
Smell in Periods: రుతుకాలంలో మహిళలు వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటారు. పొట్ట నొప్పి నుండి మానసిక మార్పుల వరకు అన్నీ రుతుకాలంతో ముడిపడి ఉంటాయి. చాలా మంది మహిళలు రుతుకాల రక్తం నుండి దుర్వాసన వస్తుందని బాధపడుతూ ఉంటారు. దానికి కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

రుతుస్రావం అనేది మహిళల్లో సహజ ప్రక్రియ. ఇది ప్రతి స్త్రీ జీవితంలో ఎంతో ముఖ్యమైనది. ప్రతినెలా సమయానికి పీరియడ్స్ వస్తేనే వారు గర్భం దాల్చేందుకు అర్హులైన వారు అని అర్థం. పీరియడ్స్ సమయంలో గర్భాశయం లోపల నుండి రక్తం, కణజాలం వంటివి యోని ద్వారా బయటకు వస్తాయి. ఒక్కో మహిళకు ఈ ప్రక్రియ ఒక్కోలా ఉంటుంది.
కొంతమందికి ప్రతి 25 రోజులకు ఒకసారి పీరియడ్స్ వస్తే మరికొందరికి 35 రోజులకు ఒకసారి వస్తుంది. ఈ సమయంలో చాలా మంది మహిళల్లో కడుపు నొప్పి, చర్మ సమస్యలను వంటివి ఎదుర్కొంటారు. అలాగే కొంతమంది మహిళల్లో పీరియడ్స్ సమయంలో వచ్చే రక్తం దుర్వాసన వస్తుంది. ఇలా ఎందుకు వస్తుందో తెలియక ఎంతో మంది స్త్రీలు ఇబ్బంది పడుతుంటారు. ఇలా పీరియడ్స్ రక్తం వాసన రావడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. మీకు ఎందుకు ఇలా దుర్వాసన వస్తుందో తెలుసుకోవడానికి వైద్యులను కూడా సంప్రదింవచ్చు.
1) యోనిలో బ్యాక్టీరియా
మీ యోనిలో అనేక రకాల బ్యాక్టీరియాలు పెరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు రుతుకాల రక్తంలో బ్యాక్టీరియా ఉండటం వల్ల దుర్వాసన ఎక్కువగా ఉండవచ్చు. మీ యోనిలో బ్యాక్టీరియా స్థాయి ఎక్కువ లేదా తక్కువగా ఉండటం వల్ల దుర్వాసన మారుతుంది. కాబట్టి దుర్వాసన మరీ అధికంగా ఉంటే ఒకసారి వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
2) రక్త pH లో హార్మోన్ల మార్పులు
రుతుకాల రక్తానికి ప్రత్యేకమైన వాసన ఉంటుంది. ఎందుకంటే దీనిలో ఇనుము ఉంటుంది. మీ రుతుకాల రక్తం శోషించబడే వరకు అనేక గంటలు యోనిలో ఉంటుంది, దీని వల్ల కొన్నిసార్లు యోనిలో ఉన్న బ్యాక్టీరియాతో కలిసి దుర్వాసన రావచ్చు. యోనిలో బ్యాక్టీరియా పెరుగుదల లేదా తగ్గుదలతో దుర్వాసన తీవ్రత మారుతుంది.
3) పరిశుభ్రత లేకపోవడం
రోజూ యోనిని శుభ్రం చేసుకోవడం, యోని లోపలి బయటి భాగాలను సరిగ్గా కడగడం చాలా ముఖ్యం. రుతుకాలంలో పరిశుభ్రత చాలా ముఖ్యం. ముఖ్యంగా యోని భాగానికి. చాలా సందర్భాల్లో స్ప్రేలు లేదా వైప్స్ వంటి సుగంధ ద్రవ్యాలను వైద్యుల అనుమతి లేకుండా ఉపయోగించకూడదు. ఎందుకంటే వీటి వల్ల యోనిలోని కొన్ని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా నష్టపోవచ్చు. అలాగే, వీటిని ఉపయోగించడం వల్ల కొన్నిసార్లు చికాకు కూడా రావచ్చు.
4) బ్యాక్టీరియల్ వజినోసిస్
పీరయడ్స్ రక్తం నుంచి చేపల వాసన వంటి దుర్వాసన వస్తుంటే అది బ్యాక్టీరియల్ వజినోసిస్ వల్ల రావచ్చు. ఇది యోనిలో సాధారణ సంక్రమణ. దీని లక్షణాల్లో యోనిలో లేదా దాని చుట్టుపక్కల మంట, గోధుమ లేదా పాల తెల్లని రంగులో ఉన్న నురుగు వంటివి ఉన్నాయి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం