పెళ్లి తర్వాత పొట్ట వస్తుంది, పెళ్లయ్యాక బరువు పెరుగుతారు అనే మాటలు మీరు చాలా సార్లు వినే ఉంటారు. విన్నప్పుడల్లా నవ్వుకుని ఉంటారు కదా. సిల్లీగా అనిపించే ఈ మాటల్లో వాస్తవం ఎంత ఉంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇందంతా నిజమే అంటే నమ్ముతారా? అవును కాస్త విచిత్రంగా అనిపించినప్పటికీ వివాహం తర్వాత చాలా మంది స్త్రీలు, పురుషుల బరువు పెరగడం వాస్తవమేనట. పెళ్లి, బరువుకీ మధ్య ఉన్న సంబంధం గురించి తాజా అధ్యయనాలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాయి.
వార్సా, పోలెండ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ బృందం చేసిన కొత్త అధ్యయనం ప్రకారం, వివాహానికి, శరీర బరువుకు మధ్య స్పష్టమైన సంబంధం కనిపోస్తుంది. పెళ్లి చేసుకోవడం వల్ల చాలా మంది ప్రజలు అధిక బరువు, ఊబకాయంతో బాధపడతారని తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇది పురుషులు, మహిళలకు ఒకేలా ఉండదట.
వివాహానికి బరువుకీ మధ్య ఉన్న సంబంధం ఏంటా అనే విషయాన్ని కనుగొనడానికి అధ్యయన బృందం సుమారు 2,405 మంది ( సగం మహిళలు, సగం పురుషులు) పై ఈ అధ్యయనం నిర్వహించింది. వీరందరి సగటు వయస్సు 50 సంవత్సరాలు. ఈ జనాభాలో 35.3 శాతం మంది సాధారణ బరువు కలిగి ఉంటే, 38.3 శాతం మంది అధిక బరువు కలిగి ఉన్నారు. అలాగే 26.4 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారని తెలిసింది.
వివాహం చేసుకోవడం వల్ల స్త్రీల కన్నా పురుషులలో ఊబకాయం ప్రమాదం మూడు రెట్లు పెరుగుతుందట. వారిలో అధిక బరువు ప్రమాదం 62 శాతం పెరుగుతుందని అధ్యయనంలో తెలిసింది. నిజానికి మహిళల విషయంలో వివాహం తర్వాత ఊబకాయం ప్రమాదం లేదట. కానీ అధిక బరువు ప్రమాదం మాత్ర 39 శాతం ఉందట.
ఎకనామిక్స్ అండ్ హ్యూమన్ బయాలజీ జర్నల్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం.. వివాహం తర్వాత మొదటి ఐదు సంవత్సరాలలో పురుషుల బాడీ మాస్ ఇండెక్స్ పెరుగుతుందట. శరీర బరువుకూ వివాహానికి నేరుగా సంబంధం ఉందని తేలింది. అంతే కాదు వివాహం తర్వాత సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఎక్కువ తినడం, తక్కువ వ్యాయామం చేయడమే ఇందుకు ముఖ్య కారణమని వారు వివరించారు. దీంతో పాటు ఒత్తిడితో కూడిన ఆలోచనలు, అంతరంగ సంబంధాలు కూడా శరీరంలో కొవ్వు పెరుగుదలకు దారితీస్తాయని స్టడీ ద్వారా గమనించారు. వివాహిత పురుషులు, అవివాహిత పురుషుల బాడీ మాస్ ఇండెక్స్‌లలో స్పష్టమైన తేడాను వారు గమనించారు. గత పరిశోధనలు దీన్ని “హ్యాపీ ఫ్యాట్” అని పేర్కొన్నారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్