Mouth Wash: మార్కెట్లో కొన్న మౌత్ వాష్ నోరు మండిపోతుందా? ఇంట్లోనే ఇలా తయారు చేయండి, దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి!
Mouth Wash: మార్కెట్లో దొరికే మౌత్‌వాష్‌ల వల్ల నోరు మండిపోతుందా? అయితే ఇంట్లోనే ఈజీగా ఇలా మౌత్‌వాష్ తయారు చేసుకోండి. దీన్ని ఉపయోగించడం వల్ల దంతాలు, చిగుళలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

అందంగా, ఆరోగ్యంగా ఉండటానికి నోరు, దంతాలు ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. దంతాల కోసం బ్రష్ చేయడంతో పాటు మౌత్ వాష్, ఫ్లాసింగ్ కూడా చాలా అవసరం. వీటి నోటి దుర్వాసన నుంచి తప్పించుకోవడంతో పాటు దంతాలపై పేరుకుపోయే క్రిముల నుండి చక్కటి ఉపశమనం లభిస్తుంది. కానీ మార్కెట్లో దొరికే మౌత్ వాష్ లను ఉపయోగించడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వీటిని ఉపయోగించడం వల్ల కొందరికి నోటిలో మంట వంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. పైగా వీటిలో ఎలాంటి రసాయనాలు కలిస్తాయో అన్న భయం కూడా మరో కారణం. అందుకే మార్కెట్లో దొరికే మౌత్ వాష్ లను ఉపయోగించే బదులు ఇంట్లోనే మీరు స్వయంగా తయారు చేసుకుని వాడటం ఉత్తమం. ముఖ్యంగా పిల్లల నోటిలో క్యావిటీలను నివారించడానికి, ఇంట్లో తయారుచేసిన ఈ మౌత్వాష్‌లు ఉపయోగించండి చాలా సేఫ్. ఇది దంతాలతో పాటు చిగుళ్ళను కూడా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇంట్లోనే మౌత్ వాష్ లను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి.
ఇంట్లో మౌత్‌వాష్ తయారు చేయడం ఎలా
నారింజ- లవంగం మౌత్‌వాష్:
- నారింజ నూనె, లవంగాలను సమాన పరిమాణంలో తీసుకుని ఒక గిన్నెతో పోసి వేడి చేయండి.
- నూనె బాగా మరిగి లవంగాలలోని సారమంతా నూనెలోకి చేరేంత వరకూ ఉడికించండి.
- నూనె రంగు మారిన తర్వాత వడకట్టి చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో పోసుకుని స్టోర్ చేసుకోండి.
పుదీనా- నిమ్మరసం మౌత్‌వాష్
- ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో నీరు పోసి వేడి చేయండి.
- నీరు కాస్త వేడెక్కిన తర్వాత దాంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న పిడికెడు పుదీనా ఆకులను వేయండి.
- నీరు చక్కగా మరిగి పుదీనా ఆకుల్లోని సారమంతా నీటిలోకి చేరగానే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి.
- చల్లారిన పుదీనా నీటిలో నిమ్మరసం, కావాలంటే కొద్దిగా కూలింగ్ పౌడర్ వేసి కలపండి.
- ఈ ద్రవాణాన్ని ఒక గాజు కంటైనర్ లో వేసి స్టోర్ చేసుకుని రోజూ ఉపయోగించుకోండి.
రోజ్ వాటర్- లవంగాల మౌత్‌వాష్:
- ఈ మౌత్ వాష్ తయారు చేయడానికి ఒక చిన్న ప్యాన్ లో నీరుపోసి వేడిచేయండి.
- నీరు కాస్త వేడిక్కిన తర్వాత దాంట్లో లవంగాలు వేసి మరిగించండి.
- నీరు నీటిలోకి దిగేంతవరకూ చూసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి.
- ఈ ద్రవాణం చల్లారిన తర్వాత దాంట్లో ఒక కప్పు రోజ్ వాటర్ , ఒక టీస్పూన్ బేకింగ్ సోడా వేసి కలపండి.
- అంతే మౌత్ వాష్ రెడీ అయినట్టే. దీన్ని గాజు సీసాలో నిల్వ చేసుకుని ప్రతిరోజూ ఉపయోగించుకోండి.
ఇంట్లో తయారుచేసిన మౌత్‌వాష్ ప్రయోజనాలు
- ఇంట్లో తయారుచేసిన మౌత్‌వాష్ పిల్లల నోటి ఆరోగ్యానికి మంచిది.
-ప్రతిరోజూ పిల్లలకు ఆయిల్ పుల్లింగ్ చేయించడం వల్ల ఇది బ్యాక్టీరియాను తొలగించడంలో మాత్రమే కాకుండా, నోటి దుర్వాసనను కూడా నివారించడంలో సహాయపడుతుంది.
-అలాగే, చిగుళ్ళ వాపు, ప్లాక్ వంటి సమస్యలు ఏర్పడకుండా నిరోధిస్తుంది.
-వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు దంతాలు, చిగుళ్ళ నొప్పి నుండి రక్షిస్తాయి.
సంబంధిత కథనం
టాపిక్