Loneliness Effects: ఒంటరితనం పురుషుల కన్నా మహిళలపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?
Loneliness Effects: ఒంటరితనం చాలా ప్రమాదకరమైనది. మనిషిని శారీరకంగా, మానసికంగా చాలా దెబ్బతీస్తుంది. అధ్యయనాల ప్రకారం దీని ప్రభావం పురుషుల కన్నా స్త్రీల మీదే ఎక్కువగా పడుతుందట. మహిళల్లో అనేక ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుంది. అవేంటో తెలుసుకుందాం రండి..
ఒంటరితనం అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో ఒక దశలో ఎదుర్కోవాల్సిన అధ్యాయం. కొందరు దానిని దాటి బయటకు వస్తే మరికొందరు అదే ఫీలింగ్ లో ఉండి జీవితాలు గడిపేస్తుంటారు. తమ వ్యక్తిగత అనుభవాలు, లేదా వారి కోరికల ఫలితంగా అదే కొన్ని రోజుల పాటు ఒంటరితనంలో గడపాల్సి వస్తుంది. పరిస్థితుల ప్రభావం వల్ల ఈ ఫీలింగ్‌లోనే చాలా కాలం పాటు ఉండిపోతే వారు దుష్ప్రభవాలు ఎదుర్కోకతప్పదట. దీని గురించి జరిపిన అధ్యయనాల్లో తెలిసిన మరో షాకింగ్ విషయమేమిటంటే, ఒంటరితనం మగాళ్ల కంటే ఆడవారిలోనే ఎక్కువ నష్టాలు కలుగుతున్నాయి.
ఒక వ్యక్తిగత అనుభవం, ఆ వ్యక్తి నివసించే పరిసరాలు, వారి వ్యక్తిగత కోరికల నుండి ఒంటరితనాన్ని అనుభూతి చెందుతుంటారు. ఒంటరితనం వల్ల కలిగే దీర్ఘకాలిక భావాలు ఆ వ్యక్తి ఆరోగ్యం, ఆలోచనలు, ఆయుష్షుపై కూడా ప్రభావితం చూపిస్తాయి. ఇటీవలి అధ్యయనంలో, ఒంటరితనం వ్యక్తి హృదయ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని గమనించారు.
ఒంటరితనం వల్ల ఎదుర్కొన్న 'సమస్యలు:
బయోలాజికల్ సైకాలజీలో ప్రచురించిన అధ్యయన ఫలితాలను బట్టి ఒంటరితనం వల్ల పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువ కలుగుతాయని తేలింది. ఒంటరితనం సామాజిక ఒత్తిడి, పరిస్థితులలో హృదయ స్పందన రేటు తగ్గడానికి దారితీస్తుంది. ఇది హృదయనాళ పనితీరును నియంత్రించే స్వయంప్రతిపత్తి నాడీ వ్యవస్థ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఒంటరితనం వ్యక్తిని చాలా అసంతృప్తికి గురి చేస్తుంది. అయినప్పటికీ, ఇది శరీరం, మనస్సును ఒకటి కంటే ఎక్కువ విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఇది హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్ ప్రమాదం వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలకు కూడా దారితీస్తుంది.
యువకులపై జరిపిన స్టడీలో:
17 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న 97 మంది ఆరోగ్యవంతమై కాలేజీ విద్యార్థులపై అధ్యయనం నిర్వహించారు. ధూమపానం, ఆల్కహాల్, కెఫైన్ తీసుకోకుండా 24 గంటలు పాటు ఉంచారు. పాల్గొనేవారిలో ఒంటరితనం స్థాయిని న్యూరోటిసిజం, సోషల్ నెట్వర్క్ పరిమాణం, గందరగోళానికి గురయ్యే కారకాలు, మానసిక స్థితి నియంత్రణ గురించి నమోదు చేసుకున్నారు. ఫలితాలు నలుగురిలో కలిసి ఉన్నప్పుడు హృదయ స్పందన రేటు వైవిధ్యంగా కనిపించింది. ఒంటరి వ్యక్తులకు, స్వయంప్రతిపత్తి నాడీ వ్యవస్థ హృదయనాళ విధులను నియంత్రించడంలో తక్కువ ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు సూచించింది.
ముఖ్యంగా సామాజిక ఒత్తిడి పరిస్థితులలో..
ఆరోగ్య మనస్తత్వశాస్త్రం నిపుణుల అభిప్రాయం ప్రకారం, "ఒంటరితనం, హృదయ ఆరోగ్యం మధ్య సంబంధాన్ని యంత్రాల ద్వారా పరీక్షించి చూశాం. తీవ్రమైన ఒత్తిడికి అసాధారణ హృదయనాళ ప్రతిచర్యలను ప్రేరేపించేదిగా గుర్తించాం. మునుపటి అధ్యయనాలు ఒత్తిడికి ప్రతిస్పందనగా హృదయ స్పందన రేటు, రక్తపోటు, కార్డియాక్ ఇంపెడెన్స్ వంటి గుండె చర్యలను అన్వేషించాయి.
ఎందుకంటే..:
ఈ స్టడీ చివర్లో ఒత్తిడి నియంత్రణ కోసం మహిళలు సామాజిక సంబంధాలపై ఎక్కువగా ఆధారపడతారని సూచిస్తుంది. మగాళ్లు సాధారణంగానే తమ లోపలి భావాలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. అదే ఆడవారి విషయంలో ఇది విరుద్ధంగా ఉంటుంది. వాళ్ల ఫీలింగ్స్ ను ఎప్పటికప్పుడు వ్యక్తపరచాలని అనుకుంటుంటారు. ఈ విధంగా చూస్తే మగాళ్లకు భావాలు వ్యక్తపరుచుకునే అలవాటు లేకపోవడంతో ఒంటరిగా ఉన్నప్పటికీ పెద్దగా తేడా కనిపించలేదట. అదే మహిళలు ఒంటరితనం అనుభవించాల్సి వచ్చినప్పుడు శారీరక, మానసిక ఆరోగ్యాలను కోల్పోవాల్సి వచ్చిందట.
సంబంధిత కథనం