Diabetes: డయాబెటిస్ ఉంటే ఊపిరితిత్తుల ఆరోగ్యం క్షీణిస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారు-does diabetes affect lung health what are the doctors saying ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diabetes: డయాబెటిస్ ఉంటే ఊపిరితిత్తుల ఆరోగ్యం క్షీణిస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారు

Diabetes: డయాబెటిస్ ఉంటే ఊపిరితిత్తుల ఆరోగ్యం క్షీణిస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారు

Haritha Chappa HT Telugu
Jan 15, 2025 10:30 AM IST

Diabetes: డయాబెటిస్ ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని వల్ల శరీరంలోని ఇతర ప్రధాన అవయవాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మధుమేహం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుందో లేదో తెలుసుకుందాం.

డయాబెటిస్ ఉంటే ఊపిరితిత్తులు దెబ్బతింటాయా?
డయాబెటిస్ ఉంటే ఊపిరితిత్తులు దెబ్బతింటాయా? (Pixabay)

డయాబెటిస్ అనేది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేసే దీర్ఘకాలిక పరిస్థితి. ఇది ఒక్కసారి వచ్చిదంటే జీవితాంతం వెన్నాడుతుంది. దీనిని పూర్తిగా నివారించే చికిత్స లేకపోయినా, మందులు మంచి జీవనశైలి ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు. డయబెటిస్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండకపోతే మూత్రపిండాలు, గుండె, కాలేయం వంటివి ఎంతో ప్రభావితం అవుతాయి. అలాగే ఊపిరితిత్తులపై కూడా చెడు ప్రభావం పడే అవకాశం ఉంది.

yearly horoscope entry point

ముంబైలోని సైఫీ ఆసుపత్రి కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ షెహ్లా షేక్ ఇంటర్వ్యూలో "ఊపిరితిత్తుల శక్తి సామర్ధ్యాలు, వాయుమార్గాల పనితీరు, కార్బన్ మోనాక్సైడ్ కోసం పల్మనరీ వ్యాప్తి సామర్థ్యాన్ని డయాబెటిస్ తగ్గిస్తుంది. దీని వల్ల ఊపిరితిత్తుల పరిమాణం తగ్గుతుంది, డయాబెటిస్ ఉన్నవారి శ్వాసకోశ కండరాలు పనిచేయవు. వారి ఊపిరితిత్తులు పూర్తిగా తెరుచుకోలేకపోవడం వల్ల శ్వాస సరిగా ఆడనట్టు అనిపిస్తుంది. అలాంటప్పుడు చాలా అలసటగా అనిపిస్తుంది’ అని వివరించారు.

డయాబెటిస్ న్యూరోపతి అంటే ఏమిటి?

డయాబెటిస్ న్యూరోపతి అనేది చాలా సాధారణ సమస్య, ఇది సాధారణంగా నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అందువల్ల పల్మనరీ విధులను తగ్గించడానికి వాయుమార్గాలను సర్దుబాటు చేస్తుంది. ఇది సాధారణంగా వాయుమార్గాల సామర్థ్యాన్ని పెద్దదిగా చేస్తుంది, కాబట్టి రోగికి ఊపిరితిత్తుల్లో ఏర్పడిన చికాకులు లేదా వ్యాధికారకాలను క్లియర్ చేయడం కష్టంగా మారుతుంది. ఆ సమయంలో సరిగా ఊపిరి ఆడనట్టు అనిపిస్తుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు ఆ వ్యాధిని అదుపులో ఉంచుకోవాలి.

డయాబెటిస్ ఉన్నవారి ఊపిరితిత్తులు త్వరగా అంటువ్యాధుల బారిన పడేలా చేస్తుంది. డయాబెటిస్ పల్మనరీ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఎండోక్రినాలజిస్ట్ మాట్లాడుతూ, "వాయుమార్గ ఉపరితల ద్రవంలో అధిక గ్లూకోజ్ ఉండడం వల్ల రోగనిరోధక శక్తి త్వరగా స్పందించదు. డయాబెటిస్ ఉన్నవారిలో పల్మనరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం మరింత పెరుగుతుంది. అధిక స్థాయిలో ఆక్సీకరణ ఒత్తిడి ఉండటం వల్ల క్లియరెన్స్ వ్యవస్థ సహాయం సరిగా పని చేయదు. ఇలాంటి సమయంలో అంటువ్యాధులు, నిమోనియా వంటివి త్వరగా సోకుతాయి.

క్షయవ్యాధి ప్రమాదం?

డయాబెటిస్ ఉన్నవారిలో ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది. అలాగే వారు క్షయవ్యాధికి గురయ్యే అవకాశం కూడా ఎక్కువే. డయాబెటిక్ రోగులకు క్షయవ్యాధి వచ్చే అవకాశం కూడా ఎక్కువ. తక్కువ రోగనిరోధక శక్తి కారణంగా ఊపిరితిత్తుల సమస్య కూడా ఎక్కువగా వస్తుంది.

డయాబెటిస్ ఉన్నవారు నిత్యం రక్తంలో చక్కెర స్థాయిలను చూసుకుంటూ ఉండాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అధికంగా ఉండే అన్ని అవయవాలపై ప్రభావం పడుతుంది. అందుకే ఆహారపు అలవాట్లు, వ్యాయామం, మందులు ద్వారా అదుపులోనే ఉంచుకోవాలి. ప్రతిరోజూ అరగంట పాటూ వ్యాయామాలు చేయాలి. పంచదార, మైదాలపై చేసిన ఆహారాన్ని పూర్తిగా మానేయాలి. అధిక ఫైబర్ ఉండే ఆహారాన్ని తీసుకోవాి. అధికబరువును తగ్గించుకోవాలి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner