Apple Cider Veniger: భోజనానికి ముందు ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే బరువు తగ్గుతారా లేక పెరుగుతారా..? ఎలా తీసుకోవాలి?
Apple Cider Veniger: బరువు తగ్గాలనుకునే వారికి ఆపిల్ సైడర్ వెనిగర్ నిజంగానే సహాయపడుతుందా? భోజనానికి ముందు దీన్ని తీసుకోవడం మంచిదేనా? వెయిట్ లాస్ కోసం ప్రయత్నించే వారు ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
ఆపిల్ సైడర్ వెనిగర్ (Apple Cider Venegar) బరువు తగ్గడానికి సహాయపడే సాధనమని చాలా మంది చెబుతున్నారు. భోజనానికి ముందు దీన్ని తీసుకోవడం వల్ల కిలోల కొద్దీ బరవుతు తగ్గుతారనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఆపిల్ సైడర్ వెనిగర్ నిజంగానే సహాయపడుతుందా? భోజనానికి ముందు దీన్ని తీసుకోవడం మంచిదేనా? వెయిట్ లాస్ కోసం ప్రయత్నించే వారు ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఎలా ఉపయోగించాలో వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం.

ఆపిల్ సైడర్ తీసుకోవడం వల్ల బరువు తగ్గడమనేది వాస్తవమే అయినప్పటికీ దీన్ని తీసుకునే పద్ధతి, వ్యక్తుల శరీర స్థితిని బట్టి కూడా ఫలితాలు కనిపిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. బరువు తగ్గడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ పాత్ర ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
ఆపిల్ సైడర్ వినిగర్ బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుంది:
1. ఆహారం ఆకలిని తగ్గించడం: ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే యాసిటిక్ యాసిడ్ ఆకలిని తగ్గించి, తినే ఆహారాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది, దీని ద్వారా తక్కువ కాలరీలు తీసుకుంటారు.బరువును నియంత్రణలో ఉంచుకోగలుగుతారు.
2. మేటాబాలిజం పెంచడం: కొన్ని అధ్యయనాల ప్రకారం ఆపిల్ సైడర్ వెనిగర్ మేటాబాలిజాన్ని పెంచి శరీరం కాలరీలను మెరుగ్గా కాల్చడానికి సహాయపడుతుంది.
3. రక్తంలో చక్కెర నియంత్రణ: ఆపిల్ సైడర్ వినిగర్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించడంలో దీని పాత్ర ఎక్కువగా ఉంటుంది.
4. కొవ్వు కరిగించడం: ఆపిల్ సైడర్ వెనిగర్ (Apple Cider Venegar) కొవ్వు కరిగించడానికి సహాయపడే చక్కటి పదార్థం. కొవ్వు ఆక్సిడేషన్ పెంచి యాసిటిక్ యాసిడ్ కొవ్వును సమర్థంగా కరిగించడంలో చేయడంలో సహాయపడుతుంది.
5. అరుగుదలను మెరుగుపరచడం: ఆపిల్ సైడర్ వెనిగర్ అరుగుదలను మెరుగుపరచి అజీర్తి, గ్యాస్, వికారం వంటి సమస్యలను తగ్గించి.
భోజనానికి ముందు ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే బరువు తగ్గుతారా?
పరిశోధనల ప్రకారం.. ఆపిల్ సైడర్ వెనిగర్‌ను భోజనానికి ముందు తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారన్నది వాస్తవం. ఇలా చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్ దాదాపు 30 శాతం తగ్గుతుంది. ఇందులోని యసిడిక్ యాసిడ్ కార్బోహ్రైడేట్ లను చక్కెరగా విచ్ఛిన్నం చేసే ప్రక్రియను నెమ్మదిస్తుంది. ముఖ్యంగా ప్రీ-డయాబెటిక్ లేదా డయాబెటిస్ ఉన్నట్లయితే ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బరువు తగ్గడంలో చాలా బాగా సహాయపడుతుంది. అలాగే గొంతులో, కడుపులో ఉంటే చికాకులు, సమస్యలను తగ్గిస్తుంది.
బరువు తగ్గడానికి ACVని ఎలా ఉపయోగించాలి..?
⦿ భోజనానికి 20 నుంచి 30 నిమిషాల ముందు 1-2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకుని ఒక గ్లాసు నీటితో కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల తక్కువ ఆహారాన్ని తీసుకోవడంతో పాటు అరుగుదుల బాగుంటుంది.
⦿ నీళ్లలో ఆపిల్ సైడర్ వెనిగర్ తో పాటుగా తేనెను కూడా కలుపుకుని తాగారంటే ఇది రుచికరంగా అనిపించడంతో పాటు యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది.
⦿ భోజనానికి ముందు సలాడ్ లలో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు.
ఆపిల్ సైడర్ వెనిగర్ తో పాటుగా ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడాన్ని దినచర్యగా మార్చుకున్నారంటే అతి తక్కువ సమయంలోనే కిలోల్లో బరువు తగ్గుతారు.
సంబంధిత కథనం
టాపిక్