Alarm Sound Effects: అలారం శబ్దం వినందే నిద్ర లేవలేరా? ఈ అలవాటు మీ మూడ్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?-does alarm sound affect your mood find out what the studies say ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Alarm Sound Effects: అలారం శబ్దం వినందే నిద్ర లేవలేరా? ఈ అలవాటు మీ మూడ్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?

Alarm Sound Effects: అలారం శబ్దం వినందే నిద్ర లేవలేరా? ఈ అలవాటు మీ మూడ్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?

Ramya Sri Marka HT Telugu
Jan 21, 2025 08:30 AM IST

Alarm Sound Effects: అలారం సౌండ్ వినకుండా ఉదయాన్నే నిద్రలేవలేకపోతున్నారా? ఇలా ప్రతి రోజూ అలారం శబ్దం వింటూ నిద్ర లేవడం ఆరోగ్యానికి మంచిదేనా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఉదయాన్నే అలారం సౌండ్ వింటూ లేవడం వ్యక్తుల మూడ్‌ను ప్రభావితం చేస్తుందని స్టడీలు చెబుతున్నాయి. ఎలాగో తెలుసుకోండి

అలారం శబ్ధం మీ మూడ్‌ను చెడగొడుతుందా?
అలారం శబ్ధం మీ మూడ్‌ను చెడగొడుతుందా?

ఉదయాన్నే అలారం సౌండ్ వింటే గానీ మెలకువ రాని వారు చాలా మంది ఉంటారు. అలారం శబ్బం వినీ వినగానే లేచేవారు కొందరైతే మళ్లీ మళ్లీ రిపీట్ చేసుకుని నిద్రపోయే వారు మరికొందరు. అలారం మోగగానే చటుక్కున నిద్రలేచే వారు మరికొందరు. ఏదేమైనప్పటికీ చాలా మంది రోజు మొదలవుతుంది ఈ అలారం సౌండ్ తోనేనట. ఇంత మంది దైనందిన జీవితంలో భాగమైన అలారం శబ్దం మీ ఆరోగ్యానికి మంచిదేనా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి రోజూ ఈ సౌండ్ తో నిద్ర లేచే అలవాటు మీ మూడ్ ను చెడగొడుతుంది అంటే నమ్ముతారా? దీని గురించి అధ్యయనాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం రండి.

అలారం శబ్ధంతో లేస్తే మూడ్ చెడిపోతుందా?

అలారం శబ్ధం ఒత్తిడి స్థాయిలను పెంచుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే వ్యక్తి గాఢ నిద్రలో ఉన్నప్పుడు అలారం శబ్ధం అకస్మాత్తుగా లేపుతుంది ఆలోచనా సామర్థ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ఎలాగంటే..

1. ఒత్తిడి , ఆందోళన

మంచి నిద్రలో ఉన్న మీరు అలారం మోగినప్పుడు మీరు హఠాత్తుగా మేల్కొంటారు. ఇది శరీరంలోని ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది. ప్రత్యేకంగా అడ్రినలిన్ , కార్టిసోల్ వంటి ఆందోళన, కోపాన్ని పెంచే హార్మోన్లను విడుదల చేస్తాయి. నిరాశ తెచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.

2. మెదడుపై ప్రతికూల ప్రభావం

నిద్రలో నుంచి ప్రశాంతంగా, మెల్లిగా మేల్కొనకపోతే మెదడు పనితీరు దెబ్బతింటుంది. దీన్నే స్లీప్ ఇనెర్టియా అంటారు. ఇది మళ్లీ మీరు నెమ్మదిగా స్పందించడాన్ని, మేధోపరమైన పనితీరును కుంగదీస్తుందని పరిశోధనలు తెలిపాయి.తీవ్రమైన శబ్దంతో నిద్రలేవడం ఆందోళనను పెంచుతుందని పరిశోధనలు చెప్తున్నాయి.

3. ఆందోళన , మూడ్ మార్పు

మీరు ఎంత సేపు నిద్రపోయారు అనే దానితో పాటు ఎలా మేల్కొన్నారు అనేది కూడా మీ మూడ్‌పై ప్రభావం చూపిస్తుంది. మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు అలారం మోగితే,సడెన్ గా మీకు మెలకువ వస్తుంది. అది "స్లీప్ ఇనెర్టియా" అనేది కలిగిస్తుంది. ఇది వ్యక్తి మూడ్‌ను చెడగొడుతుంది. చిరాకు, కోపం, నీరసం వంటి భావాలను కలిగిస్తుంది. ఇవి రోజంతా కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఈ సమస్య నుంచి తప్పించుకోవడం ఎలా?

  • అలారం లేనిదే మెలకువ రాదు అంటే తప్పదు అంటే మీరు ప్రత్యేకమైన మృదువైన సంగీతం వినిపించేలా పెట్టుకోవాలి. అలారం కోసం వివిధ రకాల శబ్ధాలను ఎంచుకుంటారు. ఈ శబ్ధాల ప్రభావం మూడ్, శరీరంపై విభిన్నంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. బిగ్గరగా ఉండే సంగీతాన్ని పెడితే, ఆ శబ్ధం విని అకస్మాత్తుగా లేవడం వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది.
  • మృదువైన, ప్రశాంతమైన శబ్ధాలతో మేల్కొంటే శరీరాన్ని ఒత్తిడి నుండి కాపాడుకోవచ్చు. అందువల్ల మీరు పెట్టుకునే అలారం టోన్ తక్కువ శబ్దంతో నెమ్మదిగా వినిపించేదైతే ఒత్తిడి ఉండదు.
  • ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. అలారాన్ని మళ్లీ మళ్లీ స్పూజ్ చేసుకుని ఎక్కువ సార్లు నిద్రలోంచి లేవకుండా చూసుకోండి. లేవాలనుకుంటే వెంటనే లేవండి, వద్దనుకుంటే నిద్రపోండి. నిద్ర మధ్యలో ఎక్కువ సార్లు మేల్కొనడం మానసిక, శారీరక ఆరోగ్యానికి మంచిది కాదు.

Whats_app_banner

సంబంధిత కథనం