Samantha viral post: సమంతాను జైల్‌లో పెట్టాలన్న డాక్టర్.. దానికి కారణమైన పోస్ట్ ఇదే..-doctor slammed samantha for posting about hydrogen peroxide nebulizer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Samantha Viral Post: సమంతాను జైల్‌లో పెట్టాలన్న డాక్టర్.. దానికి కారణమైన పోస్ట్ ఇదే..

Samantha viral post: సమంతాను జైల్‌లో పెట్టాలన్న డాక్టర్.. దానికి కారణమైన పోస్ట్ ఇదే..

Koutik Pranaya Sree HT Telugu
Jul 04, 2024 08:46 PM IST

Samantha viral post: హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజేషన్ గురించి సమంత పెట్టిన పోస్టు మీద డాక్టర్లు స్పందించారు. తీవ్రమైన కామెంట్లు చేశారు. ఆ పోస్టు, డాక్టర్ అభిప్రాయాలు చూడండి.

హైడ్రోజెన్ పెరాక్సైడ్ నెబ్యులైజర్ తో సమంతా
హైడ్రోజెన్ పెరాక్సైడ్ నెబ్యులైజర్ తో సమంతా (Instagram/samantharuthprabhuoffl, Unsplash)

సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్న ఫోటో ఒకటి చర్చనీయాంశమైంది. ఆ ఫోటోలో సమంతా నెబ్యులైజర్ సాయంతో మెడిసిన్ తీసుకుంటోంది. “సాధారణ వైరల్ మందులు తీసుకునే ముందు, ప్రత్యామ్నాయాన్ని పరిగణించండి. హైడ్రోజన్ పెరాక్సైడ్, డిస్టిల్డ్ వాటర్ మిశ్రమంతో ఆవిరి పట్టడం మంచి ఎంపిక. ఇది మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. అవనవసరంగా మాత్రలు మింగడం మానుకోండి.” అని సమంత స్టోరీలో రాసుకొచ్చింది.

In the picture shared on her Instagram story, Samantha can be seen taking a viral medication with the help of a nebuliser.
In the picture shared on her Instagram story, Samantha can be seen taking a viral medication with the help of a nebuliser. (Instagram/@samantharuthprabhuoffl)

సమంతా పెట్టిన స్టోరీ గురించి ముంబైలోని వోక్హార్డ్ హాస్పిటల్స్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ రితూజా ఉగల్ముగ్లే స్పందించారు. హెచ్‌టీ లైఫ్‌స్టైల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడారు. ఇంటి చిట్కాలు, ఇతర చికిత్సలతో పాటూ, హైడ్రోజన్ పెరాక్సైడ్ (H₂O₂), డిస్టిల్డ్ వాటర్ మిశ్రమంతో నెబ్యులైజేషన్ చేయడం చాలా సందర్భాల్లో చర్చించిన విషయం. కానీ భద్రత, ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని సరైన వైద్య విధానాలను అనుసరించడం మంచిదని ఆయనన్నారు.

హైడ్రోజన్ పెరాక్సైడ్, డిస్టిల్డ్ వాటర్ వల్ల కలిగే అనర్థాలను డాక్టర్ రితుజా ఉగల్ముగ్లే వివరించారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, డిస్టిల్డ్ వాటర్ నెబ్యులైజేషన్ వల్ల కొన్ని ప్రమాదాలూ ఉంటాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్, శ్లేష్మ పొరలో చికాకు, మరిన్ని శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్న కారణంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ సాధారణంగా నెబ్యులైజేషన్ కోసం సిఫార్సు చేయరు.

హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజేషన్ వల్ల వచ్చే ఇబ్బందులు:

ఆక్సీడేటివ్ స్ట్రెస్:

హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక బలమైన ఆక్సీకరణ ఏజెంట్. నెబ్యులైజ్ చేసినప్పుడు, పీల్చినప్పుడు, ఇది ఆక్సీడేటివ్ స్ట్రెస్ పెంచి ఊపిరితిత్తుల కణజాలాలకు నష్టం కలిగిస్తుంది.

శ్లేష్మపొర:

హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చడం వల్ల శ్వాసనాళంలోని శ్లేష్మ పొరను చికాకుపెడుతుంది. ఇది దగ్గు, గొంతు చికాకు, మరింత తీవ్రమైన శ్వాసకోశ బాధలకు దారితీస్తుంది.

సైటోటాక్సిసిటీ:

హైడ్రోజన్ పెరాక్సైడ్ శ్వాసనాళంలోని ఎపిథీలియల్ కణాలకు సైటోటాక్సిక్ కావచ్చు. అంటే దీనివల్ల కణాలు, కణజాలం నశింపవచ్చు.

గాయాలు:

హైడ్రోజన్ పెరాక్సైడ్‌కి ఉండే అధిక సాంద్రత వల్ల శ్వాసనాళానికి రసాయనికంగా కాలిన గాయాలకు కారణమవ్వచ్చు. తీవ్రమైన నష్టంతో పాటూ అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

సంక్రమణ ప్రమాదం:

నాన్ స్టెరైల్ ద్రావణాలను ఉపయోగించడం లేదా సరిగ్గా వాటిని వాడకపోవడం వల్ల వ్యాధికారక క్రిములు లోపలికి వెళ్తాయి. ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.

తీవ్రంగా స్పందించిన మరో డాక్టర్:

సమంత పెట్టిన పోస్టుపై మరో డాక్టర్ సిరియాక్ అబ్బీ ఫిలప్స్ తీవ్రంగా స్పందించారు. ది లివర్ డాక్ పేరుతో సోషల్ మీడియాలో ఉన్న ఆయన సమంత చెప్పిన నెబ్యులేషన్ విధానం వల్ల ఆరోగ్యంమీద తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. ఆరోగ్యం, సైన్స్ విషయంలో తనొక నిరక్ష్యరాస్యురాలు అన్నారాయన. దురదృష్టవశాత్తూ తనకున్న మిలియన్ల మంది ఫాలోయర్లకు శ్వాసకు సంబంధించిన వైరల్ ఇన్ఫెక్షన్లు నయం చేయడానికి హైడ్రోజెన్ పెరాక్సైడ్ పీల్చమని సలహా ఇస్తున్నారామె అని ఆయనన్నారు.

ఇలాంటి పోస్ట్ పెట్టి జనాల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టినందుకు “తనకు జరిమానా విదించాలి. లేదంటే జైల్ లో పెట్టాలి” అన్నారు.. తనకు సహాయం అవసరమని, తన టీమ్ లో మంచి అడ్వైసర్ అవసరం ఉందంటూ ఘాటుగా స్పందించారు.

 

WhatsApp channel