మీ పొట్ట ఫ్లాట్‌గా మారాలనుకుంటున్నారా? అయితే ప్రతిరోజు ఈ భుజంగాసనం వేయండి-do you want your stomach to become flat then do this bhujangasana every day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మీ పొట్ట ఫ్లాట్‌గా మారాలనుకుంటున్నారా? అయితే ప్రతిరోజు ఈ భుజంగాసనం వేయండి

మీ పొట్ట ఫ్లాట్‌గా మారాలనుకుంటున్నారా? అయితే ప్రతిరోజు ఈ భుజంగాసనం వేయండి

Haritha Chappa HT Telugu

పొట్ట పెరిగి ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య ఎక్కువే. అలాంటి వారికి యోగాలో భుజంగాసనం ఉపయోగపడుతుంది. దీన్ని పాము భంగిమగా చెప్పుకుంటారు. యోగాలో ఇది ఒక ప్రముఖ ఆసనం.

భుజంగాసనం

పొట్ట చుట్టూ కొవ్వు చేరి అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. మీరు పొట్టను ఫ్లాట్ గా మార్చుకోవాలనుకుంటే అందుకు యోగాను ఉపయోగించుకోవచ్చు. యోగాలో భుజంగాసనం ఉంది. దీన్ని పాము భంగిమగా చెప్పుకుంటారు.

భుజంగాసనం యోగాలో ఇది ప్రముఖ ఆసనంగానే వివరిస్తారు. దీన్ని ప్రతిరోజు చేయడం వల్ల మీ పొట్ట ఫ్లాట్ గా మారుతుంది. ఈ భుజంగాసనాన్ని కోబ్రా పోజ్ అని కూడా అంటారు. దీన్ని పొట్టపై పడుకొని చేస్తారు. కాబట్టి పొట్టపై ఇది అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల పొట్ట టోన్డ్ గా మారుతుంది. అంటే ఫ్లాట్‌గా మారుతుంది.

పొట్ట కొవ్వు కరుగుతుంది

భుజంగాసనం వేయడం వల్ల వెన్నెముక బలంగా మారుతుంది. చాతీ, భుజాలు, పొట్ట వంటి భాగాలు సాగదీసినట్టు అవుతాయి. ఇది పొట్టపై ఒత్తిడిని కలిగిస్తుం.ది దీనివల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరగడం మొదలవుతుంది. మీరు ప్రతిరోజు భుజంగాసనం వేస్తూ ఉంటే నెల రోజుల్లోనే మీకు బొడ్డు దగ్గర కొవ్వు తగ్గడం గమనించవచ్చు.

ఈ భుజంగాసనం వేయడం వల్ల కేవలం పొట్ట తగ్గడమే కాదు. చేతులకు, కండరాలు కూడా బలంగా మారుతాయి. ఇది వెన్నుముకకు ఎంతో ఉపయోగపడుతుంది. ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. అంటే వెన్నెముక పట్టేసినట్టు కాకుండా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఈ ఆసనం వేయడం వల్ల అవి మీ వీపు కండరాలు కూడా బలంగా మారుస్తాయి. ఇది వెన్ను నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల భుజంగాసనం వెన్నుముకకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది.

భుజంగాసనం వేయడం వల్ల పొట్టలోని అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరం వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. పొట్టపై తేలికపాటి ఒత్తిడిని కలిగించి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ ఆసనం పొట్టలో రక్తప్రసరణ కూడా మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలోని ఇతర అవయవాలకు ఆక్సిజన్ ను పోషకాలను అందేలా చేస్తుంది.

ఆస్తమా ఉన్నవారు

ఆస్తమాతో బాధపడుతున్న వారు భుజంగాసనం వేయడం చాలా మంచిది. ఎందుకంటే ఇది ఛాతీని విస్తరించేలా చేస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆక్సిజన్ తీసుకోవడం పెంచుతుంది. దీనివల్ల ఆస్తమా లక్షణాలు చాలా వరకు తగ్గుతాయి. ఈ ఆసనం మెరుగైన శ్వాసను ఇస్తుంది. శ్వాసకోశ కండరాలను బలంగా మారుస్తుంది.

మానసిక ఆరోగ్యానికి కూడా భుజంగాసనం ఎంతో ముఖ్యం. ఇది ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. దీనివల్ల డిప్రెషన్ బారిన పడే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. భుజంగాసనాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేస్తే మీ మెదడు ఉత్తేజితమవుతుంది.

భుజంగాసనం ఎలా వేయాలి?

ఈ ఆసనం వేసేందుకు ముందుగా బోర్లా పడుకోండి. చేతులను చాతీకి ఇరువైపులా ఉంచి విశ్రాంతిగా పడుకోండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ అరచేతులను నేలపై అదిమిపెట్టి తల... ఆ తర్వాత ఛాతీ, ఆ తర్వాత నడుము భాగం వరకు పైకి లేపాలి. కొన్ని సెకన్ల పాటు అదే ఆసనంలో ఉండాలి. పాము తన శరీరం మొత్తాన్ని కిందనే ఉంచి నడుము నుంచి తలభాగం వరకు ఎలా పైకి ఎత్తుతుందో అలాగే ఈ భుజంగాసనాన్ని వేయాలి. అందుకే దీన్ని కోబ్రా పోజ్ అని కూడా పిలుస్తారు. కొన్ని సెకన్ల పాటు అలా ఉండి తర్వాత నెమ్మదిగా బోర్లా పడుకోవాలి. మళ్ళీ అదే ఆసనాన్ని ప్రయత్నించాలి. ఇలా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ఉదయం మూడు నాలుగు నిమిషాల పాటు ప్రయత్నించండి. మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.