Maggi Powder: మీకు మ్యాగీ మసాలా పొడి కావాలా? ఇంట్లోనే ఇలా తయారు చేసేయండి రెసిపీ ఇదిగో-do you want maggi masala powder here is the recipe to make it at home ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Maggi Powder: మీకు మ్యాగీ మసాలా పొడి కావాలా? ఇంట్లోనే ఇలా తయారు చేసేయండి రెసిపీ ఇదిగో

Maggi Powder: మీకు మ్యాగీ మసాలా పొడి కావాలా? ఇంట్లోనే ఇలా తయారు చేసేయండి రెసిపీ ఇదిగో

Haritha Chappa HT Telugu

Maggi Powder: మ్యాగీ చాలా సింపుల్ గా ఉంటుంది.అయితే దానికి కావాల్సిన మసాలా తయారు చేయడం కూడా అంతే సులభం.ఒకసారి మ్యాగీ మసాలా రెడీ చేసుకుంటే ఏళ్ల తరబడి తినొచ్చు.. రెసిపీ ఇదిగో.

మ్యాగీ మసాలా పొడి తయారీ

మ్యాగీ అంటే పిల్లలందరికీ ఎంతో ఇష్టం. మ్యాగీలో వేసే మసాలా వల్ల దానికి మంచి రుచి వస్తుంది. ఆ మసాలా పొడి కోసమే ఎక్కువ మంది మ్యాగీ ప్యాకెట్లను కొంటూ ఉంటారు. నిజానికి మ్యాగీ మసాలాను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. దీన్ని తయారుచేయడం చాలా సులభం. ఇది రుచిగా ఉంటుంది. ఒక్కసారి తయారు చేసుకుంటే ఇది ఆరు నెలల పాటూ తాజాగా ఉంటుంటుంది. ఒక్కసారి దీన్ని వండుకుని చూడండి మీకు నచ్చడం ఖాయం.

మ్యాగీ మసాలా రెసిపీకి కావాల్సిన పదార్థాలు

ధనియాలు - మూడు టీస్పూన్లు

జీలకర్ర - అర స్పూను

సోంపు - ఒక స్పూను

మిరియాలు - అర స్పూను

యాలకులు - నాలుగు

లవంగాలు - నాలుగు

మెంతులు - పావు టీస్పూన్

జాజికాయ - చిన్న ముక్క

దాల్చినచెక్క - చిన్న ముక్క

ఎండుమిర్చి - నాలుగు

పసుపు - అర స్పూను

ఉల్లిపాయ పొడి - ఒక స్పూను

వెల్లుల్లి పొడి - అర స్పూన్

ఆమ్చూర్ పొడి - ఒక స్పూన్

కార్న్ ఫ్లోర్ - ఒక స్పూన్

టమోటా పౌడర్ - మూడు స్పూన్లు

మ్యాగీ మసాలా పొడి రెసిపీ

  1. స్టవ్ పైన కళాయి పెట్టి ధనియాలు, జీలకర్ర, సోంపు గింజలు, నల్ల మిరియాలు, యాలకులు, లవంగాలు, మెంతులు, జాజికాయ, దాల్చినచెక్క, ఎండుమిర్చి వేసి వేయించాలి.
  2. అన్నీ వేగాక వాటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
  3. ఆ పొడిలోనే ఉప్పు, పసుపు, వెల్లుల్లి పొడి, ఆమ్చూర్ పొడి, కార్న్ ఫ్లోర్ పొడి వేసి మళ్లీ మిక్సీని ఒక్కసారి తిప్పాలి.
  4. చివరగా ఉల్లిపాయ పొడి, కార్న్ ఫ్లోర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి.
  5. ఈ మొత్తం మిశ్రమాన్ని గాలి చొరబడని డబ్బాలో వేసి భద్రపరుచుకోవాలి.
  6. ఇది ఆరు నెలల పాటూ తాజాగా ఉంటుంది. దీనిలో నూడుల్స్ వండుకుని తింటే రుచిగా ఉంటుంది.
  7. దీన్ని ఒక్కసారి చేసుకుని చూడండి మీకు కూడా ఎంతో నచ్చుతుంది. ఇంట్లోనే చేసినది కాబట్టి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపము. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.