Tickling in Kids: పిల్లలకు చక్కిలిగింతలు పెట్టడం మీకు సరదాగా అనిపిస్తుందా? నిజానికి అది పిల్లలకు చాలా ప్రమాదకరం
Tickling in Kids: చాలామంది పిల్లలకు కితకితలు పెట్టి నవ్వించడానికి ప్రయత్నిస్తారు. అవి పెట్టే వారికి సరదాగా ఉండొచ్చు... కానీ పిల్లలకు మాత్రం చాలా హానికరం. అది వారిలో కొన్ని ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.
పిల్లలకు చక్కిలిగింతలు పెట్టి నవ్వించడం అనేది ప్రతి ఇంట్లో జరిగేది. చిన్నపిల్లలకి ఇలా ఎక్కువగా కితకితలు పెడుతూ ఉంటారు. అయితే నిపుణులు చెబుతున్న ప్రకారం ఇది మంచి అలవాటు కాదు. మీకు తెలియకుండానే పిల్లలను బాధపెట్టే ఆట ఇది. కనీసం పిల్లలు కూడా అది బాధించే పని అని అర్థం చేసుకోలేరు. వారికి కూడా అది ఆనందంగానే ఉంటుంది. కానీ వారిలో ఎన్నో ఆరోగ్య సమస్యలు రావడానికి ఈ చక్కిలిగింతలు కారణం అవుతాయి.
కితకితలు పెట్టినప్పుడు ఏం జరుగుతుంది?
పిల్లలకు కితకితలు పెట్టడం వల్ల అది నేరుగా మెదడులో ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రతి ఒక్కరి మెదడులో ఒక చిన్న హైపోథాలమస్ అనే గ్రంధి ఉంటుంది. కితకితలు పెట్టినప్పుడు ఈ హైపోథాలమస్ గ్రంధిలో విపరీతమైన ప్రేరేపణలు కలుగుతాయి. ఆ ప్రేరేపణలు నేరుగా మెదడు మొదలు అంటే కాండం దగ్గర ప్రభావాన్ని చూపిస్తుంది.ఈ హైపోథాలమస్ గ్రంధి కూడా బాదంపప్పు ఆకారంలో అక్కడే ఉంటుంది. ఇది భావోద్వేగాలను, ఒత్తిడితో కూడిన పరిస్థితులను తట్టుకునేందుకు శరీరానికి సహాయపడుతూ ఉంటుంది. మీరు ఏదైనా ప్రమాదంలో ఉన్నారని గుర్తించి నీకు ఆ విషయాన్ని తెలియజేసేది హైపోథాలమస్ గ్రంధి. అయితే చక్కిలిగింతలు పెట్టడం వల్ల ఈ హైపోథాలమస్ గ్రంధి అతిగా ప్రవర్తించడం మొదలవుతుంది. ఇది పిల్లలపై దీర్ఘకాలికంగా ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది.
హైపోక్సియా
ప్రతిరోజూ ఎక్కువగా పిల్లలకు చక్కిలిగింతలు పెడితే ఉంటే ఆ వ్యక్తికి శ్వాస అందడం కష్టమైపోతుంది. దీనివల్ల శరీరం మొత్తానికి ఆక్సిజన్ ఒకేలా సరఫరా కాదు. దీని వల్ల ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. ఇది హైపోక్సియా అనే సమస్యకు కారణం అవుతుంది.
అలాగే ప్రతిరోజు తీవ్రంగా చక్కిలిగింతలు పెట్టడం వల్ల కండరాల నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇది తాత్కాలికంగానైనా పిల్లలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. తాత్కాలికంగా పక్షవాతం బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమస్యను కాటాప్లెక్సీ అని కూడా అంటారు.
చక్కిలిగింతలు పెట్టినప్పుడు కొందరు పిల్లల్లో తీవ్రభయాందోళనలు కలుగుతాయి. అలాగే అసౌకర్యంగా కూడా అనిపిస్తుంది. ముఖ్యంగా వారికి తట్టుకునే శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఇలా వారిలో భయాందోళనలు కలుగుతాయి. కాబట్టి మీ పిల్లలకు కితకితలు పెట్టడం మంచి పద్ధతి కాదు.
కొందరు పిల్లలపై అతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారు వద్దంటున్నా కూడా చక్కిలిగింతలు పెడుతూ ఉంటారు. కొందరు పిల్లలు శరీరం అవి తట్టుకోలేక వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మూత్రాన్ని నియంత్రించలేని పరిస్థితి వస్తుంది. శ్వాస తీసుకోలేకపోవడం వంటివి కూడా కనిపిస్తాయి.
చక్కిలిగింతలు పెట్టడం అనేది చూసేందుకు సరదాగా అనిపించవచ్చు. కానీ పిల్లల్లో మాత్రం బాధ. భయం వంటివి ఎక్కువ అయ్యేందుకు కారణం అవుతుంది. కాబట్టి కితకితలు పెట్టడం కూడా ఒక రకమైన హింసేనని అంటారు. వైద్య నిపుణులు ఎక్కువసేపు కితకితలు పెట్టడం వల్ల వారికి అసౌకర్యంగా, అవమానంగా అనిపిస్తుంది. ఇది వారి మానసిక ప్రవర్తనలో కూడా మార్పు తెచ్చే అవకాశం ఉంది. నిజానికి కితకితలు పెట్టడం అనేది ఒక అనాగరికమైనదిగా వైద్యులు చెబుతూ ఉంటారు. కాబట్టి సరదాగా కూడా మీ పిల్లలకు కితకితలు పెట్టేందుకు ప్రయత్నించకండి. మీకు తెలియకుండానే వారిపై ఎంతో ప్రభావం పడుతుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం
టాపిక్