ఎగ్జిమాకు సాధారణ రూపం అయిన ఎటోపిక్ డెర్మటైటిస్ అనేది లక్షలాది మంది బాధపడుతున్న సమస్య. రోజువారీ జీవితంలో దురద, చర్మంపై అక్కడక్కడ దద్దుర్లు వంటి రూపంలో సమస్యలు చూస్తూనే ఉంటారు. ఈ పరిస్థితిని నియంత్రించడానికి మీ దినచర్యల్లో కొద్దిపాటి మార్పులు చేసి, స్నానం చేసే పద్ధతిని మార్చుకుంటే సరిపోతుంది.
జపాన్ లో జరిపిన ఒక కొత్త స్టడీ ప్రకారం, నేరుగా నీరు పోసుకుని స్నానం చేసే విధానం కంటే, షవర్‌లో పడే నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకోవడం మంచిదట. ఇది చర్మ సమస్యలతో పోరాడే వారికి గణనీయమైన ఉపశమనం అందించవచ్చని సూచించింది.
ఫ్రంటియర్స్ ఇన్ ఇమ్యునాలజీలో ప్రచురించిన కథనంలో.. ఎటోపిక్ డెర్మటైటిస్ ఉన్న ఎలుకలలో అతి షవర్ బాత్ స్నానం తర్వాత చర్మవ్యాధి లక్షణాలు తగ్గుముఖం పట్టాయట. షవర్ బాత్‌లో ఒక మైక్రోమీటర్ కంటే చిన్న సైజులో చిన్న బుడగలు ఏర్పడతాయట. ఇవి నీటిని శుద్ధీకరించేందుకు ఉపయోగిస్తారు. ఇప్పుడు, ఆ నీరు చర్మ సంరక్షణలో, ముఖ్యంగా ఎగ్జిమా బాధితులకు ఉపశమనం కలిగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందట. షవర్ బాత్ సమయంలో అతి సూక్ష్మ బుడగలు చర్మ ఉపరితలంలోకి లోతుగా చొచ్చుకుపోయి, అలెర్జెన్లు, చికాకులను కలిగించే క్రిములను తొలగిస్తాయి. తద్వారా చర్మానికి రక్షణాత్మక అవరోధాన్ని బలోపేతం చేస్తాయి.
ఎటోపిక్ డెర్మటైటిస్ పై ఈ షవర్ బాత్ ఎలా పనిచేస్తుందనే విషయంపై ఎలుకలను మూడు గ్రూపులుగా విభజించి పరిశోధన జరిపారు. అతి సూక్ష్మ బుడగ షవర్లతో ట్రీట్మెంట్ తీసుకునే గ్రూపు, సాధారణ స్నానంతో చికిత్స తీసుకునే గ్రూపు, చికిత్స పొందని మరో గ్రూపు. వీటిపై జరిపిన పరిశోధనా ఫలితాలు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఇచ్చాయి. అతి సూక్ష్మ బుడగ షవర్లతో స్నానం చేయించిన ఎలుకల చర్మంలో గణనీయమైన మెరుగుదల కనిపించింది. వాపు కలిగించే ప్రొటీన్ల స్థాయి తగ్గడం, చర్మ వ్యాధులను అడ్డుకునే రక్షణ మెరుగవడం కనిపించాయి.
ఈ స్టడీలో ఎగ్జిమా అలర్జీని ఎదుర్కొంటున్న ఎలుకలలో మాత్రమే ఉత్తమ ఫలితాలు కనిపించాయి. ఫలితాలను బట్టి, ఎగ్జిమాతో పోరాడుతున్న వారికి, ఈ పరిశోధన ఆశాకిరణంగా అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. స్నానం చేయడంలో కొద్దిపాటి మార్పులు చేయడం వల్ల ఎగ్జిమా నుంచి విప్లవాత్మక మార్పులను తీసుకురావచ్చు.
ఎగ్జిమా (Eczema) అనే చర్మవ్యాధి నుంచి ఉపశమనం కోసం ఈ చిట్కాలు కూడా పాటించవచ్చు.
అలోవెరా జెల్ మృదువుగా ఉండే గుణాలు చర్మాన్ని శాంతిపరచి, మంటలు వేడి తగ్గించడంలో సహాయపడతాయి. అలోవెరా గుజ్జు తీసుకుని ప్రభావం కనిపించే ఏరియాలలో అప్లై చేయండి.
కొబ్బరినూనెలో ఎంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇది చర్మం హైడ్రేట్ చేయడానికి, పొడిబారడం తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
ఎగ్జిమా ఉన్న వారు చర్మం పొడిబారకుండా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ సమస్య ఉన్న వారు వాడే సబ్బులు, కెమికల్స్ లేకుండా ఉండేవి ఎంచుకోవడం బెటర్.
గోరువెచ్చని నీటిలో బేకింగ్ సోడా వేసి స్నానం చేయడం మంచిది. పడుకునే సమయంలో కిటికీ తీసి పడుకోవడం వంటివి చేయడం వల్ల ఫ్రెష్ ఎయిర్ తగిలి చర్మానికి శాంతిని ఇస్తుంది.
ఆహారంలో ఎక్కువగా చక్కెర, పాలు వంటివి తగ్గించుకోండి.
ఎగ్జిమా ఉన్న చర్మాన్ని తరచుగా మాయిశ్చరైజ్ చేయడం, బాడీ లోషన్స్ వాడడం వల్ల చర్మం మృదువుగా, సహజంగా ఉండటానికి సహాయపడుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం