రెగ్యూలర్ పనులకు వెళ్లే ముందు మనలో చాలా మందికి స్నానం చేయడం తప్పనిసరి పని. స్నానాన్ని చిన్నప్పటి నుంచి అలవాటు ప్రకారం హడావుడిగా కానిచ్చేస్తుంటాం. అందులో కొన్ని పొరబాట్లు కూడా యాదృచ్చికంగా జరిగిపోతుంటాయి. వాటి వల్ల మన ఆరోగ్యానికి హానికరం కూడా. అలాంటి ఒక చెడు అలవాటే స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేయడం. ఇది చాలా సాధారణమైన అలవాటుగా అనిపించినా, దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ చిన్న అలవాటు మీకు చాలా హానికరం. కాబట్టి, ఈ అలవాటు వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలిస్తే, మళ్ళీ ఈ రెండు పనులను ఒకేసారి చేయరు.
మీరు తరచుగా స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేస్తే, క్రమంగా అది అలవాటుగా మారుతుంది. భవిష్యత్తులో, నీటి శబ్దం విన్నప్పుడల్లా మీకు మూత్ర విసర్జన చేయాలనిపిస్తుంది. మన మెదడు, శరీరం దానికి అలవాటుపడిపోతాయి. మీరు స్నానంలో పదే పదే మూత్ర విసర్జన చేసినప్పుడు, మెదడు నీటి శబ్దాన్ని మూత్ర విసర్జన సంకేతంతో లింక్ చేసుకోవడం ప్రారంభిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో మీరు నీటి శబ్దం విన్నప్పుడల్లా అంటే కుళాయి తెరిచినప్పుడు, వర్షం శబ్దం విన్నప్పుడు మూత్ర విసర్జన చేయాలనే కోరిక సహజంగానే కలుగుతుంది. ఈ అలవాటు మూత్రాశయ నియంత్రణ సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. ముఖ్యంగా మూత్రాశయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ అలవాటు మరింత హానికరంగా మారుతుంది.
మూత్ర విసర్జన చేయడానికి శరీరాన్ని సరైన స్థితిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మహిళలకు కూర్చొని మూత్ర విసర్జన చేయడం మరింత సహజమైనది, సురక్షితమైనది కూడా. కానీ, మీరు స్నానం చేస్తున్న సమయంలో నిలబడి మూత్ర విసర్జన చేసినప్పుడు, పెల్విక్ ఫ్లోర్ కండరాలపై అసాధారణ ఒత్తిడి పడుతుంది. దీర్ఘకాలం పాటు ఇలా చేస్తే ఈ కండరాలు బలహీనపడతాయి, దీనివల్ల మూత్రాశయ నియంత్రణ సామర్థ్యం తగ్గుతుంది. దీనివల్ల మూత్రం లీక్ అయ్యే సమస్య ఏర్పడుతుంది.
స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేయడం వల్ల యూటీఐ ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా మహిళలు స్నానంలో నిలబడి మూత్ర విసర్జన చేయకూడదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మహిళల శరీర నిర్మాణం ప్రకారం, వారు నిలబడి మూత్ర విసర్జన చేస్తే, మూత్రం పూర్తిగా బయటకు రాదు, దీనివల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) ప్రమాదం పెరుగుతుంది.
స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేసే అలవాటు మూత్ర వ్యవస్థ సున్నితత్వంపై ప్రభావం చూపిస్తుంది . అవసరం లేకుండా, కేవలం అలవాటుగా స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేస్తే, మూత్ర వ్యవస్థ చాలా సున్నితంగా మారుతుంది. దీనివల్ల మూత్రాశయంలో కొద్దిగా మూత్రం ఉన్నా మెదడు మూత్ర విసర్జన చేయాలనే సంకేతం ఇస్తుంది. దీంతో మీరు తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ఇది మీ జీవనశైలిపై ప్రభావం చూపుతుంది.
స్నానంలో మూత్ర విసర్జన చేయడం ప్రారంభంలో 'అప్పుడప్పుడు' జరిగే విషయంగా అనిపిస్తుంది, కానీ క్రమంగా అది ఒక అలవాటుగా మారుతుంది, దానిని మానుకోవడం కష్టం. మీరు స్నానం చేసినప్పుడల్లా అవసరం లేకపోయినా శరీరం మూత్ర విసర్జన చేయాలనే సంకేతం ఇస్తుంది. ఈ అలవాటు మీ మానసిక, శారీరక అలవాట్లను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఫలితంగా మీరు మూత్ర విసర్జనను నియంత్రించడం కష్టమవుతుంది. కష్టతరమైన పరిస్థితుల్లో ఇది మీకు ఇబ్బంది కలిగిస్తుంది.
టాపిక్