Paracetamol: ప్రమాదం లేదులే అనుకుని పారాసిటమాల్ మాత్రలు తరచూ మింగేస్తున్నారా? కాలేయానికి ఎంతో ప్రమాదమంటున్న వైద్యులు
Paracetamol: పారాసిటమాల్ మాత్రలు ప్రతి ఇంట్లో కనిపిస్తాయి. ఒళ్లు నొప్పులు అనిపించినా, చిన్నగా జ్వరం మొదలైనా, దగ్గు, జలుబు వచ్చినా కూడా వెంటనే పారాసిటమాల్ మింగేస్తారు. పారిసిటమాల్ చాలా సేఫ్ మందు అనుకుంటారు. కానీ అది కాలేయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
ప్రతి ఇంట్లో పారాసిటమాల్ ట్యాబ్లెట్ కచ్చితంగా ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా వెంటనే పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసే వారు ఎంతోమంది. ఆ మాత్రల వల్ల ఎలాంటి సమస్యలు రావని అనుకుంటారు. అది కేవలం అపోహ మాత్రమే. ఈ ట్యాబ్లెట్లు తరచుగా వాడితే అవి కాలేయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. యునైటెడ్ స్టేట్స్, లండన్లో ఎక్కువ మందిలో కాలేయ వైఫల్యానికి అత్యంత సాధారణ కారణాలలో పారాసిటమాల్ వాడకం కూడా ఒకటని తేలింది. వాటిని మోతాదుకు మించి అధికంగా తీసుకోవడం వల్ల వారిలో విషంగా మారి కాలేయం వైఫల్యం చెందినట్టు గుర్తించారు వైద్యులు. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శివ్ కుమార్ సరిన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కరోనా అనంతరం పారాసిటమాల్ ను పెయిన్ కిల్లర్ గా భావించి ఎంతో మంది విచ్చల విడిగా వాడుతున్నారని ఆయన చెప్పారు. డాక్టర్ శివ్ కుమార్ సరిన్ చెబుతున్న ప్రకారం ఒక రోజులో 2-3 పారాసిటమాల్ మాత్రలను మాత్రమే తీసుకోవచ్చు. తీసుకున్న ప్రతిసారి పూర్తి ట్యాబ్లెట్ కాకుండా రెండు ముక్కలు చేసి అర ముక్కను వేసుకోవాలి.
కాలేయాన్ని కాపాడుకోండి
కాలేయం మానవ శరీరంలో ఒక కీలకమైన అవయవం. అన్ని శారీరక విధులను సక్రమంగా జరిగేలా చేస్తుంది. కాలేయం అనేది పక్కటెముక కింద, పొట్టకు కుడి వైపున ఉండే ఒక చిన్న అవయవం. ఆహారాన్ని జీర్ణం చేయడం నుండి, శరీరంలోని విషాలను, వ్యర్థాలను వదిలించడం వరకు కాలేయం ఎన్నో పనులు చేస్తుంది. శరీరంలోని అవయవాలకు ఆరోగ్యకరంగా రక్త ప్రసరణ జరిగేలా చూస్తుంది. అనేక శారీరక విధులలో కాలేయం అవసరం. డాక్టర్ శివకుమార్ సరిన్ మాట్లాడుతూ కాలేయమే శరీరానికి బాస్ అని, ఇది శరీరాన్ని నడిచేలా, హెల్తీగా ఉంచుతుందని పేర్కొన్నారు.
డయాబెటిస్ ఎలా వస్తుంది?
డాక్టర్ శివ్ కుమార్ సరిన్ చెబుతున్న ప్రకారం శరీరంలోని చక్కెర వాస్తవానికి ప్యాంక్రియాస్ ద్వారా నియంత్రణలో ఉంటుంది. క్లోమం కాలేయానికి అవసరమైన ఇన్సులిన్ తయారు చేస్తుంది. కాలేయంలో కొవ్వు పొర ఉన్నప్పుడు, ఇన్సులిన్ ను శరీరం కణాలు గ్రహించలేవు. దీనివల్ల, ప్యాంక్రియాస్ అదే పనితీరు కోసం ఎక్కువ ఇన్సులిన్ తయారు చేయాల్సి ఉంటుంది. వెంటనే, కొవ్వు కాలేయం కారణంగా, ఇన్సులిన్ కణాలు గ్రహించలేవు. ఎక్కువ ఇన్సులిన్ తయారు చేయడం వల్ల ప్యాంక్రియాస్ అలసిపోవడం ప్రారంభమవుతుంది. అప్పుడే మధుమేహ వ్యాధి వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి.
డయాబెటిస్ వస్తే ఇతర వ్యాధులు వచ్చే అవకాశం కూడా పెరిగిపోతుంది. డయాబెటిస్ ఇతర వ్యాధులను తీసుకువచ్చి, ఆరోగ్యకరమైన శరీరాన్ని నాశనం చేస్తుందని ఆయన అన్నారు. కాబట్టి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కొవ్వు కాలేయ వ్యాధులు రాకుండా జాగ్రత్తపడాలి.
ఫ్యాటీ లివర్ వ్యాధులు ఎలా అభివృద్ధి చెందుతాయో డాక్టర్ శివ్ కుమార్ సరిన్ వివరించారు. మనం ఎక్కువ కేలరీలు తీసుకున్నప్పుడు కండరాలకు కావాల్సినంత తీసుకుని మిగతాది కొవ్వుగా కాలేయంలో పేరుకుపోతాయి. కాలేయంలో ఉన్న కొవ్వు బరువులో ఐదు శాతం కంటే తక్కువగా ఉంటే, అది ఆరోగ్యకరమే. కాబట్టి కాలేయ ఆరోగ్యం కోసం కొన్నిజాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.
టాపిక్