New Study: మెట్రో నగరాల్లో 25 శాతం మంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదట, ఎందుకో తెలుసా?-do you know why 25 percent of girls in metro cities dont want to get married ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  New Study: మెట్రో నగరాల్లో 25 శాతం మంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదట, ఎందుకో తెలుసా?

New Study: మెట్రో నగరాల్లో 25 శాతం మంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదట, ఎందుకో తెలుసా?

Haritha Chappa HT Telugu
Jul 12, 2024 04:30 PM IST

New Study: కాలంతో పాటూ అమ్మాయిలూ మారుతున్నారు. తమకు ఏం కావాలో వారు నిర్ణయించుకునే స్థితికి చేరుకున్నారు. ఒక అధ్యయనంలో అమ్మాయిలు పెళ్లిచేసుకునేందుకు అయిష్టత చూపిస్తున్నట్టు తేలింది.

పెళ్లి వద్దంటున్న అమ్మాయిలు
పెళ్లి వద్దంటున్న అమ్మాయిలు

ఒకప్పుడు కాలం వేరే. పాతకాలంలో ‘ఏ వయసుకు ఆ ముచ్చట’ అని పదిహేనేళ్లకే పెళ్లి చేసేవారు. కానీ ఇప్పుడు అలా చేస్తే కటకటాల పాలవ్వాల్సిందే. అమ్మాయిలకు కచ్చితంగా 18 ఏళ్లు నిండాకే పెళ్లి చేయాలన్న నిబంధన ఉంది. చదువుకున్న అమ్మాయిలు అయితే పాతికేళ్లు వచ్చినా కూడా పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడడం లేదు. ఈ విషయాన్ని ఒక తాజాగ అధ్యయన తేల్చింది.

yearly horoscope entry point

సాంకేతిక విప్లవం, ఆర్ధిక స్వేచ్ఛ, పారిశ్రామిక విప్లవం, కార్పరెటీకరణ వంటి వాటి వల్ల వచ్చిన మార్పులు అమ్మాయిల ఆలోచనల్లో కూడా ఎంతో మార్పును తెచ్చింది. వారు పెళ్లిపై ఆసక్తిని చూపించడం లేదు.

దేశంలోని మెట్రో నగరాల్లో 21 నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిల్లో 25 శాతం మంది పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదని చెప్పారు. దానికి కారణం పెళ్లి తర్వాత తాము మారాల్సి రావడమేనని చెప్పారు. పెళ్లి తరువాత ఉద్యోగ స్థానం, పనులు, స్వేచ్ఛ వంటి విషయాల్లో కూడా ఎన్నో మార్పులు వస్తాయని, ఎదుటివారికి నచ్చినట్టు ఉండాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. 11 శాతం మంది అమ్మాయిలు పెళ్లి తర్వాత నిర్ణయం తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుందని, అందుకే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అభిప్రాయపడ్డారు. సెంటర్ ఫర్ ఇన్వెస్ట్ మెంట్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఛైర్ పర్సన్ ఉషా శశికాంత్ ఈ అధ్యయనంపై మాట్లాడారు. అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారని ఆమె అన్నారు. మన అమ్మాయిలను కుటుంబంలో శక్తిమంతులుగా మార్చాలని చెప్పారు.

మనదేశంలో పెళ్లి చేసుకోని యువత సంఖ్య ఎక్కువే ఉంది. నెలవారీ సంపాదన పదివేల కన్నా తక్కువగా ఉన్న అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడడం లేదు. తక్కువ జీతం కారణంగా కుటుంబాన్ని పోషించలేమని వారు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.

ఆధునిక ప్రపంచంలో సహజీవనం కూడా పెరిగిపోయింది. శారీరక అవసరాలు తీర్చుకునేందుకు లివింగ్ రిలేషన్ షిప్ దారి దొరకడంతో...పెళ్లి ఆలోచనలు యువతలో తగ్గిపోతున్నాయి. ఇంతకుముందు 18 ఏళ్లకే పెళ్లి చేసుకునేవారు. ఇప్పుడు 30 ఏళ్లు దాటుతున్నా పెళ్లి చేసుకునేందుకు యువత సిద్ధంగా లేదు. పెళ్లి చేసుకున్నా కూడా ఉద్యోగాల్లో ఇద్దరూ బిజీ అయిపోయి పిల్లలను కనేందుకు ఇష్టపడడం లేదు.

అమ్మాయిలకు ఆర్ధిక స్వేచ్ఛ పెరిగింది. అబ్బాయిలతో సమానంగా లక్షల్లో సంపాదిస్తున్నారు. దీంతో వారు వయసు పెరుగుతున్నా కూడా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. ముందుగా ఆర్ధికంగా స్థిరపడేందుకు అమ్మాయిలు కష్టపడుతున్నారు. దీంతో పెళ్లిని పట్టించుకోవడం లేదు. కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం సరైన సమయంలో పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు. లేటు వయసులో పిల్లల్ని కనడం వల్ల పుట్టబోయే పిల్లలకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Whats_app_banner