Valentines Week: వాలెంటైన్స్ వీక్‌లో ఏ రోజు ఏ ప్రత్యేక దినోత్సవమో తెలుసా? ఆ రోజు మీ ప్రేమికులకు ఈ గిఫ్టులు ఇవ్వాలి
Valentine Week: వాలెంటైన్స్ వీక్ రేపటితో మొదలైపోతుంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రేమికుల వీక్ ప్రారంభమైపోతుంది. వాలెంటైన్స్ వీక్ లో ఏరోజు ఏ వేడుక నిర్వహించుకోవాలో తెలుసుకోండి.

వాలెంటైన్స్ డే అంటే యూత్ కి ఎంతో ఇష్టమైన వేడుక. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల కోసం ఎంతో మంది ప్రేమికులు ఎదురుచూస్తూ ఉంటారు. ఫిబ్రవరి 14 వచ్చిందంటే ప్రేమతో వారి గుండెలు నిండిపోతాయి. వాలెంటైన్స్ డే రావడానికి వారం రోజుల ముందు నుంచే ప్రేమ వేడుకలు మొదలైపోతాయి. ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకమైన దినోత్సవాన్ని కేటాయించారు. ఫిబ్రవరి 7వ తేదీన మొదలైన ప్రేమ వారం ఫిబ్రవరి 14న ముగుస్తుంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఫిబ్రవరి 14 వరకు ఏ రోజు ఏ స్పెషల్ డే నో తెలుసుకోండి.
ఫిబ్రవరి 7 - రోజ్ డే
ఫిబ్రవరి 7న వాలెంటైన్స్ వీక్ మొదటి రోజుగా నిర్వహించుకుంటారు. ప్రేమికులు ఈ రోజును రోజ్ డేగా జరుపుకుంటారు. వివిధ రంగుల గులాబీలు వేర్వేరు భావాలను సూచిస్తాయి. స్నేహానికి పసుపు గులాబీలు, ప్రేమను వ్యక్తపరిచేందుకు ఎరుపు గులాబీలు ఇవ్వాలి. అందమైన గులాబీల అమ్మకాలు కూడా ఈరోజు అధికంగా ఉంటాయి
ఫిబ్రవరి 8 - ప్రపోజల్ డే
మీరు మీ ప్రేమికురాలికి ప్రేమను వ్యక్తపరచాలనుకుంటు ప్రపోజల్ డే ఎంపిక చేసుకోండి. గ్రీటింగ్ కార్డు, పూల బోకే లేదా ఏదైనా అందమైన బహుమతి ఇచ్చి మీ హృదయంలోని మాటను తెలియజేయవచ్చు. ఇవన్నీ కాకుండా వాట్సప్ లో షాయరీ లేదా లవ్ కోట్స్ పంపొచ్చు.
ఫిబ్రవరి 9:- చాక్లెట్ డే
చాక్లెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? చాక్లెట్ డే రోజున టేస్టీ డార్క్ చాక్లెట్ కొని మీ ప్రియురాలికి లేదా ప్రియునికి ఇవ్వండి. ఇది తినడం వల్ల మెదడులో హ్యాపీ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. వాలెంటైన్స్ వీక్ మూడో రోజున మీ పార్టనర్ కు చాక్లెట్ గిఫ్ట్ గా ఇవ్వొచ్చు.
ఫిబ్రవరి 10: టెడ్డీ డే
వాలెంటైన్స్ వీక్ నాలుగవ రోజున టెడ్డీబేర్లను ఇస్తారు. టెడ్డీ ఎందుకు అనే ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతోంది. స్వచ్ఛమైన ప్రేమకు, అమాయకత్వానికి ప్రతీక టెడ్డీ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మీరు దానిని కౌగిలించుకుంటే చాలు ఎంతో ప్రశాంతమైన అనుభూతిని ఇస్తుంది. అందమైన టెడ్డీబేర్ మీ ప్రేయసి ముఖం చిరునవ్వును తీసుకువస్తుంది.
ఫిబ్రవరి 11:- ప్రామిస్ డే
ప్రతిజ్ఞలు, వాగ్దానాలు లేకుండా ప్రేమ అసంపూర్ణం. వాలెంటైన్స్ డే ఐదో రోజును ప్రామిస్ డేగా జరుపుకుంటారు. జంటలు ఒకరికొకరు ఎల్లప్పుడు కలిసి ఉంటామని, కష్ట సుఖాల్లో తోడు ఉంటామని ప్రామిస్ చేసుకుంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.
ఫిబ్రవరి 12:- హగ్ డే
కౌగిలింతకు ఉన్న పవర్ చాలా ఎక్కువ. కౌగిలించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేక పరిశోధనల్లో వెల్లడయ్యాయి. ఇది మీ భావోద్వేగ బంధాన్ని మెరుగుపరుస్తుంది. సంతోషకరమైన హార్మోన్లను విడుదల చేస్తుంది. కాబట్ట హగ్ డే రోజు చిన్న కౌగిలింత మీ ప్రేయసికి ఇచ్చేందుకు ప్రయత్నించండి.
ఫిబ్రవరి 13:- కిస్ డే
ముద్దు పెట్టుకోవడం వల్ల మెదడులో కొన్ని రసాయనిక ప్రతిచర్యలు జరుగుతాయని సైన్సు చెబుతోంది. ఇది ఆక్సిటోసిన్, డోపమైన్ వంటి హార్మోన్ల స్రావాలకు దారితీస్తుంది. ఇవి హ్యాపీ హార్మోన్లు. కాబట్టి మీ ప్రేమ బంధాన్ని మరింత బలపరిచేందుకు చిన్న ముద్దు ఎంతో సహకరిస్తుంది.
ఫిబ్రవరి 14:- వాలెంటైన్స్ డే
అసలైన పండుగ ఇదే. వాలెంటైన్స్ డే ఈ రోజున, ప్రజలు తమ భాగస్వామితో బహుమతులు, విహారయాత్రలు, విందులతో జరుపుకుంటారు. వాలెంటైన్స్ డే రోజున ప్రేమలో మునిగిపోయిన జంటలకు పెద్ద పండుగే అని చెప్పాలి.
సంబంధిత కథనం