Milk Tea: పాలతో చేసే టీ ని ఎక్కువ సేపు మరిగిస్తే ఏమవుతుందో తెలుసా? వైద్యులు చెబుతున్న విషయమిదే
Milk Tea: పాలతో చేసిన టీని తాగే వారి సంఖ్య మన దేశంలో చాలా ఎక్కువ. అయితే అలాంటివారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.
Milk Tea: పాలతో చేసిన టీనే మనదేశంలో ఎక్కువమంది ఇష్టపడతారు. ఈ టీ లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. మిల్క్ టీని తాగడం వల్ల కొన్ని రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. మొత్తంగా పాలతో చేసే టీ ని అద్భుతమైన పానీయంగా భావిస్తారు. ఎంతోమంది ఉదయం లేచాక ఆ టీని తాగాకే పనులు మొదలు పెడతారు. అయితే ఈ టీ ని అతిగా మరిగించడం వల్ల ఎన్నో హానికర సమ్మేళనాలు జనించే అవకాశం ఉంది. టీని అతిగా మరిగిస్తే అది స్లో పాయిజన్‌గా మారిపోవచ్చని అంటున్నారు పోషకాహార నిపుణులు.
డైటీషియన్లు చెబుతున్న ప్రకారం టీని ఎక్కువ సమయం పాటు మరిగించడం వల్ల దానిలో ఉండే పోషకాలు నశించిపోతాయి. అంతేకాదు అది జీర్ణం కావడం కష్టంగా మారుతుంది. దీనివల్ల శరీరంలో టాక్సిన్లు పేరుకు పోతాయి. ఆయుర్వేదం ప్రకారం కూడా పాలతో చేసిన టీ ని ఎక్కువ సేపు మరిగించడం మంచిది కాదు. ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది. కానీ ఎలాంటి మేలు చేకూర్చదు. అతిగా మరిగితే ఆ టీ లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు క్షీణిస్తాయి. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు తగ్గిపోతాయి. అలాగే హానికరమైన సమ్మేళనాలు ఏర్పడతాయి. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ కు ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.
అధికంగా మరిగిస్తే ఇంతే
టీని అధిక సమయం పాటు మరిగించడం వల్ల వేడిని తట్టుకోలేని విటమిన్లు... ప్రత్యేకించి బి విటమిన్లు నాశనం అయిపోతాయి. దీనివల్ల ఆ టీ మరగడం జీర్ణం కావడం కష్టంగా మారుతుంది. ఎక్కువసేపు మరిగించే సమయంలో టానిన్లు విడుదలవుతాయి. అవి పాల ప్రోటీన్లతో కలిపి కొన్ని రకాల కాంప్లెక్స్‌లను ఏర్పరుస్తాయి. ఇవి పోషకాల శోషణను తగ్గిస్తాయి. అంతేకాదు టీ రుచి మారిపోతుంది.
ప్రతిరోజూ అధికంగా మరిగించిన టీని తాగడం వల్ల దీరిక కాలిక వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. రక్త ప్రవాహంలో ప్రోటీన్లు లేదా కొవ్వులు, చక్కెర వంటివి కలిసి ప్రమాదకరమైన హానికరమైన సమ్మేళనాలు ఏర్పడతాయి. పాలతో చేసిన టీని క్రమం తప్పకుండా తాగే వ్యక్తులు ఆ టీని ఎక్కువసేపు మరిగించకుండా తాగడమే ఉత్తమం.
నిజానికి ఎక్కువ సేపు మరిగించడం వల్ల అంత టేస్టీగా ఉండదు. సువాసన రాదు. ఇది చేదుగా మారిపోతుంది. ఇలాంటి టీని లక్షణాలు కూడా అతిగా ఉంటాయి. వారు చిరాకుగా, సౌకర్యంగా ఉంటారు. విపరీతమైన ఆత్రుతను చూపిస్తూ ఉంటారు. ఇది ఇంద్రియాలపై ప్రభావితం అవుతుంది. మానసిక స్థితిని మారుస్తుంది.
టీ ప్రేమికులు మిల్క్ టీ తాగేముందు కచ్చితంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వేడిగా ఉన్న టీ ని ప్లాస్టిక్ కప్పుల్లో వేసుకోకూడదు. దీన్ని పింగానీ గ్లాసుల్లో లేదా, స్టీలు గ్లాసులో ఆస్వాదించడం మంచిది.