Nita Ambani: న్యూ ఇయర్ వేడుకల్లో నీతా అంబానీ వేసుకున్న ఈ లాంగ్ గౌను ధర ఎంతో తెలుసా?-do you know the price of this long gown worn by nita ambani in the new year celebrations ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nita Ambani: న్యూ ఇయర్ వేడుకల్లో నీతా అంబానీ వేసుకున్న ఈ లాంగ్ గౌను ధర ఎంతో తెలుసా?

Nita Ambani: న్యూ ఇయర్ వేడుకల్లో నీతా అంబానీ వేసుకున్న ఈ లాంగ్ గౌను ధర ఎంతో తెలుసా?

Haritha Chappa HT Telugu
Jan 02, 2025 02:00 PM IST

Nita Ambani: నీతా అంబానీకి ఫ్యాషన్ సెన్స్ ఎక్కువ. అరవైఏళ్ల వయసులో కూడా ఆమె హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా ఉంటుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌‌లో కూడా ఆమె ఇదే తరహా స్టన్నింగ్ లుక్ లో మెరిసింది. ఆమె వేసుకున్న ట్రెండీ డ్రెస్ ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు.

నీతా అంబానీ డ్రెస్ ధర ఎంత?
నీతా అంబానీ డ్రెస్ ధర ఎంత? (Instagram)

రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్ నీతా అంబానీ తన ఫ్యాషన్, అందంతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అరవై ఏళ్ల వయసులో కూడా ఆమె అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌ను చూపిస్తూ ఉంటారు. నేటి తరానికి ఆమె కాంపిటీషన్ ఇచ్చేలా అందంగా ముస్తాబవుతున్నారు. రీసెంట్ గా తన ఫ్యామిలీ, క్లోజ్ ఫ్రెండ్స్ తో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న ఈ బ్యూటీ అందరి దృష్టిని తన గ్లామర్ లుక్ తో అలరించేలా ఉన్ననారు. నీతా అంబానీ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంది.

yearly horoscope entry point

ఫ్యాషన్ స్టేట్ మెంట్ పీస్ గా నిలిచిన ఈ స్పెషల్ ఈవెంట్ కోసం ఆమె అద్భుతమైన గోల్డెన్ కఫ్తాన్ గౌన్ ను ధరించారు. ఈ స్టన్నింగ్ కఫ్తాన్ డ్రెస్‌ ఎంతో అందంగా ఉంది. ఆ డ్రెస్ చూసేందుకు అద్భుతంగా ఉంది.

నీతా అంబానీ న్యూ ఇయర్ లుక్ నిజంగా ట్రెండ్ సెట్టర్. ఆమె తన దుస్తుల కోసం ముదురు బూడిద రంగును ఎంచుకున్నారు. ఇది పార్టీ లుక్ ఇచ్చింది. ఈ గౌను సాధారణ గౌన్ కంటే చా‌లా భిన్నంగా ఉంటుంది. ఇది కఫ్తాన్ స్టైల్ గౌన్. ఇది స్టైల్ గా, కంఫర్ట్‌గా ఉంది. ఈ గౌనును విలాసవంతమైన మస్లీన్ ఫ్యాబ్రిక్ తో తయారు చేశారు. దీని నెక్ లైన్ పై నెట్ ఫ్యాబ్రిక్, క్రిస్టల్స్ వర్క్ తో డిజైన్ చేశారు. ఇది దీనికి మరింత రాయల్ లుక్ ను ఇచ్చింది. పొడవాటి కఫ్తాన్ స్టైల్ స్లీవ్స్, నేల వరకు ఊగుతున్న గౌను నీతా లుక్ ను షోస్టాపర్ గా మార్చాయి.

నీతా డ్రెస్ ఖరీదు

నీతా అంబానీ గ్లామర్ స్టైల్ మీకు నచ్చితే, ఖచ్చితంగా ఈ అద్భుతమైన గౌను ధరను తెలుసుకోవాలనుకుంటారు. నీతా వేసుకున్న కఫ్తాన్ స్టైల్ గౌన్ ధర 1,797 డాలర్లు, అంటే సుమారు 1.54 లక్షల రూపాయలు. ఈ అందమైన గౌనును ‘ఆస్కార్ డి లా రెంటా’ రూపొందించింది.

నీతా అంబానీ లుక్ గురించి, ఆమె అద్భుతమైన ఆభరణాల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఆమె తన లుక్‌తో మినిమమ్ జువెలరీని ధరించింది. డ్రాప్ చెవిపోగులు, స్టేట్ మెంట్ రింగ్‌తో ఆమె తన లుక్ ను అందంగా తయారైంది. దీనితో పాటు ఆయన మేకప్ లుక్‌ అద్భుతంగా ఉంది. నీతా మేకప్ ను చాలా తక్కువగా ఉంచింది. కంటి మేకప్ కోసం ఆమె న్యూడ్ ఐషాడో, వింగ్ ఐలైనర్, మస్కారా వంటివి వినియోగించారు. అంతేకాకుండా న్యూడ్ లిప్ షేడ్, లైట్ బ్లష్ తో మేకప్ లుక్ ను పూర్తి చేసింది.

(ఇమేజ్ క్రెడిట్ - @ritikahairstylist)

Whats_app_banner