జనరేషన్ జెడ్... ఇప్పటి యువతలో ఎక్కువ ఈ తరానికి చెందిన వారే. 1997 నుండి 2012 మధ్యలో జన్మించిన వారిని జనరేషన్ జెడ్ అని పిలుచుకుంటారు. ఈ తరం వ్యక్తులు ప్రత్యేకమైన పదజాలాన్ని వాడతారు. సామాజిక మాధ్యమాల్,లో వాట్సాప్ చాటింగ్ లలో ఈ జనరేషన్ జెడ్ పదాలు వినిపిస్తూ ఉంటాయి.
ఇంట్లోని తల్లిదండ్రులకు ఎనభైలలో పుట్టిన వారికి ఈ పదజాలానికి అర్థం కాదు. జనరేషన్ జెడ్ అధికంగా వాడుతున్న పదాల గురించి ఇక్కడ ఇచ్చాము తెలుసుకోండి.
జనరేషన్ జెడ్ యువత సంక్షిప్తంగా మెసేజులను పెట్టేందుకు ఇష్టపడతారు. వారి సంభాషణలలో సాధారణంగా ఉపయోగించే పదాలే ఉంటాయి. కానీ అవి సంక్షిప్త రూపంలో ఉంటాయి. అలాగే ఎమోజీల ద్వారా కూడా తమ భావాలను వ్యక్తపరచడానికి, కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. జనరేషన్ చేయడం వల్ల తమ భాషను అభివృద్ధి చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. కొత్త పదాలను పదబంధాలను సృష్టిస్తున్నారు.
1. "LOL" (Laugh Out Loud): ఇది ఒక సరదా వినోదకరమైన పరిస్థితుల్లో స్పందించడానికి ఉపయోగించే పదం.
2. "BRB" (Be Right Back): చిన్న విరామం తీసుకుని తిరిగి వస్తానని చెప్పడానికి ఈ పదాన్ని వినియోగిస్తారు.
3. "SMH" (Shaking My Head): ఒక విషయం విన్న తర్వాత నిరుత్సాహంగా ఉంది... అని చెప్పడానికి ఉపయోగించే పదం ఇది.
4. "IDK" (I Don't Know): ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలియదని ఇలా సంక్షిప్త రూపంలో చెబుతారు.
5. "OMG" (Oh My God): ఆశ్చర్యంగా అనిపించినప్పుడు ఈ పదాన్ని వాడుతూ ఉంటారు.
6. Ops: ఏదైనా చిన్న పొరపాటు జరిగితే వెంటనే ఇలా రియాక్షన్ ఇస్తారు
7. Bet: సరే అని చెప్పడానికి, అవును అని చెప్పడానికి ఈ పదాన్ని వినియోగిస్తారు.
9. Cap / No cap: జనరేషన్ జెడ్ భాషలో క్యాప్ అంటే అబద్దం అని, నో క్యాప్ అంటే నిజం అని అర్థం.
10. Slay: చాలా బాగా చేశావు, అందంగా ఉన్నావు అని చెప్పడానికి కూడా ఈ పదం వాడుతారు.
11. Glow up: నీ స్టైల్ బాగుంది, చూడముచ్చటగా ఉన్నావు అని చెప్పేందుకు ఈ పదాన్ని వాడుతూ ఉంటారు.
12. Ice in my veins: ఏదన్నా సీరియస్ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ టైంలో కూడా టెన్షన్ లేకుండా ఉన్నానని చెప్పేందుకు ఈ పదాన్ని వాడుతూ ఉంటారు.
13. Finsta:ఏదైనా నకిలీ సోషల్ మీడియా ఖాతాను లేదా రహస్యంగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను నడుపుతున్నప్పుడు ఆ ఖాతాను ఇలా పిలుస్తారు.
14. Doggo: ఇంట్లో పెంచుకునే కుక్కను ఇలా జనరేషన్ జెడ్ వాళ్ళు పిలుచుకుంటారు.
15. Simp: ఏదైనా వస్తువుపై ఎక్కువ కోరికను కలిగి ఉండడాన్ని ఈ పదంతో చెబుతారు.
సంబంధిత కథనం
టాపిక్