LGBTQ Meaning: ట్రాన్స్ జెండర్, గే, లెస్బియన్ ఈ పదాలకు అర్థాలు తెలుసా? ఎవరిని ఈ పేర్లతో పిలుస్తారు?
LGBTQ Meaning: ఈమధ్య సోషల్ మీడియాలోనూ, బయట ఎక్కువగా వినిపిస్తున్న పదాలలో ట్రాన్స్ జెండర్, లెస్బియన్ వంటి పదాలు ఉన్నాయి. చాలామందికి వీటి అర్థాలు సరిగా తెలియదు. LGBTQ కమ్యూనిటీ అంటే తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
LGBTQ Meaning: మనదేశంలో స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలని ఎంతో మంది డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది సుప్రీంకోర్టు కూడా స్వలింగ వివాహాల చట్టబద్ధత మీద తీర్పు చెప్పింది. ఆ జంటలకు కూడా వివాహ హక్కు ఉండాలని, అది ప్రాథమిక హక్కు కిందే వస్తుందని వివరించింది. అయితే స్వలింగ వివాహాలకు చట్టబద్ధతను కల్పించాల్సింది మాత్రం పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలని కోర్డు చెబుతోంది. సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడంతో ఎంతోమంది స్వలింగ సంపర్కులకు ఊరటనిచ్చింది.
యూట్యూబ్, సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ట్రాన్స్‌జెండర్లు, గే కపుల్ వంటి వారు వీడియోలు చేస్తూ ప్రజల ముందుకు వస్తున్నారు. కొన్ని పదాలు కూడా సమాజంలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అవే LGBTQ కమ్యూనిటీ, ట్రాన్స్ జెండర్, బై సెక్సువల్, గే.... ఇలాంటివన్నీ. కొంతమందికి వాటి అర్థాలు కూడా తెలియవు. వాటి అర్ధాలను ఇక్కడ వివరంగా అందించాము.
లెస్బియన్
ఒక మహిళకు మరొక మహిళపై ఆకర్షణ రావడం. ఒకరికొకరుపై ప్రేమ పుట్టడం. ఇలాంటివారిని లెస్బియన్లు అంటారు.
గే
గే అంటే ఒక పురుషుడు మరో పురుషుడిపై ఆసక్తిని పెంచుకుంటాడు. వీళ్ళకి ఎదుటి పురుషులను చూస్తే ఆకర్షణగా అనిపిస్తుంది.వీరికి మహిళలు నచ్చరు.
బైసెక్సువల్
బై సెక్సువల్ మహిళా లేదా పురుషులకు మగా లేదా ఆడా ఇద్దరి పైన ఆసక్తి ఉంటుంది. అలాంటివారినే బై సెక్సువల్ అంటారు. వీరు ఆడవారితోనూ సెక్స్ ఇష్టపడతారు, అలాగే మగవారితోనూ ఉంటారు.
ట్రాన్స్ జెండర్
ఈ పదం ఎక్కువగా మనం వింటూ ఉంటాము. పుట్టుకతో మహిళగా పుట్టి తర్వాత పురుషుడిగా మారిన వ్యక్తిని ట్రాక్ జెండర్ అంటారు. లేదా పుట్టుకతో పురుషుడు అయ్యి తర్వాత మహిళగా మారిన వ్యక్తిని ట్రాన్స్ జెండర్ అంటారు. వీరు హార్మోన్ థెరపీలు, సర్జరీలు చేయించుకుని పూర్తిగా మహిళగా లేదా పూర్తి పురుషుడిగా మారెందుకు ఇష్టపడతారు. పుట్టుకతో వచ్చిన జననేంద్రియాలు కూడా మార్చుకుంటారు.
క్వీర్
ఈ పదాన్ని స్వలింగ సంపర్కాన్ని ద్వేషించే పదంగా మొదట్లో ఉపయోగించారు. కానీ ఇప్పుడు దీని అర్థం మారుతూ వస్తుంది.
క్వశ్చనింగ్
LGBTQలో చివర ఉన్న అక్షరం Q. Q అంటే క్వీర్ లేదా క్వశ్చనింగ్ అని అర్థం. ఒక వ్యక్తి ... తానో మహిళనో, మగవాడినో తెలుసుకోలేని పరిస్థితుల్లో గందరగోళ పడుతూ ఉంటే అలాంటి వారిని క్వశ్చనింగ్ అని పిలుచుకుంటారు.
LGBTQ కమ్యూనిటీ అంటే పైన చెప్పిన వారంతా. L అంటే లెస్బియన్, G అంటే గే, B అంటే బై సెక్సువల్, T ట్రాన్స్ జెండర్ Q అంటే క్వీర్ లేదా క్వశ్చనింగ్.
టాపిక్