Alia Bhatt: కూతురు రాహాతో అలియా భట్, ఆమె వేసుకున్న డ్రెస్‌ ఖరీదు ఎంతో తెలుసా? మీరు కూడా కొనుక్కోలరు-do you know the cost of alia bhatts kurta you will be surprised ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Alia Bhatt: కూతురు రాహాతో అలియా భట్, ఆమె వేసుకున్న డ్రెస్‌ ఖరీదు ఎంతో తెలుసా? మీరు కూడా కొనుక్కోలరు

Alia Bhatt: కూతురు రాహాతో అలియా భట్, ఆమె వేసుకున్న డ్రెస్‌ ఖరీదు ఎంతో తెలుసా? మీరు కూడా కొనుక్కోలరు

Haritha Chappa HT Telugu
Feb 03, 2025 04:30 PM IST

Alia Bhatt: అలియా భట్ తన కుటుంబంతో ముంబై విమానాశ్రయంలో కనిపించింది. భర్త రణ్‌బీర్ కపూర్, వారి కుమార్తె రాహాతో కలిసి అలియా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆమె వేసుకున్న కుర్తా అందరికీ నచ్చేలా ఉంది. దీని ఖరీదు ఎంతో తెలుసా?

అలియా భట్ వేసుకున్న డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?
అలియా భట్ వేసుకున్న డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా? (Instagram)

రణబీర్ కపూర్, వారి ముద్దుల కూతురు రాహాతో కలిసి అలియా భట్ వెకేషన్‌కు వెళ్లింది. తిరిగి వస్తూ ఆమె కుటుంబం ముంబై విమానాశ్రయంలో కనిపించింది. అప్పుడు ఆమె అందమైన కుర్తాలో కనిపించింది. ఆమె కుటుంబం ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. అలియా అద్భుతమైన ఎథ్నిక్ లుక్ లో తన ఫ్యాషన్ టాలెంట్ ను ప్రదర్శించింది. ఫ్యామిలీ విహారయాత్రకు వెళితే అలియా సింపుల్ స్టైల్‌తో అందరి కళ్లను తన వైపు తిప్పుకుంటోంది.

పూల కుర్తా సెట్ లో అలియా భట్

అలియా వేసుకున్న కుర్తా తేలికపాటి లినిన్ ఫ్యాబ్రిక్ తో రూపొందించినది. అద్భుతమైన ఐవరీ కుర్తా సెట్ లో అలియా ఎంతో అందంగా ఉంటుంది. ఈ కుర్తాలో వి-నెక్లైన్, రిలాక్స్డ్ ఫిట్,  లూజ్ స్లీవ్స్ ఉన్నాయి. ఈ డ్రెస్ స్టైలిష్‌గా, సౌకర్యవంతంగా ఉంటుంది. కుర్తా, స్లీవ్స్ మీద యూరోపియన్ రోజ్ డిజైన్, దాదాపు ఒక అద్భుతమైన పెయింటింగ్ లాగా ఈ దుస్తులను ప్రత్యేకంగా నిలిపాయి. కుర్తాను మ్యాచింగ్ ప్యాంట్ తో జత చేసి తన ఎథ్నిక్ లుక్ ను పూర్తి చేసింది.

ఆమె దుస్తుల ఖరీదు ఎంత?

మీకు అలియా డ్రెస్ నచ్చితే మీరు కూడా కొనుక్కోవాలని అనుకుంటారు.  రోజా బ్రాండ్ కు చెందిన ఈ అందమైన కుర్తా సెట్ ధర రూ.8,800. దీన్ని కోటీశ్వరులే కాదు ఉద్యోగం చేసే అమ్మాయిలు కూడా కొనుక్కోవచ్చు.

ఆలియా దీర్ఘచతురస్రాకారంలో ఉన్న నలుపు సన్ గ్లాసెస్, వెండి చెవిపోగులు, ఫ్లాట్ చెప్పులతో ఆమె లుక్ సింపుల్ గా ఉంది. తేలికపాలి మేకప్ లుక్ తో, నీట్ బన్ హెయిర్ స్టైల్ లో అలియా తన లుక్ ను పర్ఫెక్ట్ గా డిజైన్ చేసింది.

అలియా చివరిసారిగా జిగ్రా సినిమాలో కనిపించింది. తరువాత ఆల్ఫా సినిమాలో కనిపించనుంది. శివ్ రవైల్ దర్శకత్వం వహించిన ఆల్ఫా సినిమా మహిళా గూఢచారి సినిమా. శర్వా, అనిల్ కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ ఓ స్పెషల్ వీడియోలో రివీల్ చేశారు.

Whats_app_banner