Unhealthy Fashion: ఫ్యాషన్ పేరుతో మీరు ధరించే ఈ 5 రకాల డ్రెస్‌లు ఎంత ప్రమాదకరమో తెలుసా? ట్రెండ్ తెచ్చే టెన్షన్లు ఇవే!
Unhealthy Fashion: కాలంతో పాటు ఫ్యాషన్ ట్రెండ్స్ కూడా మారుతుంటాయి. వాటిని గుడ్డిగా ఫాలో అయ్యారంటే సమస్యల్లో పడతారు. ఫ్యాషన్ పేరుతో కొన్ని రకాల దుస్తులను ఎక్కువగా ధరించడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుందట. ప్రమాదాలకు కారణమయ్యే ఐదు రకాల ట్రెండీ దుస్తుల గురించి తెలుసుకుందాం రండి.
కాలంతో పాటు వేసుకునే దుస్తుల్లో కూడా చాలా మార్పు వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం ఫ్యాషనబుల్‌గా అనిపించినవి ఇప్పుడు పూర్తిగా ఔట్‌డేటెడ్ అయిపోయాయి. అలాగే అప్పట్లో వేసుకున్న డిజైన్లు కొన్ని ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఏదేమైనా.. మీ వ్యక్తిత్వాన్ని మరింత ఆకర్షణీయంగా, అందంగా మార్చడంలో మీరు వేసుకునే దుస్తులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందరితో పాటు అప్ డేటెడ్‌గా కనిపించడం మీ హుందాతనానికి అవసరం కూడా. అందుకనే ప్రస్తుత ఫ్యాషన్ సెన్స్, గ్రూమింగ్ విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.
అలాగని ట్రెండ్ ని గుడ్డిగా ఫాలో అయిపోవడం కూడా చాలా పెద్ద పొరపాటు అవుతుంది. ఏ ఫ్యాషన్ ట్రెండ్‌ని అయినా సరే ఎవరో వేసుకున్నరనీ, మీకు నచ్చిందనీ ఎక్కువగా వేసుకోవడం వల్ల మీరు ప్రమాదాలను కొనితెచ్చుకున్న వారవుతారు. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని దుస్తులు ట్రెండీగా కనిపించినప్పటకీ వీటిని ధరించడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా హాని జరగచ్చు. ఈ రోజు మనం అలాంటి కొన్ని రకాల డ్రెస్సుల గురించి తెలుసుకుందాం. అవి ఫ్యాషనబుల్‌గా అనిపించినప్పటికీ ఆరోగ్య పరంగా ఆలోచించి వాటిని దూరంగా ఉంచడం మంచిది.
1. బాగా బిగుతుగా ఉండే జీన్స్
టీనేజర్లలో 'స్కిన్ని జీన్స్' అనే బిగుతు జీన్స్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతోంది. నిజానికి వీటిని ధరించడం వల్ల కొందరు చాలా స్టైలీష్‌గా కనిపిస్తారు. కానీ అవి ఎంత స్టైలిష్‌గా అనిపించినప్పటికీ ఇవి ఆరోగ్యానికి మంచివి కావని తెలుసుకోండి. స్కిన్ని జీన్స్ మీ రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా శరీరంలోని దిగువ భాగాలకు రక్త ప్రవాహం తగ్గవచ్చు. అంతేకాకుండా బిగుతుగా ఉండే ఈ జీన్స్ ప్యాంట్లను ఎక్కువగా ధరించడం వల్ల నరాలపై అదనపు తీవ్ర ఒత్తిడి పడుతుంది. దీని వలన కాళ్ళలో నొప్పి సమస్య ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో అతిగా బిగుతుగా ఉండే జీన్స్ పురుషులలో నిష్పత్తికి కూడా కారణం కావచ్చు.
2. ట్రెండింగ్ షేప్‌వేర్ దుస్తులు
మహిళలలో షేప్‌వేర్ ధరించే ట్రెండ్ చాలా వేగంగా పెరుగుతోంది. ఇది ఒక రకమైన అండర్ గార్మెంట్. వీటిని ధరించడం వల్ల శరీర ఆకారం చాలా మెరుగుపడుతుంది. ముఖ్యంగా శరీరంలోని అదనపు కొవ్వును ఇవి దాచిపెట్టి అందమైన శరీరాకృతిలో కనిపించేందుకు షేప్‌వేర్ చాలా బాగా సహాయపడుతుంది. అయితే వీటిని అప్పుడప్పుడు ధరించడం వల్ల ఎలాంటి హాని కలుగకపోవచ్చు. కానీ వీటిని అతిగా ఉపయోగిస్తున్నట్లయితే మాత్రం ప్రమాదంలో పడతారు. ఎందుకంటే.. షేప్ వేర్ మీ కడుపును లోపలికి నెట్టుతుంది, దీని వలన శరీరంలోని అంతర్గత భాగాలు కూడా లోపలికి నొక్కకుపోతాయి. గాలి బాగా పీల్చుకోవడంలో ఇబ్బందికరంగా మారుతుంది. శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందదు. ఫలితంగా తల తిరగడం, వాంతి వంటి అనుభూతి కలుగుతుంది. అలాగే మెదడులో తేలికపాటి సమస్యలు రావచ్చు.
3. లేస్ ఉన్న అండర్ వేర్
లేస్ ఉన్న అండర్ వేర్ అందంగా అనిపించినప్పటికీ వీటిని మీ రోజువారీ దుస్తులలో చేర్చుకోవడం మానుకోండి. నిజానికి లేస్ ఉన్న అండర్‌వేర్ గాలి లోపలికి పోనివవు. ఫలితంగా లోపలి భాగాల్లో తేమ నిలిచిపోయి ఉంటుంది. ఫలితంగా యోని ఇన్ఫెక్షన్, యూటిఐ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. లేస్ అండర్ వేర్ తో పాటు బిగుతుగా ఉండే లోదుస్తుుల ధరించడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని గుర్తుంచుకోండి. వీటిని ఎక్కువగా ధరించడం వల్ల కూడా యోని ఇన్ఫెక్షన్లు రావచ్చు. నిరంతర ఘర్షణ వలన యోని చుట్టుపక్కల చర్మం చిరిగిపోతుంది, చికాకు పెరుగుతుంది. ఎల్లప్పుడూ కాటన్‌తో తయారైన తేలికైన, డ్రూసీ అండర్ వేర్‌ను ఎంచుకోవడం మంచిది.
4. బిగుతుగా ఉండే బట్టలు
సరిపోయే బట్టలు ధరించడం అందరికీ ఇష్టం. ముఖ్యంగా ఫిట్‌గా ఉన్న వాళ్లు, శరీర ఆకారాన్ని చూపించాలని ఆరాటపడుతుంటారు. అందుకే ఇప్పుడు టైట్ షర్టులు, బాడీకాన్ డ్రెస్సులు, టాప్స్ ట్రెండ్ పెరుగుతోంది. అయితే మీ వార్డ్ రోబ్ లో చాలా టైట్ ఫిట్ డ్రెస్సులు ఉన్నట్లయితే, వాటిని మార్చాల్సిన అవసరం ఉంది. ఈ రకమైన బట్టలు శరీరంలో రక్త ప్రవాహాన్ని నెమ్మది చేస్తాయి. కొన్నిసార్లు 'డీప్ వీన్స్ థ్రోంబోసిస్' వంటి ప్రమాదకరమైన వ్యాధికి కూడా కారణం కావచ్చు. ఈ రకమైన బట్టలు కడుపుపై కూడా ఒత్తిడిని కలిగిస్తాయి. దీని వలన యాసిడ్ కదలికలు రివర్స్ అయి ఛాతీలో మంట వంటి సమస్యలు రావచ్చు.
5. సీక్విన్ వర్క్ ఉన్న బట్టలు
పార్టీలో జోష్ నింపడానికి ఇవి సరైన దుస్తులు. మెరుస్తున్న, అందమైన ఈ సీక్విన్ వర్క్ ఉన్న డ్రెస్సులు చాలా అరుదుగా నచ్చుతాయి. అయితే, ఆరోగ్యానికి సీక్విన్ వర్క్ ఉన్న బట్టలు ధరించడం మంచిది కాదు. నిజానికి సీక్విన్స్ తయారు చేయడానికి బిస్ఫినాల్ ఏ, థాలేట్స్ ఉపయోగిస్తారు. ఈ రెండు పదార్థాలు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. అంతేకాకుండా ఇవి ఆరోగ్యంపై ప్రభావం చూపించి ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సమస్యలకు కలిగిస్తాయి. అందుకే ఈ రకమైన బట్టలు ఎక్కువగా ధరించడం మానుకోండి.
సంబంధిత కథనం