వెకేషన్ ప్లాన్ చేస్తున్నారా? సౌతిండియాలోని 8 బెస్ట్ ప్లేసెస్ ఇక్కడున్నాయి, ఇవి చాలా స్పెషల్!-do you know about 8 summer vacation places in south india these are very special ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  వెకేషన్ ప్లాన్ చేస్తున్నారా? సౌతిండియాలోని 8 బెస్ట్ ప్లేసెస్ ఇక్కడున్నాయి, ఇవి చాలా స్పెషల్!

వెకేషన్ ప్లాన్ చేస్తున్నారా? సౌతిండియాలోని 8 బెస్ట్ ప్లేసెస్ ఇక్కడున్నాయి, ఇవి చాలా స్పెషల్!

Ramya Sri Marka HT Telugu

సమ్మర్‌ను స్పెషల్‌గా మార్చుకోవాలనుందా? ఫ్యామిలీతో కలిసి మంచి వెకేషన్ ప్లానింగ్ లో ఉన్నారా? అయితే మీకు ఇవి బెస్ట్ ఆప్షన్. సౌతిండియాలోని సమ్మర్ వెకేషన్ ప్లేసెస్ లలో ప్రత్యేకమైనవి, చూడదగ్గవి అయిన 8 ముఖ్యమైన వాటి గురించి ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు.

సౌతిండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేసులు

నార్తిండియాతో పోల్చుకుని చూస్తే సౌతిండియా స్పెషల్ ఏంటంటే, తీర ప్రాంతాలు. టూరిస్టులను కట్టిపడేసే బీచ్‌లు దక్షిణాదిలోనే ఎక్కువ. దాంతోపాటు పచ్చని ప్రకృతి, మనస్సుల్లో ఆహ్లాదాన్ని నింపి కొత్త ప్రపంచానికి తీసుకెళ్తుంది. ఈ సమ్మర్లో ఒకసారి అలా ట్రిప్ వేసి రావడానికి సౌతిండియాలో చాలా బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. వాటిల్లో నుంచి 8 బెస్ట్ ప్లేసులను మీ ముందుంచుతున్నాం. ఇంకెందుకు లేటూ.. రొటీన్ లైఫ్‌కి కాస్త బ్రేక్ ఇచ్చేందుకు బ్యాగ్ సర్దేయండి. సమ్మర్‌ను స్పెషల్‌గా మార్చుకోండి.

1. బెస్ట్ టూరిస్ట్ ప్లేసులలో టాప్ 1 మన్నార్:

పశ్చిమ కనుమల్లో ఉండే ప్రాంతం మన్నార్. ఈ ప్రదేశంలోని కొండల్లో ఉండేది మొత్తం టీ మొక్కలే. అద్భుతమైన ఉదయాలను, సుందరమైన వాటర్‌ఫాల్స్‌ (అట్టుకల్, లక్కమ్)లతో ఉండే మన్నార్‌ను ఒక డ్రీమ్ స్పాట్‌గా వర్ణించినా తప్పులేదు. తేయాకు మొక్కలతో నిండిన ఆ ప్రదేశం అలాంటి అనుభూతులను ఇస్తుంది మరి.

2. కూర్గ్, కర్ణాటక:

ఈ ప్రాంతాల్లో ఉండే కాఫీ తోటలను చూస్తే మైమరిచిపోతారు. అందుకే దీనిని స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తుంటారు కూడా. ప్రకృతి ప్రేమికులకు భూతల స్వర్గంలా కనిపించే ఈ లొకేషన్లో ట్రెక్కింగ్, టాడియాండమాల్ అబ్బే ఫాల్స్, బరాపోల్ నది మీద విన్యాసాలు చేసేయొచ్చు. అదే సమయంలో అక్కడ తిరుగుతున్నప్పుడు తాజాగా అనిపించే కాఫీ తోటల సువాసనను కూడా ఎంజాయ్ చేయొచ్చు.

3. ఊటీ, తమిళనాడు

సౌతిండియాలోనే టాప్ మోస్ట్ సమ్మర్ వెకేషన్ ప్లేస్ ఏదైనా ఉందని అంటే అది ఊటీ మాత్రమే. ఊటీని ఉదగమండలం అని కూడా పిలుస్తారు. రంగురంగుల తోటలు, చూడచక్కని పర్వతాల వరుస ఒక మాయా ప్రపంచాన్ని తలపిస్తుంది. ఊటీ సరస్సులో బొటానికల్ గార్డెన్స్ బోట్ తో షికారు చేయడం, నీలగిరి పర్వతాలపై రైలు ప్రయాణం చేయడం మీకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి.

4. కొడైకెనాల్, తమిళనాడు

ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అనే పేరు తెచ్చుకున్న కొడైకెనాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే సమ్మర్ లో ప్రశాంతతను కోరుకునే వారికి ఇది చక్కని ప్రదేశం. నక్షత్రం ఆకారంలో ఉండే కొడైకెనాల్ సరస్సులు, కోకర్స్ వాక్, బ్రియాంట్ పార్క్ ఇక్కడ పర్యాటక ప్రదేశాలు. చల్లని మంచు వాతావరణంలో వికసించే పూలు, మనసుకు హత్తుకుపోయే భావాలను రేకెత్తిస్తాయి. అక్కడికి వెళ్తే ఇది సమ్మర్ అనే విషయం మర్చిపోతారు కూడా.

5. వయానాడ్, కేరళ

కేరళ అందం అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది కదా. అక్కడి ప్రకృతి, అడ్వెంచర్స్ చేసేందుకు వాటర్ ఫాల్స్, గుహలు, అటవీ అందాలు, మసాలా మొక్కలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఎడక్కల్ గుహల్లో ట్రెక్కింగ్, వయానాడ్ అటవీ ప్రాంతంలో పచ్చని వాతావరణం మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తుంది. ఇక్కడి పూకడే సరస్సు మరిచిపోలేని అనుభూతినిస్తుంది.

6. యర్కాడ్, తమిళనాడు

ఊటీకి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవాలంటే యర్కాడ్ గురించే చెప్పాలి. షెవరాయ్ కొండల్లో ఉండే యర్కాడ్ హిల్ స్టేషన్ చాలా ప్రత్యేకం. అందమైన కాఫీ మొక్కలు, సరస్సులు ప్రశాంత వాతావరణంలోకి తీసుకెళ్లిపోతాయి. ఆ దారి పొడుగంతా పచ్చగా కనిపించి సమ్మర్ లో చల్లదనం కురిపిస్తుంది.

7. గోకర్ణ, కర్ణాటక

గోవాలో రద్దీగా ఉంటుందని ఫీలవుతుంటే మీరు గోకర్ణకు వెళ్లొచ్చు. స్వచ్ఛమైన బీచ్ లతో పాటు రిలాక్సేషన్ కు, అడ్వెంచర్ కు ఇది కరెక్ట్ ఛాయీస్. ఓమ్ బీచ్, హాఫ్ మూన్ బీచ్ లలో సూర్యాస్తమయాలను చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్రదేశంలో యోగా పాయింట్లు కూడా ఉన్నాయి.

8. అరకు, ఆంధ్రప్రదేశ్

అన్నింటి కంటే ఆఖరుదైనా తెలుగు రాష్ట్రాల్లో ఉండే వారికి చాలా దగ్గరి ప్రదేశం అరకు. విశాఖపట్నంలో ఉండే కాఫీ తోటలన్నీ ఇక్కడే ఉంటాయి. గిరిజన సంస్కృతులు, పచ్చని కొండలు ప్రత్యేకం. అరకులో సొరంగాల గుండా చేసే రైలు ప్రయాణం, పక్కనే కనిపిస్తున్న లోయలు అందమైన అనుభూతులను కలిగిస్తాయి. బొర్రా గుహలు, ట్రైబల్ మ్యూజియం, ఆర్గానిక్ కాఫీ మీకు సంతృప్తినిస్తాయి.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం