ఇంట్లో కోడిగుడ్లు, బ్రెడ్ ఉన్నాయా? అయితే కొన్ని నిమిషాల్లో ఎగ్ బ్రెడ్ ఫ్రై రెసిపీ చేసేయండి-do you have eggs and bread at home then make this egg bread fry recipe in five minutes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఇంట్లో కోడిగుడ్లు, బ్రెడ్ ఉన్నాయా? అయితే కొన్ని నిమిషాల్లో ఎగ్ బ్రెడ్ ఫ్రై రెసిపీ చేసేయండి

ఇంట్లో కోడిగుడ్లు, బ్రెడ్ ఉన్నాయా? అయితే కొన్ని నిమిషాల్లో ఎగ్ బ్రెడ్ ఫ్రై రెసిపీ చేసేయండి

Haritha Chappa HT Telugu

ఎగ్ బ్రెడ్ ఫ్రై చాలా రుచిగా ఉంటాయి. ఈ రెసిపీని చాలా తక్కువ సమయంలో వండేయచ్చు. ఇది పిల్లలకు పెద్దలకు కూడా చాలా నచ్చుతుంది. ఒక్కసారి దీన్ని రుచి చూశారంటే వదల్లేరు. అంత రుచిగా ఉంటుంది.

ఎగ్ బ్రెడ్ ఫ్రై రెసిపీ

ఇంట్లో బ్రెడ్, గుడ్లు ఉంటే సూపీ ఫ్రై తయారు చేసుకోవచ్చు.పిల్లల నుంచి పెద్దల వరకు మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ ఈ ఫ్రైని ఇష్టంగా తింటారు.ఒకసారి రుచి చూసిన రుచికరమైన ఎగ్ బ్రెడ్ ఫ్రైని ఎలా తయారు చేయాలో ప్రయత్నించండి

ఎగ్ బ్రెడ్ ఫ్రై రెసిపీకి కావాల్సిన పదార్థాలు

గుడ్లు - రెండు

బ్రెడ్ స్లైసులు - ఎనిమిది

ఉప్పు - రుచికి సరిపడా

మిరియాల పొడి - అర స్పూను

పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను

కారం - ఒక స్పూను

అల్లం తరుగు ఒక స్పూను

పసుపు - ఒక స్పూను

చీజ్ తురుము - పావు కప్పు

బటర్ - అర కప్పు

ఉల్లిపాయ - ఒకటి

క్యాప్సికం - ఒకటి

వెల్లుల్లి తరుగు - అర స్పూను

ఎగ్ బ్రెడ్ ఫ్రై రెసిపీ

  1. బ్రెడ్ స్లైసులను తీసుకుని అంచులను కట్ చేయాలి. తరువాత స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను బటర్ వేసి ఆ స్లైసులను వేయించాలి.
  2. రెండు వైపులా బంగారు గోధుమ రంగులోకి మారాక చల్లార్చాలి. స్టవ్ ఆఫ్ చేశాక ఆ బ్రెడ్ స్లైసులను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  3. ఒక గిన్నెలో రెండు కోడిగుడ్లు కొట్టి వేయాలి. అందులోనే మిరియాల పొడి, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

4. అందులో ముక్కలుగా తరిగిన బ్రెడ్ ముక్కలు వేసి బాగా కలపాలి.

5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి బటర్ వేసి వేడి చేయాలి. అందులో తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

4. తర్వాత అందులో తరిగిన క్యాప్సికమ్ వేసి వేయించాలి. అందులో అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి.

5. తర్వాత అందులో ఉప్పు, పసుపు, కారం వేసి బాగా వేయించాలి.

6. తర్వాత అందులో కోడిగుడ్లలో నానబెట్టిన బ్రెడ్ ముక్కలను వేసి వేయించాలి. పదినిమిషాల పాటూ వేయించి చివరలో కొత్తిమీర చల్లాలి.

7. బ్రెడ్ ఎగ్ ఫ్రై సూపర్ ఫ్లేవర్ ఇవ్వడానికి చీజ్ తురుము వేడి మీద చల్లండి. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎగ్ బ్రెడ్ ఫ్రై తిన్నారంటే వదల్లేరు.

ఎగ్ బ్రెడ్ ఫ్రై ఇలా చేస్తే ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా లేదా సాయంత్రం స్నాక్స్ గా కూడా తినవచ్చు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చే పిల్లల కోసం దీన్ని తయారుచేస్తే వారికి నచ్చుతుంది. పిల్లలే కాదు పెద్దలు కూడా దీన్ని తినడానికి ఇష్టపడతారు.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.