Sleepy After Eating: లంచ్‌లో ఇవి తింటే నిమిషాల్లోనే మీరు నిద్రపోతారు, సండే ట్రై చేయండి!
Sleepiness after Eating: మనలో చాలా మందికి సడన్ ఒక్కోరోజు మధ్యాహ్న భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుంటుంది. దానికి కారణం కింద చెప్పిన వాటిలో ఏదో ఒకటి తప్పకుండా అయ్యి ఉంటుంది.
మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే కొంత మందికి నిద్ర ముంచుకొస్తుంటుంది. పని చేస్తున్నా.. సరే కళ్లు మూతలు పడుతుంటాయి. ఒకవేళ మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు లేకపోయినా.. అలా సడన్‌గా నిద్రమత్తు రావడానికి కారణం మన తీసుకునే భోజనమే.
మధ్యాహ్న సమయంలో కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే అవి నిద్రను ప్రేరేపిస్తాయి. ఈ ఆహారాలు శరీరంలో సెరోటోనిన్, మెలాటోనిన్ లాంటి నిద్రహార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి. ఇవి మన నిద్రకి కారణం అవుతాయి.
చపాతీ, పులావ్
మధ్యాహ్నం భోజనంలో ఎప్పుడైనా చపాతీ, రైస్, పులావ్ తీసుకుంటే మీకు నిద్ర రావొచ్చు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఈ ఆహారాలు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి, ఇది ట్రిప్టోఫాన్‌ను మెదడుకు పంపించడంలో సహాయపడుతుంది. ట్రిప్టోఫాన్ మెలాటోనిన్, సెరోటోనిన్‌గా మారి నిద్రను ప్రేరేపిస్తుంది. బ్రెడ్, నూడుల్స్ కూడా నిద్రను ప్రేరేపిస్తాయి.
పప్పు, పెసరపప్పు ప్రోటీన్ సమృద్ధిగా ఉండే ఆహారాలు, వీటిలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంది. ఇది నిద్రను ప్రేరేపిస్తుంది. ఇక మన హెల్తీ ప్రొటీన్‌లుగా చెప్పే పనీర్, వెజిటబుల్ సలాడ్ కూడా శరీరంలో నిద్రహార్మోన్లను పెంచుతాయి. జీడిపప్పు, బాదం, కెలి పండు ఇవన్నీ మన నిద్రకి కారణం అవుతాయి.
పాలు లేదా పెరుగు
మధ్యాహ్నం పాలు లేదా పెరుగు తాగడం నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. పాలలో ట్రిప్టోఫాన్, కాల్షియం నిద్ర కోసం ఉపయోగపడతాయి. ఇక పెరుగు లేదా మజ్జిగ శరీరానికి చల్లదనాన్ని అందించి నిద్రకు సహాయపడుతుంది.
కొద్దిగా తీపి లేదా మిఠాయి తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. ఇది శరీరంలో సాధారణ అనుభూతిని కలిగించి నిద్రకు సహాయపడుతుంది. అలానే తులసీ లేదా జాస్మిన్ టీ తాగడం మిమ్మల్ని రీలాక్స్ చేయడంలో సహాయపడుతుంది. ఇది కూడా మీ మధ్యాహ్నం మంచి నిద్రకు దారితీయవచ్చు.
తేనె కలిపితే
తేనె తాగినా మీకు నిద్ర రావచ్చు. తేనెలో గ్లూకోజ్ ఉండటం వలన శరీరంలోని ఓరెక్సిన్ అనే ఆమ్లం ఉత్పత్తి తగ్గుతుంది, ఇది మానసిక ఉత్సాహాన్ని తగ్గించి నిద్రను ప్రోత్సహిస్తుంది. మధ్యాహ్నం తేనెతో వేడి పాలు లేదా గ్రీన్ టీ తాగితే మీకు తెలియకుండానే కళ్లు మూతలు పడతాయి. బ్రౌన్ రైస్, గోధుమ రొట్టెలు కార్బోహైడ్రేట్స్, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి, ఇవి కండరాలను సడలించడంలో సహాయపడతాయి. ఇవి మధ్యాహ్నం నిద్రకి దారితీస్తాయి.
నాన్‌వెజ్
తేలికపాటి మాంసాహారం, ప్రత్యేకించి కోడి మాంసం లేదా పీతలు వంటి ప్రోటీన్ ఆహారాలు నిద్ర హార్మోన్లను ప్రేరేపించడంలో సహాయపడతాయి. చెర్రీ జ్యూస్ వంటి పండ్ల రసాలు మెలాటోనిన్ ఉత్పత్తిని పెంచుతాయి, ఇది నిద్రను ప్రేరేపిస్తుంది. మధ్యాహ్నం తేలికగా చెర్రీ జ్యూస్ తాగితే నిద్ర వచ్చేస్తుంది.
లంచ్ తర్వాత 10 నిమిషాలు కునుకు తీయడం ఆరోగ్యానికి మంచిదే. కానీ.. భోజనం చేసిన వెంటనే కనీసం 10-15 నిమిషాలు నడిచిన తర్వాత నిద్రపోతే జీర్ణక్రియ సమస్యలు రాకుండా ఉంటాయి.