Yoga for Leg strength: కాళ్లలో సత్తువ, బలం పెంచే 5 అద్భుత ఆసనాలు, రోజూ 10 నిమిషాలు కేటాయించినా చాలు-do these 5 yoga asanas to improve strength in legs ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yoga For Leg Strength: కాళ్లలో సత్తువ, బలం పెంచే 5 అద్భుత ఆసనాలు, రోజూ 10 నిమిషాలు కేటాయించినా చాలు

Yoga for Leg strength: కాళ్లలో సత్తువ, బలం పెంచే 5 అద్భుత ఆసనాలు, రోజూ 10 నిమిషాలు కేటాయించినా చాలు

Koutik Pranaya Sree HT Telugu
Sep 08, 2024 05:00 AM IST

Yoga for Leg strength: నటరాజ భంగిమ నుండి వృక్షాసనం వరకు, కాళ్లో బలం, ఫ్లెక్సిబిలిటీ పెంచడంలో సహాయపడే ఐదు యోగా ఆసనాలు ఇక్కడ ఉన్నాయి. వాటిని ప్రతి రోజూ అభ్యసించే ప్రయత్నం చేయండి.

కాళ్లలో సత్తువ పెంచే ఆసనాలు
కాళ్లలో సత్తువ పెంచే ఆసనాలు (Photo by sippakorn yamkasikorn on Unsplash)

కాళ్లలో బలం చాలా ముఖ్యం. మన శరీరం నిలకడగా నిలబడుతోందీ.. నడుస్తోందీ.. అంటే కాళ్లలో బలం వల్లే. రోజంతా శరీరానికి మద్దతిచ్చే ముఖ్యమైన అవయవాలివి. అయితే కాళ్ల కండరాల్లో బలం పెరగాలంటే కొన్ని వ్యాయామాలు చేయడం చాలా ముఖ్యం. వీటికి ఉదయం పూట ఉత్తమ సమయం. కాళ్లలో బలం, వశ్యతను మెరుగుపరచడంలో సహాయపడే ఐదు యోగా ఆసనాలు ఇక్కడ ఉన్నాయి.

కాళ్లలో బలం పెంటే ఆసనాలు:

చెయిర్ పోజ్:

నిటారుగా నిలబడి, ఆపై చేతులను పైకి సాగదీయాలి. దీన్నే కుర్చీలాంటి భంగిమ లేదా చెయిర్ పోజ్ అంటారు. ఆ తర్వాత మోకాళ్లను కుర్చీలో కూర్చున్నట్లు వంచి ఉంచాలి. కాలు కండరాలపై బలం పనిచేయడానికి కాసేపు ఈ భంగిమలో అలాగే కదలకుండా ఉండాలి.

వృక్షాసనం:

ఈ యోగాసనం సమతుల్యత, చలనశీలతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇలా చేయాలంటే మన కాళ్లపై నిలబడి ఒక పాదాన్ని మరో కాలు లోపలి వైపు తొడ దగ్గర ఉంచాలి. తరువాత శరీరాన్ని ఒక కాలుపై సమతుల్యం చేసి, నమస్కారం భంగిమలో చేతులను పైకి చాపండి. దీంతో శరీరం సమతుల్యత పెరుగుపడుతుంది. కాళ్లలో దృఢత్వం పెరుగుతుంది.

హై లంజ్ పోజ్:

ఈ యోగాసనంలో కాళ్లను రెండు దిక్కులా సాగదీసి, నమస్కారం స్థితిలో చేతులను పైకి ఉంచి వీపును కొద్దిగా వంచడం ద్వారా చేస్తారు. దీంతో కాళ్లలో ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది.

నృత్య భంగిమ:

నటరాజసనం అని కూడా పిలువబడే ఈ నృత్య భంగిమ మధ్యస్థ స్థాయి యోగాసనం. ఇలా చేయాలంటే ఒక కాలుపై నిలబడి, మరో కాలును వంచి రెండు చేతులతో వెనుక నుంచి పట్టుకోవాలి.

అధో ముఖో స్వనాసన:

ఈ యోగాసనం తొడ కండరాలు, పాదాల్లో ఫ్లెక్సిబిలిటీ పెంచి బలోపేతం చేయడానికి సాయపడుతుంది. ఇది శరీరం సమతుల్యతను పెంచుతుంది. మోకాళ్లు, చీలమండలాల్లో కూడా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. దీనికోసం ముందుగా నిలబడి రెండు చేతులు పాదాలను తాకేలా వంగాలి. తర్వాత మెల్లగా ముందుకు కదలాలి. వీలైనంత సేపు ఈ స్థితిలో ఉంటే కాళ్లలో బలం పెరుగుతంది.

టాపిక్