Early Morning Wakeup: ఉదయం త్వరగా నిద్రలేచే వాళ్లు ఎక్కువ విజయాలు సాధిస్తారా? దశాబ్దాల నాటి సందేహానికి సమాధానమిదే!
Early Morning Wakeup: ఉదయాన్నే త్వరగా నిద్రలేవడం అనేది మంచి అలవాటు అని పెద్దలు చెబుతుంటారు. ఇంకా ఇలా లేచి అన్నీ పనులు చేసుకోవడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి వెళతారని, గొప్పవారవుతారని చెబుతుంటారు. చాలా సంవత్సరాలుగా మన మనసుల్లో నాటుకుపోయిన ఈ మాట వెనుక నిజం ఎంత ఉంది? అనే విషయాన్ని ఓ సారి పరిశీలిద్దాం.

గ్రామీణ వాతావరణంలో ఉదయాన్నే లేవడం, పనులు చేసుకోవడం చాలా సాధారణంగా జరిగిపోతుంటాయి. కానీ, సిటీ లైఫ్‌కు వస్తే అది పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. మనలో చాలా మంది దాదాపు గ్రామీణ మూలాలు ఉన్నవారే. అప్పుడప్పుడు ఊర్ల నుంచి వచ్చే పెద్ద వాళ్లు లేదా బంధువులు ఉదయాన్నే లేవాలి. అలా లేచి పనులు చేసుకుంటే, జీవితంలో సక్సెస్ సాధిస్తారని చెబుతుంటారు. అది కేవలం మాటల వరకేనా? అందులో వాస్తవమెంత వరకూ ఉంది? అనే విషయంపై చాలా అధ్యయనాలు జరిగాయి. ఉదయాన్నే లేవడానికి, విజయం సిద్ధించడానికి ఏదైనా సంబంధం ఉందా ? అనే అంశంపై జరిపిన స్టడీలలో తేలిన ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.
స్టడీలు ఏం చెబుతున్నాయంటే..
లండన్ యూనివర్సిటీ కాలేజ్ చేసిన ఒక స్టడీలో, మార్చ్ 2020 నుండి మార్చ్ 2022 వరకు ఇదే అంశం మీద దాదాపు ఒక పదికి పైగా సర్వేలు జరిగాయి. ఈ సర్వేలలో పాల్గొన్న 49,218 మంది డేటాను విశ్లేషించారు రీసెర్చర్లు. వారు విడుదల చేసిన నివేదిక ప్రకారం, రోజును త్వరగా ప్రారంభించేవారు మెరుగైన మానసిక ఆరోగ్యంతో మంచి జీవితాన్ని గడుపుతున్నారని అంగీకరించారు. అలాంటి వారికి జీవితంలో ఎక్కువ సంతృప్తి, ఆనందం, ఒత్తిడి లేకపోవడం వంటి లక్షణాలు కనిపించాయి. ఉదయం త్వరగా వారి రోజును ప్రారంభించడం వల్ల వారిలో ఆత్మగౌరవం గురించి ఎక్కువ అవగాహన ఉంటుందని కూడా వెల్లడించారు.
ఎవరైతే వ్యక్తులు అర్ధరాత్రి సమయం (లేట్ నైట్) వరకూ మేల్కొని ఉంటే అత్యంత చెడ్డ ఫీలింగ్స్ ఎదుర్కొంటారట. ఇంకా, వారం పొడవునా ఒంటరితనం కూడా అనుభవిస్తుంటారట. కానీ, కేవలం వీకెండ్లలో మాత్రం వారి మానసిక ఆరోగ్యం, మానసిక స్థితి ఎక్కువగా మారుతూ ఉన్నట్లు తెలిసింది. అధ్యయనం ప్రకారం, వ్యక్తుల మానసిక ఆరోగ్యం, ఆనందంలో కాలక్రమేణా హెచ్చుతగ్గులు ఉంటాయని తేలింది. కానీ, సగటున ప్రజలు ఉదయం త్వరగా లేచినప్పుడు మంచిగా, అర్ధరాత్రి అత్యంత చెడుగా అనుభూతి చెందినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
రీసెర్చ్ పరిమితులు
ఉదయం లేచే వారిలో మెరుగైన మానసిక స్థితి, జీవిత సంతృప్తి, ఆత్మగౌరవం వంటి భావనలను కనుగొన్నారు. వీటిపై పూర్తి స్పష్టత లేకపోయినప్పటికీ, చాలా పరిశోధనల ఫలితాలు ఒకే విధంగా ఉన్నాయట.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమి చెబుతోంది?
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, సంతోషకరమైన జీవితం అనేది సానుకూల పరిస్థితి, సామాజిక, ఆర్థిక, పర్యావరణ పరిస్థితుల ఆధారంగా ఏర్పడుతుంది. ఇందులో జీవన నాణ్యత, అర్థం, ఉద్దేశ్యం ఉన్నాయట.
ఉదయమే ఎందుకు మంచిదంటే..
ఉదయం సమయంలో వ్యక్తి మానసిక స్థితి ఎక్కువ స్థిరంగా ఉంటుంది. ఆ సమయంలో భావోద్వేగ ఒత్తిడి అనుభవించకుండా ఓర్పుతో సమస్యలను పరిష్కరించుకోగలరు. అందుకే చాలా మంది సమస్య పరిష్కరించుకోవడానికి ఉదయం సమయాన్ని ఎంచుకుంటారు. కాబట్టి పరిశోధన ఫలితాలను బట్టి సమస్యలను ఉదయమే పరిష్కరించుకోవడమా? లేదా రాత్రి సమయంలోనే సమస్యను పరిష్కరించుకుని ఉదయాన్ని ఫ్రెష్ గా మొదలుపెట్టడమా? అనేది ఆలోచించుకోవాలి. ఇది పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మానవ శరీరంలో ఒత్తిడిని పెంచి కార్టిసోల్ హార్మోన్ మధ్యాహ్నం వరకూ తక్కువ స్థాయిలో ఉంటుంది.
సంబంధిత కథనం