Candle: ఇంట్లో మిగిలిపోయిన కొవ్వొత్తి ముక్కలు పడేయకుండా తిరిగి వాటిని ఇలా వాడేయండి-do not throw away the candle pieces left at home and reuse them like this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Candle: ఇంట్లో మిగిలిపోయిన కొవ్వొత్తి ముక్కలు పడేయకుండా తిరిగి వాటిని ఇలా వాడేయండి

Candle: ఇంట్లో మిగిలిపోయిన కొవ్వొత్తి ముక్కలు పడేయకుండా తిరిగి వాటిని ఇలా వాడేయండి

Haritha Chappa HT Telugu
Nov 02, 2024 08:30 AM IST

Candle: దీపావళికి నూనె దీపాలే కాదు, కొవ్వొత్తులను వెలిగించిన వారు ఉంటారు. కొవ్వొత్తులు సగం కాలి ముక్కలు మిగిలిపోయి ఉంటాయి. వాటిని పడేయాల్సిన అవసరం లేకుండా ఆ కొవ్వొత్తులను తిరిగి వినియోగించవచ్చు.

కొవ్వొత్తుల రీసైకిలింగ్
కొవ్వొత్తుల రీసైకిలింగ్ (shutterstock)

ఇంటిని కాంతివంతం చేయడానికి కొవ్వొత్తులను ఎక్కువగా ఉపయోగిస్తారు. మార్కెట్లో కొవ్వొత్తులు అనేక రకాల డిజైన్లలో వస్తాయి. కొన్ని మంచి వాసన కూడా వస్తాయి. మీరు కూడా ఈ కొవ్వొత్తులను ఇంట్లో వెలిగించి అందులో మిగిలిపోయిన కరిగిన మైనాన్ని విసిరేసే వారే ఎక్కువమంది. వీటిని అలా పడేయాల్సిన అవసరం లేదు. వాటిని తిరిగి వినియోగించవచ్చు. వీటి సాయంతో మళ్లీ అందమైన కొవ్వొత్తులను తయారు చేసుకోవచ్చు. అది కూడా మరింత అందంగా. ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము. ఇలా ఫాలో అయిపోతే కొవ్వుత్తులను వేస్టు కాకుండా తిరిగి వినియోగించుకోవచ్చు.

గాజు గ్లాసులో క్యాండిల్

కరిగిపోయిన కొవ్వొత్తులను పదునైన స్పూనుతో గీకి వాటిని ఒక గిన్నెలో వేయండి. చిన్న గాజు పాత్రల్లో ఈ మైనం ముక్కలను వేసి చిన్న మంటతో కరిగించండి. అంతా కరిగి ద్రవంలా అయ్యాక ఒక దారాన్ని దాని మధ్యలో పెట్టి చల్లార్చండి. అది తిరిగి కొవ్వొత్తిలా మారిపోతుంది. తిరిగి ఆ కొవ్వొత్తిని వినియోగించుకోవచ్చు. ఇవి చూడటానికి అందంగా కూడా ఉంటాయి.

మట్టి దీపాల్లో కొవ్వొత్తులు

మట్టి దీపాల్లో అందమైన కొవ్వొత్తులను తయారు చేయచ్చు. మైనం ముక్కలను సేకరించి మట్టిదీపాలను నింపండి. మట్టి దీపాలను కాస్త వేడికి గురి చేస్తే అందులోని మైనం కరిగి ద్రవంగా మారిపోతుంది. ఆ సమయంలోనే దారాన్ని మధ్యలో పెట్టండి. ఆ దారం చివర కూడా మైనాన్ని రాయండి. ఆ తరువాత ఆ మట్టి దీపాలకు అందమైన రంగులు, డిజైన్లు వేయండి. అంతే దీపం కొవ్వొతులు రెడీ అయిపోతాయి. ఇవి చూసేందుకు ఎంతో అందంగా కూడా ఉంటాయి.

అరోమా క్యాండిల్ తయారీ

అరోమా క్యాండిల్ అంటే సువాసనలు వీచే కొవ్వొత్తి. దీన్ని కూడా మీరు ఇంట్లోనే తయారుచేయవచ్చు. క్యాండిల్స్ ముక్కలను ఒక స్టీలు గిన్నెలో వేసి మరిగించండి. మైనం కరిగి ద్రావకంగా మారుతుంది. ఆ ద్రావకంలో కర్పూరం పొడి, లవంగాలు, బిర్యానీ ఆకులు లేదా వాసనలు వీచే నూనెలు వేసి మరిగించండి. బే ఆకులు, లవంగాలు వంటివి తొలగించి ఆ ద్రవాన్ని సిలికాన్ అచ్చుల్లో వేయండి. అవి గట్టిగా మారాక తీసి బెడ్ రూమ్ లో వెలిగించండి. ఆ కొవ్వొత్తి మంచి సువాసనలు వస్తాయి.

పాదాల క్రీమ్

చలికాలంలో కొందరి పాదాలు మడమలు పగిలిపోతాయి. వాటికి ఫుట్ వ్యాక్స్ క్రీమ్ రాస్తే ఆ పగుళ్లు తగ్గిపోతాయి. ఈ క్రీమ్ తయారు చేయడానికి ఈ కరిగిన మైనాన్ని ఉపయోగించవచ్చు. ఒక పాత్రలో కొవ్వొత్తిని కరిగించి కొబ్బరినూనె కలపాలి. ఆ మిశ్రమాన్ని పగుళ్ల చీలమండలకు అప్లై చేయాలి. మీకు రెండు వారాల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.

Whats_app_banner