Kids Health: మీ పిల్లలకు ఐదేళ్లు నిండలేదా? అయితే ఈ ఆహారాలకు దూరంగా ఉంచండి, ఇవి చాలా డేంజర్!-do not feed these foods to children under 5 years of age they are dangerous for them ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kids Health: మీ పిల్లలకు ఐదేళ్లు నిండలేదా? అయితే ఈ ఆహారాలకు దూరంగా ఉంచండి, ఇవి చాలా డేంజర్!

Kids Health: మీ పిల్లలకు ఐదేళ్లు నిండలేదా? అయితే ఈ ఆహారాలకు దూరంగా ఉంచండి, ఇవి చాలా డేంజర్!

Ramya Sri Marka HT Telugu
Jan 07, 2025 10:30 AM IST

Kids Health: చిన్నపిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వారి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల చిన్న నిర్లక్ష్యం కూడా వారి ఆరోగ్యానికి పెను ముప్పుగా పరిణమిస్తుంది. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వకూడని ఐదు ఆహారాల గురించి తెలుసుకుందాం.

మీ పిల్లలకు ఐదేళ్లు నిండలేదా? అయితే ఈ ఆహారాలకు దూరంగా ఉంచండి, ఇవి చాలా డేంజర్!
మీ పిల్లలకు ఐదేళ్లు నిండలేదా? అయితే ఈ ఆహారాలకు దూరంగా ఉంచండి, ఇవి చాలా డేంజర్! (shutterstock)

సాధారణంగా ఐదేళ్ల లోపు ఉండే చిన్న పిల్లలకు ఏదైనా తినిపించేటప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు. దీని వెనుక చాలా పెద్ద కారణాలు ఉంటాయి. ఉదాహరణకు, కొన్ని ఆహారాలు పిల్లల అభివృద్ధికి అవసరం, మరికొన్ని వారి ఆరోగ్యానికి పెద్ద ముప్పు కలిగిస్తాయి. అటువంటి పరిస్థితిలో, పిల్లలకు ఏ ఆహారాలు ఇవ్వాలి, ఏ ఆహార పదార్థాలను నివారించాలో తల్లిదండ్రులందరూ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు కొన్ని రకాల ఆహారాలు తినిపించడం చాలా ప్రమాదకరమట. మీకు కూడా ఐదేళ్ల లోపు పిల్లలు ఉంటే వారికి పెట్టకూడని ఆహారాలేంటో ఇక్కడ తెలుసుకోండి. వారిని జాగ్రత్తగా కాపాడుకోండి.

yearly horoscope entry point

నట్స్ అండ్ సీడ్స్:

ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు నట్స్ అండ్ సీడ్స్ ఎప్పుడూ ఇవ్వకూడదు. ఇవి పిల్లల గొంతులో ఇరుక్కుపోయి వారికి ఊపిరాడకుండా చేసే ప్రమాదముంది. వాస్తవానికి, పిల్లలకు చిన్న గొంతులు ఉంటాయి. వారి పరిమిత నమలగల సామర్థ్యం బాదం, వేరుశెనగ లేదా పొద్దుతిరుగుడు విత్తనాలు వంటి కఠినమైన ఆహారాలు నమలడం వారికి = కష్టతరం అవుతుంది. అలాగే మింగస్తే జీర్ణ సమస్యలు కూడా రావచ్చు.

ద్రాక్ష:

ద్రాక్ష చిన్న పిల్లవాడికి తినడానికి ఇచ్చినప్పుడు అవి అతని లేదా ఆమె శ్వాస గొట్టంలో ఇరుక్కుపోతుంది. సగానికి కత్తిరించిన తర్వాత కూడా అవి పిల్లల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయి. ఈ ప్రమాదాన్ని నివారించడానికి వారికి ద్రాక్షను తినింపించడానికి ఒక మార్గం ఏంటంటే.. మొత్తం ద్రాక్షలో పావు వంతు చుంచి పిల్లలకు ఇవ్వండి.

పాప్‌కార్న్:

పాప్‌కార్న్ పిల్లలకు చాలా ఇష్టమైన చిరుతింటే కావచ్చు. కానీ దిని వారికి చాలా ప్రమాదకరమని గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల గొంతు పూర్తిగా తయారవదు. వారికి నమిలే సామర్థ్యం పూర్తిగా అభివృద్ధి చెందదు. కనుక పాప్‌కార్న్ పరిమాణం, ఆకృతి చిన్న పిల్లలకు ఊపిరి ఆడకపోవచ్చు. వాటి పదునైన అంచులు వారి గొంతులో చిక్కుకుపోయి గాయాలు కలిగించవచ్చు.

ఆపిల్, క్యారెట్:

ఆపిల్, క్యారెట్ వంటి కఠినమైన పండ్లను తినడానికి మొదట వాటిని బాగా నమలాలి, ఇది చిన్న పిల్లలు చేయలేరు. చిన్న పిల్లలకు వీటిని నేరుగా ఇవ్వడం సురక్షితం కాదు. కనుక ఈ వస్తువులను ఉడకబెట్టడం, మెత్తగా రుబ్బి పేస్టులా ఇవ్వడం లేదా మెత్తగా తురుముకోవడం వంటివి చేసి పిల్లలకు తినిపించాలి . ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం లేకుండానే వీటిలో ఉండే పోషకాలన్నీ పిల్లలకు అందుతాయి.

చూయింగమ్:

చూయింగ్ గమ్ లేదా హార్డ్ మిఠాయి వంటివి రెండూ ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ప్రమాదకరం. కఠినమైన మిఠాయి సులభంగా విరిగిపోదు, పిల్లల గొంతులో చిక్కుకుంటుంది. చూయింగ్ గమ్ శిశువు శ్వాస మార్గాన్ని నిరోధించగలదు. కనుక ఎట్టిపరిస్థితిల్లోనూ దీన్ని పిల్లల కంటపడనివ్వకండి.

Whats_app_banner