భార్యాభర్తలు ఆ పని చేయడానికి ముందు వీటిని మాత్రం తినకండి, తింటే ఏమవుతుందంటే
భార్యాభర్తల బంధంలో లైంగిక జీవితానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మీరు తినే ఆహారం కూడా లైంగిక జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. కాబట్టి లైంగిక ప్రక్రియకు ముందు కొన్ని రకాల ఆహారాలను మానేయాల్సిన అవసరం ఉంది. ఎలాంటి ఆహారాలను తినకూడదో తెలుసుకోండి.
మనం తినే ఆహారం జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది. శారీరక ఆరోగ్యం నుంచి మానసిక స్థితి వరకు అన్నీ మనం తినే ఆహారాన్ని బట్టి ఉంటాయి. మీరు తినే ఆహారం భార్యాభర్తల అనుబంధాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. వారిద్దరూ లైంగిక ప్రక్రియకు ముందు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంది. కొన్ని ఆహారాలు తినడం లైంగిక జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మీ భాగస్వామితో శారీరకంగా కలవడానికి ముందు మీరు ఈ ఆహారాలను తింటే, అవి మీ మానసిక స్థితి, లిబిడోపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి అలాంటి ఆహారాలను దూరంగా ఉంచాలి. ఎలాంటి ఆహారాలను దూరంగా పెట్టాలో తెలుసుకోండి.
నూనె నిండిన పదార్థాలు
మీ భాగస్వామితో సన్నిహితంగా గడిపే ముందు, ఎక్కువ నూనె, మసాలా వేసి వండిన ఆహారాన్ని తినకూడదు. ఎక్కువ ఘాటుగా ఉండే ఆహారం పొట్టలో గ్యాస్, ఎసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలను పెంచుతుంది. ఇది ఖచ్చితంగా మీ మానసిక స్థితిని పాడు చేస్తుంది. ఇది కాకుండా, ఎక్కువ జిడ్డుగల ఆహారాన్ని తినడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది లైంగిక ఆనందంపై కూడా ప్రభావం చూపుతుంది.
ఉల్లి, వెల్లుల్లి
లైంగిక ప్రక్రియకు ముందు ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి బలమైన వాసన ఉన్న పదార్థాలను తినకూడదు. అవి మీ లైంగిక జీవితాన్ని పాడు చేస్తాయి. వీటి వల్ల నోటి దుర్వాసన వస్తుంది. అది మీ మానసిక స్థితిని మార్చేస్తుంది. అలాగే లైంగిక ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే స్రావాల వాసనను అధికం చేస్తాయి.
స్వీట్లు
మీకు స్వీట్లంటే ఇష్టమైతే ఆ పనికి ముందు మాత్రం తినకూడదు. మీ భాగస్వామితో రొమాంటిక్ మూమెంట్ గడపడానికి ముందు స్వీట్లు తినకండి. కేకులు, స్వీట్లు, కుకీలు లేదా పేస్ట్రీలు మీ మానసిక స్థితి, లిబిడో… రెండింటిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. వాటిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్, చక్కెర భావప్రాప్తికి చేరుకోవడంలో సమస్యలను కలిగిస్తాయి. ఇది కాకుండా, మీ ఇన్సులిన్ స్థాయి కూడా వేగంగా పెరుగుతుంది. ఈ మూడ్ లో మీరు సెక్స్ చేయడానికి ఇష్టపడరు.
బీన్స్, కాలీఫ్లవర్
మీరు మీ భాగస్వామితో సన్నిహితంగా దగ్గరవ్వాలనుకుంటే మీ భోజనంలో బీన్స్, కాలీఫ్లవర్ వంటి కూరగాయలకు దూరంగా ఉండండి. ఈ రెండూ జీర్ణించుకోవడం చాలా కష్టం. కాలీఫ్లవర్ మీథేన్ విడుదల చేసే కూరగాయలలో ఒకటి. దీనివల్ల మీరు రాత్రంతా ఉబ్బరం వంటి సమస్య మొదలవుతుంది. కాబట్టి లైంగిక ప్రక్రియకు ముందు బీన్స్, కాలీ ఫ్లవర్ కూరలను తినకపోవడమే ఉత్తమం.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)