Sankranti: మకర సంక్రాంతి రోజున పొరపాటున కూడా ఇలాంటి పనులు చేయకూడదట-do not do such things even by mistake on the day of makar sankranti ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sankranti: మకర సంక్రాంతి రోజున పొరపాటున కూడా ఇలాంటి పనులు చేయకూడదట

Sankranti: మకర సంక్రాంతి రోజున పొరపాటున కూడా ఇలాంటి పనులు చేయకూడదట

Haritha Chappa HT Telugu
Jan 13, 2025 09:30 AM IST

మకర సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగ. ఈ పండుగను వేడుకలా నిర్వహించుకుంటారు. అయితే ఆ సమయంలో మనం చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఇలా చేస్తే సూర్యదేవుడికి కోపం వస్తుందని చెప్పుకుంటారు.

మకర సంక్రాంతికి చేయకూడని పనులు
మకర సంక్రాంతికి చేయకూడని పనులు (Pinterest)

సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. ఆరోజు అన్ని మంచి కార్యాలే చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈసారి సంక్రాంతి జనవరి 14, 2024 న వస్తోంది. ఈ రోజున స్నానం, దానధర్మాలు, సూర్య పూజ వంటివి కచ్చితంగా చేయాలి. మకర సంక్రాంతి రోజున కొన్నిపనులు చేస్తే పుణ్యం వచ్చినట్టు, కొన్ని పనులు చేస్తే చెడు జరిగే అవకాశం ఉంది. సంక్రాంతి సమయంలో చేయకూడని పనుల గురించి తెలుసుకోండి. మీరు చేసే కొన్ని పనులు సూర్యదేవునికి కోపం తెప్పించే అవకాశం ఉంది.

yearly horoscope entry point

సూర్యుడు కోసం

మకర సంక్రాంతి రోజూ కచ్చితంగా చేయాల్సిన పని సూర్యుని పూజ. ఈ రోజున సూర్యుడు ధనుస్సు రాశిని వదిలి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే ఈ రోజు నుండి సూర్యుడు ఉత్తరం వైపు కదులుతాడు. అందుకే దీనిని సూర్యుని ఈక్వినాక్స్ అంటారు.

ప్రాచీన నమ్మకాల ప్రకారం మకర సంక్రాంతి రోజున సూర్యుడు తన కొడుకు శనిని కలవడానికి అతని ఇంటికి వెళతాడు. అందుకే మకర సంక్రాంతి రోజున ఉదయం పవిత్ర నదిలో స్నానం చేయాలి. తరువాత నువ్వులు, బెల్లం కలిపి తినాల్సిన అవసరం ఉంది. అలాగే పేదలకు బట్టలు, ఆహారం, డబ్బులు వంటివి దానం చేయడం వంటివి చేయాలి. సంక్రాంతి రోజూ పూజ చేయడం మాత్రం మరిచిపోవద్దు. అయితే అదే సమయంలో మకర సంక్రాంతి సమయంలో కొన్ని పనులు నిషిద్ధంగా భావిస్తారు. అవి చేస్తే సూర్యభగవానుడికి కోపం వచ్చే అవకాశం ఉంది.

దానం చేయండి

మకర సంక్రాంతి నాడు దానం చేయడం ప్రత్యేకం. కాబట్టి మకర సంక్రాంతి నాడు మీ ఇంట్లో ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడిగితే ఖాళీ చేతులతో తిప్పి పంపకండి. మకర సంక్రాంతి నాడు నువ్వులు, బెల్లం, కిచిడీ, బియ్యం లేదా బట్టలను దానం చేయడం మీ కోరికలన్నీ నెరవేరుతాయి.

మొక్కలు, చెట్లు నరకవద్దు

మకర సంక్రాంతి రోజున చెట్లను నరికివేయడం వంటివి చేయకూడదు. జీవితంలో సమస్యలు వచ్చేలా చేస్తుంది. మకర సంక్రాంతి రోజున తులసి ఆకును కూడా తెంపకూడదు. ఆరోజు వీలైతే మొక్కలు నాటండి, కానీ మొక్కలు పీకేయడం, చెట్లను నరికి వేయడం వంటివి చేయకూడదు.

మకర సంక్రాంతి హిందూమతంలో పవిత్రమైన రోజు. కాబట్టి ఈ రోజున సాత్విక ఆహారాన్ని తినాలి. మాంసం, మద్య పానీయాలకు దూరంగా ఉండండి. మకర సంక్రాంతి నాడు పొరపాటున కూడా మాంసం తినకండి. అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లి ఉన్న ఆహారాలకు దూరంగా ఉండండి.

మకర సంక్రాంతి నాడు తల స్నానం చేయండి. ఈ రోజున స్నానం చేయకుండా ఎటువంటి ఆహారం, నీరు తీసుకోకండి. అలా చేయడం పూర్తిగా నిషేధం. కాబట్టి మకర సంక్రాంతి రోజున ఉదయం పవిత్ర నదిలో స్నానం చేయండి. మీరు నదికి వెళ్లేందుకు వీలు కాకపోతే మీ స్నానపు నీటిలో పవిత్ర నది నుంచి తెచ్చిన నీటిని కలిపి కూడా ఇంట్లోనే స్నానం చేయవచ్చు. పూజను చేసేందుకు సూర్యదేవుడికి ప్రసాదం సమర్పించిన తరువాతే ఏదైనా తినండి. ఆరోజు సూర్యుడిని పూజించడం మాత్రం మరిచిపోవద్దు.

Whats_app_banner