Cancer causing chemicals మీరు కొనే ఉత్పత్తుల్లో ఈ పదార్థాలు ఉంటే వాటిని కొనకండి, ఇవన్నీ క్యాన్సర్ కారకాలు-do not buy products if they contain these ingredients they are all carcinogens ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cancer Causing Chemicals మీరు కొనే ఉత్పత్తుల్లో ఈ పదార్థాలు ఉంటే వాటిని కొనకండి, ఇవన్నీ క్యాన్సర్ కారకాలు

Cancer causing chemicals మీరు కొనే ఉత్పత్తుల్లో ఈ పదార్థాలు ఉంటే వాటిని కొనకండి, ఇవన్నీ క్యాన్సర్ కారకాలు

Haritha Chappa HT Telugu
May 02, 2024 11:10 AM IST

Cancer causing chemicals: క్యాన్సర్ కారకాలు మనం తినే ఆహార పదార్థాల్లోనూ ఉంటున్నాయంటే నమ్ముతారా? ఆయా ఉత్పత్తుల్లో కొన్ని రకాల పదార్థాలు, రసాయనాలు లేకుండా చూసుకోవాలి.

క్యాన్సర్ కారకాలు
క్యాన్సర్ కారకాలు (pixabay)

మనదేశంలో 2022లో 14 లక్షల మందికి కొత్తగా క్యాన్సర్ సోకినట్టు తేలింది. అంటే ప్రతి 9 మందిలో ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నారని అర్థం. అధిక మరణ రేటుతో కూడిన వ్యాధి క్యాన్సర్. కాబట్టి దీని బారిన పడకుండా ముందుగానే జాగ్రత్తలు పడాలి. క్యాన్సర్ కారకాలు అనగానే ధూమపానం, ఆల్కహాల్ వంటివే గుర్తొస్తాయి. నిజానికి మనం తినే ఉత్పత్తుల్లో కూడా కొన్ని రకాల క్యాన్సర్ కారకాలు కలుస్తున్నాయి. అనేక రకాల మసాలాలు, కాస్మెటిక్స్ వంటివి నేరుగా మార్కెట్ లోనే కొంటాము. ఆ మసాలా ప్యాకెట్లపై అందులో ఏమి వాడారో ముద్రించి ఉంటుంది. వాటిని చూసి కొన్ని రకాల పదార్థాలు వాడితే కొనక పోవడమే మంచిది. క్యాన్సర్ కారకాలైన రసాయనాలు కూడా కొన్ని రకాల మసాలాలు, కాస్మెటిక్స్ లో వాడుతున్నారు. ఏ పదార్థాలు క్యాన్సర్ కారకాలో ముందుగా తెలుసుకుంటే మంచిది. ప్యాకెట్లపై ఉన్న Ingrediants ను చదివి... కింద మేము చెప్పిన రసాయనాలు ఉంటే కొనడం మానివేయాలి.

కోల్ తార్ (Coal Tar)

కోల్ తార్ అనేది బొగ్గును ప్రాసెసింగ్ చేసినప్పుడు వచ్చే ఉప ఉత్పత్తి. ఇది క్యాన్సర్ కారకం. జుట్టుకు వేసే రంగులు, షాంపూలు, ఇతర సౌందర్య సాధనాలలో వీటిని వాడుతూ ఉంటారు. ఈ రసాయనానికి గురైతే ఊపిరితిత్తులు, మూత్రాశయం, మూత్రపిండాలు, జీర్ణవ్యవస్థ కు సంబంధించిన క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. మీరు కొనే ఉత్పత్తులపై కోల్ తార్ అని రాసిపెట్టి ఉంటే వాటిని కొనక పోవడమే మంచిది.

పారాబెన్స్ (Parabens)

పారాబెన్స్ అనేవి అధికంగా సౌందర్య ఉత్పత్తుల్లో వాడతారు... అంటే క్రీములు, ముఖానికి రాసుకునే పౌడర్లు, సబ్బులు, షేవింగ్ ఉత్పత్తులు, అలాగే ప్రాసెస్ చేసిన కొన్ని ఆహారాల్లో కూడా వీటిని వాడడం సాధారణంగా మారిపోయింది. పారాబెన్లు హార్మోన్లకు అంతరాయం కలిగిస్తాయి. సంతాన ఉత్పత్తి పై తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే కొన్ని రకాల క్యాన్సర్లను అభివృద్ధి చేసే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రావడానికి ఇది కారణంగా అవుతుంది. కాబట్టి మీరు కొనే సౌందర్య ఉత్పత్తుల్లో, ఆహారంలో పారాబెన్స్ ఉంటే కొనక పోవడమే మంచిది. ఎక్కడైనా పారాబెన్ ఫ్రీ అనే లేబుల్ ఉన్న ఉత్పత్తులను మాత్రమే కొనండి. అలాగే మిథైల్ పారాబెన్, ఇథైల్ పారాబెన్, ప్రొఫైల్ పారాబెన్ వంటివి వాడినట్టు మీరు కొన్న ఉత్పత్తుల కవర్ పై ఉన్నా కూడా వాటిని తీసుకోకూడదు.

ఫార్మాల్డిహైడ్

ఫార్మాల్డిహైడ్ అనేది ఒక రంగులేని వాయువు. ఇది బలమైన వాసనతో వస్తుంది. ఆటోమొబైల్ భాగాలు, వస్త్రాలు, క్రిమిసంహారకాలు వంటి వాటిల్లో వీటిని అధికంగా వినియోగిస్తారు. ఇది లుకేమియా వంటి క్యాన్సర్ కు కారణం అవుతుంది. ఏదైనా చెక్కతో చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు దానిలో ఫార్మాల్డిహైడ్ అనే రసాయనం వినియోగించారేమో తనిఖీ చేయండి.

థాలేట్స్

థాలేట్స్ అనేవి సింథటిక్ సువాసనను ఎక్కువ కాలం ఉండేటట్టు చేస్తాయి. అందుకే వీటిని అధికంగా పెర్ఫ్యూమ్స్, హెయిర్ స్ప్రే, నెయిల్ పాలిష్, ఎయిర్ ఫ్రెషనర్లు, ఇతర సువాసనలు వీచే ఉత్పత్తుల్లో వినియోగిస్తూ ఉంటారు. ఇవి హార్మోన్లను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అలెర్జీలకు కారణమవుతాయి. అలాగే రొమ్ము క్యాన్సర్ వంటి రోగాలు వచ్చేలా చేస్తాయి. కాబట్టి వీటిని ఉన్న ఉత్పత్తులను బ్రాండ్లను కొనక పోవడమే మంచిది.

యాక్రిలా మైడ్

యాక్రిలామైడ్ అనే రసాయనం ఉన్న ఆహారాలు క్యాన్సర్‌కు కారణం అవుతాయి. అనేక అధ్యయనాల్లో జంతువుల్లో క్యాన్సర్ రావడానికి ఈ రసాయనం కారణమైనట్టు తేలింది. అలాగే ధూమపానంలో కూడా ఈ రసాయనం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద వంట చేస్తున్నప్పుడు నూనె వంటి పదార్థాలలో ఈ రసాయనం జనించే అవకాశం ఉంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద వేయించడం, కాల్చడం వంటివి చేసేటప్పుడు ఆహారాలలో ఏర్పడే రసాయనాలలో ఇది కూడా ఒకటి. కాబట్టి అధిక ఉష్ణోగ్రతల వద్ద నూనెను వేడి చేసి... ఆ నూనెలో డీప్ ఫ్రై చేసే ఆహారాలను తినడం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది.

WhatsApp channel

టాపిక్