ముఖం కడుక్కోవడం అందరికీ తెలుసు, కానీ మీ అమూల్యమైన, మెత్తని ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. వాటిని పాటించడం వల్ల మీ చర్మం మరింత కాంతివంతంగా, మెత్తగా మారుతుంది. నిజానికి, చాలా మంది మొటిమలు, మొద్దులు, చర్మం వదులుగా ఉండటం, ముడతలు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వారు అన్ని అవసరమైన ఉత్పత్తులను సరిగ్గా వాడుతున్నప్పటికీ, ముఖం కడుక్కోవడం విధానం మీ ముఖ చర్మాన్ని మరింత అందంగా మార్చగలదు. చాలా మంది ముఖం కడుక్కునేటప్పుడు ఈ నిర్లక్ష్యం చేస్తారు. సరైన విధానం తెలుసుకోండి.
ముఖాన్ని చేతులతో శుభ్రం చేసుకుంటాం కదా. మరి ఆ చేతులు శుభ్రం లేకుండా ముఖాన్ని ఎలా శుభ్రపరచుకోగలం. అందుకే ముందుగా చేతులు కడుగుకోవాలి. ఎందుకంటే చేతులపై కనిపించని బ్యాక్టీరియా ముఖానికి అంటుకుని రియాక్షన్లకు దారి తీస్తుంది. ఫలితంగా మొటిమలు కలిగే అవకాశం పెరిగిపోతుంది.
ఫేస్ వాష్ చేసుకునే ముందు చర్మంపై అదనంగా ఉన్న మురికిని తొలగించడం చాలా ముఖ్యం. కాబట్టి, ఒక టవల్‌ను లేదా టిష్యూను తడి చేసుకుని, ముఖం మీద తుడుచుకోండి. దీంతో చర్మంపై ఉన్న అదనపు మురికి తొలగిపోతుంది. వీలు కాని సందర్భంలో ముఖంపై నీళ్లు చల్లుకుని శుభ్రం చేసుకోండి. అలా తడిచిన తర్వాత మాత్రమే ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఫేస్ వాష్‌ను లేదా సబ్బును చేతుల్లో తీసుకుని నేరుగా ముఖం మీద రుద్దుకోకండి. ముందుగా చేతుల్లో ఫేస్ వాష్ లేదా సబ్బు తీసుకుని, కొంచెం నీళ్లు కలిపి నురుగు చేయండి. ఆ తర్వాత ఆ నురుగును చర్మం మీద రుద్దండి. ఈ నురుగు ముఖం అంతా అప్లై చేసుకోవాలని మర్చిపోకండి. ముఖం కడుక్కోవడానికి చర్మం తీరును బట్టి వాడే ఫేస్ వాష్‌ను ఎంచుకోవాలి. డ్రై స్కిన్ ఉన్న వారు, ఆయిలీ స్కిన్ ఉన్న వారు వేర్వేరు ఫేస్ వాష్ లు వాడాల్సి ఉంటుంది.
ఇప్పుడు నురుగుతో వేళ్లను నెమ్మదిగా, సౌకర్యవంతంగా సర్కిల్ షేప్‌లో తిప్పుతూ ముఖం మీద రుద్దుకోండి. దీనివల్ల చర్మం వదులుగా ఉండే సమస్య తగ్గిపోతుంది. దాంతోపాటుగా చర్మాన్ని వేగంగానూ, బలవంతంగానూ రుద్దకండి. మెల్లగా సర్కిల్ షేప్‌లో రుద్దుతూ ఫేస్ వాష్ చేసుకోండి.
ముఖం కడుక్కోవడానికి చాలా వేడిగా లేదా చాలా చల్లని నీటిని ఉపయోగించకండి. ఎల్లప్పుడూ సాధారణ వెచ్చని నీటిని ఉపయోగించండి. నీటి ఉష్ణోగ్రత చర్మంపై మార్పులకు దారి తీస్తుంది. వేడి నీళ్లను ఎక్కువగా వాడితే చర్మం వదులుకావడం, చల్లని నీరు వాడితే బిగుసుకుపోవడం వంటి సమస్యలు కలగొచ్చు.
ముఖాన్ని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత జిడ్డు చర్మం ఉన్నవారు టిష్యూతో తేలికగా తుడిచివేయాలి. డ్రై స్కిన్ ఉన్నవారు మెత్తని పొడి తువ్వాలతో ముఖాన్ని తుడిచివేయాలి. ఈ రెండూ కాకుండా ముఖం కడుగుకున్న తర్వాత ఉండే నీటిని యథావిధిగా వదిలేయకండి. దీనివల్ల సమస్యలు మరింత పెరగొచ్చు.
సంబంధిత కథనం