రోజూ 20 నిమిషాల పాటు లెగ్స్-అప్-ది-వాల్ పోజ్‌ ఆసనం చేస్తే ఎన్ని ప్రయోజనాలో!-do less relax more with legs up the wall pose ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  రోజూ 20 నిమిషాల పాటు లెగ్స్-అప్-ది-వాల్ పోజ్‌ ఆసనం చేస్తే ఎన్ని ప్రయోజనాలో!

రోజూ 20 నిమిషాల పాటు లెగ్స్-అప్-ది-వాల్ పోజ్‌ ఆసనం చేస్తే ఎన్ని ప్రయోజనాలో!

HT Telugu Desk HT Telugu

టు లెగ్స్-అప్-ది-వాల్ పోజ్ వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ ఆసనం వల్ల తల, మెడ కండరాలు రిలాక్స్‌గా ఉంటాయి. ఆందోళనను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. శరీరంలోని అనేక భాగాల పనితీరును మెరుగుపరుస్తోంది.

legs of the wall

మనలో చాలా మంది సరదాగా గోడపై కాళ్లు పెట్టి వీపును నేలకు అన్చి పడుకుంటారు. ఇలా చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. దీని వల్ల శరీరంపై ఒత్తిడి తగ్గి  శరీరానికిఫ్లెక్సిబిలిటీ లభిప్తోంది. దీనిని యోగాలో టు లెగ్స్-అప్-ది-వాల్ పోజ్ అని కూడా పిలుస్తారు, ఈ ఆసనం వల్ల తల, మెడ కండరాలు రిలాక్స్‌గా ఉంటాయి. ఆందోళనను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. శరీరంలోని అనేక భాగాల పనితీరును సరిచేస్తుంది.

రోజుకు 20 నిమిషాలు పాటు ఈ ఆసనం చేయడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు -

1. బలహీనమైన జీర్ణవ్యవస్థలో మేలు చేస్తుంది

ఈ రోజుల్లో చాలా మంది బలహీనమైన జీర్ణవ్యవస్థ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి, మీ జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు, శరీరం ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోలేకపోతుంది. ఇది ఉబ్బరం, మలబద్ధకం, గుండెల్లో మంట  ఇతర సమస్యలకు దారితీస్తుంది. దీంతో పాటు, ఇది బరువు పెరగడానికి కూడా కారణమవుతుంది. ఈ పరిస్థితులన్నింటినీ నివారించడానికి, ప్రతిరోజూ 20 నిమిషాల పాటు  పాటు మీ కాళ్లను గోడపై ఉంచడం ప్రయోజనకరంగా ఉంటుంది. 

2. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది

మీరు మీ పాదాలను గోడకు ఆనుకుని పడుకున్నప్పుడు, రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. ఇది మీ పాదాల వాపును తగ్గిస్తుంది. వాస్తవానికి, మీ రక్త ప్రసరణ సరిగా లేనప్పుడు, శరీరంలో వాపు , జలదరింపు వంటి అనేక సమస్యలు ఉంటాయి. ఈ స్థితిలో మీ పాదాలను ఎత్తుగా ఉంచడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం తగ్గుతుంది.

3. అధిక బిపి సమస్య తగ్గిస్తోంది

హై బీపీ సమస్యలో పాదాలను గోడకు ఆనించి నిద్రించడం వల్ల మేలు జరుగుతుంది. అధిక BP సమస్యతో బాధపడేవారులో రక్త నాళాలు ఒత్తిడి ఉంటుంది. ఈ ఆసనం చేయడం వల్ల రక్త నాళాలు రిలాక్స్‌గా ఉంటాయి. కాళ్ళు 90 డిగ్రీల కోణంలో ఉంచడంలో రక్త ప్రసరణను పెంచుతుంది. అధిక BP సమస్యను తొలగిస్తుంది. కాళ్ళ భాగంలో ఎలాంటి అలసట ఉండదు

4.పాదాల నొప్పి, తిమ్మిరిని తగ్గిస్తుంది

పాదాలను గోడకు అతుక్కుని పడుకున్నప్పుడు, పాదాలు, అరికాళ్ళ నొప్పి తగ్గి అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. పాదాలతో, అరికాళ్ళలో నొప్పి, అసౌకర్యానికి కలగడానికి కారణం రక్త ప్రసరణలో ఇబ్బందులు, మధుమేహం కారణంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఈ విధంగా నిద్రపోవడం పాదాలకు విశ్రాంతినిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

5. స్లీపింగ్ సిక్నెస్

ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. నాడీ వ్యవస్థపై ఒత్తిడి తగ్గిస్తోంది. మెడ, తలపై ఎక్కువ ఒత్తిడిని కలిగించదు. ఇది శరీరానికి విశ్రాంతినిస్తుంది. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల మనస్సు రిలాక్స్‌గా ఉంటుంది. ఇది ఆందోళన, నిద్రలేమి వంటి రుగ్మతలను నిరోధిస్తుంది .

సంబంధిత కథనం