ఒక మంచి సువాసన ఎవరి మూడ్‌నైనా మార్చేస్తుంది. కానీ పిల్లల విషయంలో ఇది ఎలా ఉంటుంది? వారికి కూడా సువాసనలు, పరిమళాలు అవసరమా? అంతకంటే ముఖ్యంగా, వారి సున్నితమైన చర్మం, అభివృద్ధి చెందుతున్న శ్వాసకోశ వ్యవస్థకు ఇవి సురక్షితమేనా? మార్కెట్లో సువాసనలతో కూడిన అనేక శిశు సంరక్షణ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి, ఇవి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తాయి. పిల్లలకు సువాసనలు, పరిమళాలు అవసరమా లేదా అనేది తల్లిదండ్రులను వేధిస్తున్న కీలక ప్రశ్న. ఒకవేళ అవసరం లేకపోతే, పిల్లలు ఎలా తాజాగా ఉండగలరు?
ముంబైలోని సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పిటల్ పీడియాట్రిక్స్, నియోనాటాలజీ, జనరల్ పీడియాట్రిక్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ వర్మ, హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పిల్లల కోసం సువాసనలు, అవి అసలు అవసరమా అనే దానిపై కీలక విషయాలు పంచుకున్నారు.
"నవజాత శిశువుల తీయని సువాసన ఎంతో ప్రత్యేకమైనది, ఇది మత్తునిచ్చే స్వచ్ఛతతో కూడుకున్నదిగా తరచుగా వర్ణిస్తారు. అయినప్పటికీ, శిశు సంరక్షణ ఉత్పత్తుల విభాగం సువాసనభరిత లోషన్లు, పౌడర్లు, వాష్‌లు, చివరకు శిశువుల కోసం మార్కెట్ చేస్తున్న పరిమళాలతో నిండి ఉంది. ఇది తల్లిదండ్రులు, సంరక్షకులకు కీలక ప్రశ్నలను లేవనెత్తుతుంది. అంటే సువాసనలు పిల్లలకు సురక్షితమేనా లేదా అవసరమా అని ఆలోచన రేకెత్తిస్తుంది. పీడియాట్రిషియన్లు, చర్మవ్యాధి నిపుణులు సువాసనలు సాధారణంగా అనవసరం అని, నవజాత శిశువులు, చిన్న పిల్లలకు ప్రమాదకరమైనవిగా ఉండవచ్చని చాలా వరకు అంగీకరిస్తున్నారు." అని డాక్టర్ రాహుల్ వర్మ వివరించారు.
డాక్టర్ రాహుల్ వర్మ హెచ్‌టి లైఫ్‌స్టైల్‌తో ఒక సమగ్ర మార్గదర్శిని పంచుకున్నారు. సువాసనలు పిల్లలకు ఎందుకు సురక్షితం కాకపోవచ్చు, తల్లిదండ్రులకు ఉత్తమ ప్రత్యామ్నాయాలు ఏమిటో ఆయన వివరించారు.
బయట కొంత సమయం గడపడం మంచిది. ఈ సమయంలో వాతావరణానికి అనుగుణంగా దుస్తులు ధరింపజేయాలి. సహజమైన, స్వచ్ఛమైన వాసనలు మేలు చేస్తాయి.
పిల్లలకు సువాసనలు అవసరమా అనే దానిపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ డాక్టర్ రాహుల్ వర్మ "శిశువుకు అత్యంత సురక్షితమైన, ఆరోగ్యకరమైన సువాసన శుభ్రమైన చర్మం, స్వచ్ఛమైన గాలి యొక్క సున్నితమైన, సహజమైన వాసన. సువాసన విషయానికి వస్తే, తక్కువగా వాడటం నిజంగానే మంచిది. ఏదీ వాడకపోవడం ఉత్తమం. సువాసన రహిత సాధారణ దినచర్యల ద్వారా చర్మ పొర ఆరోగ్యం, శ్వాసకోశ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం నిజమైన శిశు సంరక్షణకు ఆధారం." అని సూచించారు.
(గమనిక: ఈ కథనం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా వైద్య పరిస్థితి గురించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడి సలహా తీసుకోండి.)