Rose Facial: గులాబీతో ఇంట్లోనే ఫేషియల్ చేసుకోండి, సింపుల్ టిప్స్‌తో గులాబీల వంటి మేనిఛాయను పొందండి!
Rose Facial: రోజ్ వాటర్ చర్మానికి ఎంత ప్రయోజనకరమైనదో తెలుసు కదా! ఆ పువ్వులో ఉండే గుణాలు కూడా అంతే అద్భుతం. మీ ముఖంపై పింక్ గ్లోని పొందాలనుకుంటే, గులాబీల సహాయంతో ఇంట్లోనే ఫేషియల్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ పాటించి ముఖాన్ని మరింత కాంతివంతంగా మార్చుకోండి.

చర్మం మెరిసిపోవాలని ఎవరు కోరుకోరు. అందులోనూ ముఖ్యంగా మొఖంపై మెరుపు కోసం ప్రతి ఒక్కరూ పరితపిస్తుంటారు. మహిళలు మార్కెట్లో దొరికే ప్రతి ప్రొడక్ట్ ట్రై చేస్తుంటారు. మీరు కూడా ఇలా చేస్తున్నారా! మీరు సహజంగా కెమికల్స్ లేని కాంతివంతమైన మేనిఛాయ పొందాలనుకుంటే, గులాబీలతో ప్రయత్నించండి. ఇంటి దగ్గరే గులాబీలతో ఫేషియల్ చేసుకుని గులాబీ వంటి మేనిఛాయను సొంతం చేసుకోవచ్చు. పూర్తిగా మీ చర్మంపై పింక్ గ్లోయింగ్ సొంతం కావాలంటే, ఈ విధంగా ఫేషియల్ ట్రై చేయండి.
ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకోండి
గులాబీతో ఫేస్ క్లెన్జర్ తయారు చేయడం చాలా సులభం. దీని కోసం మీరు గులాబీ ఎసెన్షియల్ ఆయిల్, పెరుగు, ఒక చెంచా శెనగపిండి తీసుకోండి. అన్నింటిని సమపాళ్లలో కలిపి క్లెన్జర్‌ను రెడీ చేసుకోండి. అవసరమైతే కొన్ని నీళ్లను కలిపి క్లెన్జర్‌ను మీ ముఖం అంతటా అప్లై చేసుకోండి. ఆ తర్వాత వేళ్ల సహాయంతో 10 నిమిషాల పాటు ముఖానికి నెమ్మదిగా మసాజ్ చేసుకోండి. బాగా మసాజ్ చేసుకున్న తర్వాత ముఖాన్ని మామూలు నీటితో కడగాలి.
స్టీమ్‌తో రంధ్రాలను తెరవండి
చర్మం లోపలికి వెళ్ళిన మురికి, ధూళిని శుభ్రం చేయడానికి, స్టీమర్‌లో నీటిని వేడి చేయండి. వేడి అయ్యే సమయంలో అందులో కొన్ని గులాబీ ఆకులను వేయండి. ఇప్పుడు మీ ముఖాన్ని ఆవిరికి దగ్గరగా ఉంచి, మొత్తం ముఖానికి ఆవిరి పట్టేలా ఏర్పాటు చేసుకోండి. 5-7 నిమిషాల పాటు ఆ విధంగా చేసిన తర్వాత, బ్లాక్‌హెడ్ పీలర్‌ను నుదురు, ముక్కు, చెంపలపై ఉపయోగించండి. ఇలా చేయడం ద్వారా బ్లాక్‌హెడ్స్ ఉంటే తొలగిపోతాయి.
స్క్రబ్బింగ్ చేసుకోండి
స్టీమ్ సహాయంతో రంధ్రాలను తెరుచుకున్న తర్వాత స్క్రబ్బింగ్ చేయాలి. దీని కోసం ముందుగా ఒక పెద్ద చెంచా గులాబీ రేకులను తీసుకుని, వాటిని పొడి చేసుకోండి. ఆ తర్వాత దానిని ఒక పెద్ద చెంచా చక్కెర, గులాబీ ఎసెన్షియల్ ఆయిల్ కొన్ని చుక్కలు, గులాబీ నీటితో కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను ముఖానికి వేసి, నెమ్మదిగా రుద్దండి. బాగా స్క్రబ్ చేసిన తర్వాత మీ ముఖాన్ని చల్లని నీటితో కడగాలి.
గులాబీతో ఫేస్ ప్యాక్
ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి, గులాబీ రేకులను పొడి చేసుకోండి. అందులో కొంచెం రోజ్ వాటర్, ఒక చెంచా పాలు వేసి కలపండి. ఆ తర్వాత దీన్ని మీ ముఖానికి అప్లై చేసుకోండి. కాసేపటికి ఫేస్ ప్యాక్ ఆరిపోయిన తర్వాత, చల్లని నీటితో ముఖాన్ని కడిగేయాలి.
గులాబీ మాయిశ్చరైజర్
1 స్పూనులో రోజ్ వాటర్, 1 స్పూనులో ఆలివ్ ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్, కొన్ని పాలు తీసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద రాసుకోండి. ఇది మీ చర్మాన్ని మృదువుగానూ, తేమతోనూ ఉంచుతుంది. గులాబీలు చర్మానికి ఎటువంటి హానికరం కానివి కావడంతో రోజూ ఉపయోగించినా ఎటువంటి నష్టం కలగదు. తరచుగా ఈ టిప్స్ పాటిస్తుండటం వల్ల చర్మం కాంతివంతంగా మెరిసిపోవడంతో పాటు పూర్తిగా పింక్ రంగు మేని ఛాయ మీ సొంతం అవుతుంది.
సంబంధిత కథనం