Face packs: ఈ ఇన్స్టంట్ గ్లో ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి.. పండగ రోజు మెరిసిపోతారు
Face packs: రాఖీకి ముందు ముఖంపై మెరుపు రావాలంటే వెంటనే ఈ ఈజీ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోండి. ఇలా చేయడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారి ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. చాలా సింపుల్ పదార్థాలతో చేసుకోగలితే ఫేస్ ప్యాక్స్ ఏంటో చూసేయండి.
రక్షా బంధన్ అంటే అన్నదమ్ముల రోజు. రాఖీ కట్టిన బహుమతులు, స్వీట్లు, బోలెడన్ని ఫొటోలు. ఫోటోల్లో నేచురల్ గా అందంగా కనిపించాలంటే. తద్వారా తోబుట్టువులందరి మధ్య మీ ముఖం మెరిసిపోవాలంటే వెంటనే ఈ హోం మేడ్ ఫేస్ మాస్క్ ను అప్లై చేయడం ద్వారా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది మీ ముఖానికి తక్షణ మెరుపును ఇవ్వడానికి పనిచేస్తుంది మరియు మేకప్ లేకుండా కూడా మీ ముఖం అందంగా కనిపిస్తుంది.
కాఫీ, నిమ్మరసం ప్యాక్:
ఒక చెంచా కాఫీ పొడి తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముద్దలా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి 10 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత ముఖాన్ని తేలికగా స్క్రబ్ చేసి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగిస్తుంది. సహజంగా తేమను కూడా అందిస్తుంది.
పసుపు, తేనె కలిపి:
సహజంగా చర్మాన్ని తేమ అందించి మెరిసేలా చూస్తాయి పసుపు ,తేనె. దీంట్లో ఉప్పు వేయడం మర్చిపోవద్దు. చిటికెడు రాతి ఉప్పులో తేనె, పసుపు కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి తేలికగా చేతులతో మసాజ్ చేయాలి. ఇది చర్మం రంగును మెరుగు పరుస్తుంది. ఉప్పు మృత కణాల్ని తొలగిస్తుంది. తేలికపాటి చేతులతో ఈ ఫేస్ ప్యాక్ ను రుద్దండి. నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా చేయడం వల్ల ముఖానికి తక్షణ మెరుపు వస్తుంది.
గ్రీన్ టీ:
ఇంట్లో గ్రీన్ టీ పొడి ఉంటే పచ్చిపాలతో గ్రీన్ టీ పొడి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది చర్మానికి తక్షణ మెరుపును ఇవ్వడానికి పనిచేస్తుంది. మృతకణాల్ని తొలగిస్తుంది.
బొప్పాయి, తేనె:
ఇంట్లో బొప్పాయి పండు బాగా పండింది ఉంటే.. చిన్న ముక్క తీసుకుని గుజ్జు లాగా చేసుకోండి. దాంట్లో తేనె కలిపి ముఖానికి పట్టించండి. కాసేపు మర్దనా చేసి పావుగంటయ్యాక కడుక్కుంటే చర్మంలో మంచి మెరుపు వస్తుంది. ఇది మృతకణాలనూ తొలిగిస్తుంది.