DIY Face Masks। మొఖంపై రంధ్రాలను తొలగించడానికి, మెరిసే చర్మం కోసం ఫేస్ మాస్క్‌లు!
DIY Face Masks: మీ అందాన్ని మెరుగుపరుచుకునేందుకు, మీ చర్మ సంరక్షణ రొటీన్ కోసం ఇక్కడ రెండు DIY ఫేస్ మాస్క్‌ల రెసిపీలను అందిస్తున్నాం
DIY Face Masks: చర్మ సంరక్షణ కోసం ఫేస్ మాస్క్‌లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి మీ చర్మానికి పోషణ, హైడ్రేటింగ్ అందించడమే కాకుండా చర్మ సంబంధిత సమస్యలను నయం చేస్తాయి. మొఖంపైన మొటిమలు, రంధ్రాలు, మచ్చలను తొలగించడమే కాక మీకు మెరుగైన మేనిఛాయను, ముఖంలో మెరుపును తీసుకురావడంలో ఫేస్ మాస్క్‌లు గొప్ప మార్గంగా ఉంటాయి. మొఖానికి సంబంధించిన ఎలాంటి సమస్యకైనా ఈ ఫేస్ మాస్క్‌లు పరిష్కరించగలవు. అయితే మార్కెట్లో లభించే ఫేస్ మాస్క్‌లు చాలా ఖరీదైనవిగా ఉంటాయి, పార్లర్ కు వెళ్లినా ఖర్చు ఎక్కువే ఉంటుంది. బదులుగా మీరు ఇంట్లోనే సహజమైన పదార్థాలను ఉపయోగించి ఫేస్ మాస్క్‌లు రూపొందించవచ్చు. ఇవి చాలా ప్రభావంతంగా పనిచేస్తాయి. మీ అందాన్ని మెరుగుపరుచుకునేందుకు, మీ చర్మ సంరక్షణ రొటీన్ కోసం ఇక్కడ రెండు DIY ఫేస్ మాస్క్‌ల రెసిపీలను అందిస్తున్నాం.
ట్రెండింగ్ వార్తలు
దాల్చిన చెక్క యాంటీ ఇన్ల్ఫమేటరీ ప్రయోజనాలను కలిగి ఉంది, అయితే ఇది సున్నితమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా కూడా పని చేస్తుంది, అంతేకాకుండా యాంటీమైక్రోబయల్ కూడా, కాబట్టి చర్మంపై మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను నశింపజేయడానికి సహాయపడుతుంది. దాల్చిన చెక్కతో మరికొన్ని పదార్థాలను ఉపయోగించి ఫేస్ మాస్క్ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.
DIY Cinnamon Face Mask- దాల్చిన చెక్క ఫేస్ మాస్క్
- 1 టీస్పూన్ దాల్చినచెక్క పొడి
- 1 టీస్పూన్ జాజికాయ పొడి
- 1 టీస్పూన్ కోకో పౌడర్
- 2 టేబుల్ స్పూన్ తేనె
ఎలా వాడాలి?
ఒక గిన్నెలో అన్ని పొడులను కలపండి, ఆపై తేనెను కూడా మిక్స్ చేసి పేస్టులా తయారు చేయండి.
ఈ పేస్టును మీ చర్మానికి సున్నితంగా అప్లై చేస్తూ 20 సెకన్ల పాటు మసాజ్ చేయండి. 10 నిమిషాలు అలాగే ఉంచుకొని ఆ తర్వాత
చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. ఇది మీ చర్మాన్ని చక్కగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. చర్మంపై మృత కణాలను తొలగించి మెరుపును అందిస్తుంది.
DIY Multani Matti Face Mask- ముల్తానీ మట్టి ఫేస్ మాస్క్
కొంతమందికి ముఖంపై రంధ్రాలు, ముఖ్యంగా చెంపలపై విపరీరమైన రంధ్రాలు ఉంటాయి. వీటిని నిర్మూలించి, మృదువైన చర్మాన్ని పొందడానికి మీరు ముల్తానీ మట్టి ఫేస్ మాస్క్ ఉపయోగించవచ్చు. ఈ ఫేస్ మాస్క్ మీ చర్మానికి అవసరమైన మినరల్స్ ను అందిస్తుంది, చర్మంలో తేమను నిలిపి ఉంచుతుంది, చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
ముల్తానీ మట్టి ఫేస్ మాస్క్ ఎలా తయారు చేయాలి:
- ముందుగా 1 కప్పు గ్రీన్ టీని కాయండి, ఆపై చల్లబరచండి
- ఒక చిన్న ప్లాస్టిక్ లేదా గాజు గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టిని వేసి, అందులో గ్రీన్ టీ పోసి ప్లాస్టిక్/ కర్ర చెంచాతో నెమ్మదిగా కలపండి, మృదువైన పేస్ట్ తయారవుతుంది.
- ఈ పేస్టును బ్రష్ లేదా మీ వేళ్లతో, ప్రభావిత ప్రాంతంపై పూయండి. ఐదు నుండి 10 నిమిషాలు లేదా పూర్తిగా ఆరిపోయే వరకు ఉంచండి.
- రుద్దడం లేదా లాగడం వంటివి చేయకుండా, గోరువెచ్చని నీటితో సున్నితంగా శుభ్రం చేసుకోండి, ఆపైన మాయిశ్చరైజర్‌ను వర్తించండి.
ఈ మాస్క్‌ని వారానికి ఒకసారి ఉపయోగిస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయి.
సంబంధిత కథనం