DIY Beauty Products। మీ అందం కోసం సహజమైన ఉత్పత్తులను మీకు మీరే తయారు చేసుకోండిలా!
DIY Beauty Products: మీ సౌందర్య పోషణ కోసం మీకు మీరుగా చేసుకోగలిగే ఫేస్ ప్యాక్‌లు, లిప్ బామ్‌లు ఇక్కడ తెలుసుకోండి.
DIY Beauty Products: మాన్‌సూన్ సీజన్‌లో ఉండేటువంటి తేమ, ఉక్కపోత వాతావరణం కారణంగా చర్మం చాలా జిడ్డుగా మారుతుంది. దీని వల్ల అనేక చర్మ సమస్యలు తలెత్తుతాయి. చర్మంపై బ్యాక్టీరియా వృద్ధి పెరిగి ముఖంపై మొటిమలు, చికాకు మొదలైన సమస్యలు వస్తాయి. ఆయిల్ స్కిన్ ఉన్నవారికి పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. అయితే చందనం, ముల్తానీ మట్టి మొదలైన పదార్థాలను ఉపయోగించి తయారు చేసే ఫేస్ ప్యాక్‌లు ఉపయోగించడం వలన చర్మం శుభ్రపడటమే కాకుండా, మొఖంపై మొటిమలు మచ్చలు పోయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ఇందుకోసం మీకు మీరుగా చేసుకోగలిగే ఫేస్ ప్యాక్‌లు ఇక్కడ తెలుసుకోండి.
చందనం - ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్
గంధపు పొడి, ముల్తానీ మట్టిని ఫేస్ ప్యాక్ అప్లై చేయడం ద్వారా, మీరు చర్మంపై మచ్చలను పూర్తిగా వదిలించుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి, ఒక టీస్పూన్ గంధపు పొడిలో అర టీస్పూన్ ముల్తానీ మట్టి కలపండి. ఇందులో కొన్ని పాలు లేదా రోజ్ వాటర్ కలిపి మెత్తని పేస్ట్‌లా చేయండి, ఆపై ఈ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేసి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి.
గంధం - పెరుగు ఫేస్ ప్యాక్
చర్మంపై తేమను నిలిపి ఉంచడానికి, ముఖంలో కోల్పోయిన మెరుపును తిరిగి తీసుకురావడానికి గంధం- పెరుగు ఫేస్ ప్యాక్ ప్రభావంతంగా ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసేందుకు గంధపు పొడిలో రెండు చెంచాల పెరుగు కలిపి ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత మంచినీటితో ముఖం కడిగేయాలి. ఈ ప్యాక్‌ని వారానికి 2-3 సార్లు అప్లై చేసుకోవచ్చు.
చందనం - రోజ్ వాటర్ ఫేస్ మాస్క్
ముఖంపై జిడ్డును తొలగించడానికి, మీరు చందనం- రోజ్ వాటర్ ఫేస్ మాస్క్‌ను అప్లై చేయవచ్చు. ఇందుకోసం రెండు చెంచాల గంధం పొడిలో రోజ్ వాటర్ వేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రమైన నీటితో ముఖం కడిగేయాలి.
పెదవుల సంరక్షణకు లిప్ బామ్
చల్లని వాతావరం, తేమ కారణంగా పెదవులు పొడిబారడం, పగలడం సహజం. దీని కోసం మీరు లిప్ బామ్ ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే మార్కెట్లో లభించే చాలావరకు లిప్ బామ్‌లలో వాడేటువంటి రసాయనాలు దీర్ఘకాలంలో పెదవులను నల్లగా మారుస్తాయి. బదులుగా మీరు సహజమైన లిప్ బామ్ తయారు చేసుకొని ఉపయోగించవచ్చు. లిప్ బామ్ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
కావలసినవి:
- గులాబీ రేకులు- 1 కప్పు
- తేనె - 1 స్పూన్
- వాసెలిన్ - 1 స్పూన్
- కొబ్బరి నూనె - 1 tsp
లిప్ బామ్ ఎలా చేయాలి?
- ముందుగా గులాబీ రేకులను బాగా కడగాలి. తర్వాత ఒక పాత్రలో గులాబీ రేకులను వేసి అందులో అరకప్పు శుద్ధమైన నీళ్లు కలపండి.
- ఇప్పుడు మూతపెట్టి కాసేపు మరిగించాలి. అనంతరం ఆ గులాబీ నీటిని వడపోసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
- ఆపై, రోజ్ వాటర్‌లో తేనె, వాసెలిన్, కొబ్బరి నూనె కలపండి.
- దీన్ని ఒక కంటైనర్ లో తీసుకొని ఫ్రిజ్‌లో పెట్టి గడ్డ కట్టించాలి.
- మీ లిప్ బామ్ రెడీ.
దీనిని పెదవులపై ప్రతిరోజూ అప్లై చేసుకోండి. మీ పెదాలు అందంగా తయారవుతాయి, సహజ రంగును పొందుతాయి.
సంబంధిత కథనం