ఇండియాలో ప్రముఖమైన పండగల్లో దీపావళి ఒకటి. ఈ పండుగ రోజు ప్రతి ఇల్లు, ఆలయం దీపాలతో కళకళలాడిపోతుంది. బాణాసంచా, పటాసులతో ఆకాశం దద్దరిల్లిపోతుంది. ఈ పండుగ ఎప్పుడు వస్తుందా? అని దేశ విదేశాల్లోని భారతీయులంతా ఎదురుచూస్తూ ఉంటారు. అలాగే అమెరికాలో చేసే అతిపెద్ద పండగల్లో హలోవీన్ ఒకటి. హాలోవీన్ పండుగ చాలా ఆడంబరంగా సాగుతుంది. పిల్లలకు పెద్దలకు ఇష్టమైన పండుగ హాలోవీన్. ఆ రోజున వెరైటీగా తయారై వీధుల్లోకి వచ్చి ఆనందంగా పండుగ చేసుకుంటారు. మన దేశంలో దీపావళి, అమెరికాలో హాలోవిన్... ఈ రెండు పండగలు ఒకేరోజు వచ్చాయి. అక్టోబర్ 31న దీపావళి కాగా అమెరికాలో అక్టోబర్ 31న హాలోవీన్ పండుగను నిర్వహించుకుంటున్నారు.
హాలోవీన్ పండుగ సందర్భంగా అమెరికన్లంతా దెయ్యాలు, భూతాలు, గుమ్మడికాయల్లా తయారవుతారు. ప్రతి ఇంటి ముందు గుమ్మడికాయలు ఉంటాయి. హాలోవిన్ అనేది ఒక భయానక పండుగ, కానీ సరదాగా సాగుతుంది. అమెరికాలో ఉన్న భారతీయులకు దీపావళి, హాలోవిన్ రెండూ ఒకే రోజు కావడంతో డబుల్ ఆనందం దక్కినట్టే.
దీపావళి రోజు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకగా దీపాలు పెడతారు. బాణాసంచాను కాలుస్తారు. స్వీట్లను ఇచ్చిపుచ్చుకుంటారు. లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు పూజలు చేస్తారు. ఇంటి ముందు అందమైన రంగోలిని వేస్తారు. ఇది సామాజిక పండుగ. వీధిలో ఉన్న వారంతా కలిసి మెలిసి ఈ పండగను నిర్వహించుకుంటారు.
ఇక హాలోవీన్ విషయానికి వస్తే ఇది కూడా సామాజిక పండుగ. వీధిలో అక్కడ ప్రజలంతా కలిసి వేడుకగా చేసుకునే పండుగ. ప్రజలంతా వినూత్నంగా తయారై మిఠాయిలు, చాక్లెట్లు ఊరంతా పంచుతూ ఉంటారు. అక్కడ హాలోవిన్ దుస్తులు మార్కెట్లో అధికంగా అమ్ముడవుతాయి. ఒక్కొక్కరు ఒక్కోలా తయారవుతారు. కొందరు గుమ్మడికాయలా తయారైతే, మరికొందరూ దయ్యాల్లా తయారవుతారు. ఒక్కొక్కరు ఒక్కోలా తయారై ఆ రోజు రోడ్లపై తిరుగుతూ ఉంటారు. ఈ వేడుక చూడ్డానికి రెండు కళ్లూ చాలవు.
మన దేశం నుండి ఎంతోమంది భారతీయులు అమెరికాలో సెటిల్ అయ్యారు. కొన్ని లక్షల మంది అక్కడ ఉన్నారు. వారంతా కూడా దీపావళిని నిర్వహించుకుంటారు. అలాగే అమెరికాలో వచ్చే హాలోవీన్ పండుగను కూడా నిర్వహించుకుంటారు. ఇప్పుడు ఈ రెండూ కూడా ఒకేరోజు పడడంతో వారు ఈ రెండు పండగలను నిర్వహించుకోవడం కోసం ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు.
టాపిక్