Vegetables Washing: ఈ కూరగాయలను వేడినీటిలో కడగకుండా అస్సలు తినకండి, పురుగులు కడుపులోకి పోతాయి
వంట చేసే ముందు కూరగాయలను శుభ్రంగా కడగటం ప్రతిఒక్కరూ చేస్తుంటారు. అయితే కొన్ని కూరగాయలను కేవలం చల్ల నీటితో కడిగితే సరిపోదట. వేడి నీటిలో ఉప్పు వేసి మరీ కడగాలట. ముఖ్యంగా చలికాలంలో వేడినీటితో కడగకుండా అస్సలు తినకూడని కూరగాయలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం
కూరగాయలు పెంపకం సమయంలో కీటక నాశకాలను వాడటం. పర్యావరణంలో కాలుష్యం లేదా కూరగాయలపై ఉండే దుమ్ము, ధూళి, బ్యాక్టీరియాలతో పాటు లోపల కనిపించని పురుగులు ఇవన్నీ రకరకాల ి వ్యాధి కారకాలే. వీటిలో ఏవి కడుపులోకి వెళ్లినా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడాల్సిందే. కనుక వంట చేసేముందు కూరగాయలను శుభ్రంగా కడగటం చాలా అవసరం.వంట చేసే ముందు కూరగాయలను నీటితో కడిగి తొక్క తీయడం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని కూరగాయలను మరింత జాగ్రత్తగా కడగాలి. లేదంటే వాటిలో ఉండే పురుగులు పొట్టకు చేరుతాయి.
సాధారణంగా, ప్రజలు తాజా కూరగాయలను చల్లటి నీటితో శుభ్రంగా కడిగి ఆ తర్వాత వంట చేస్తుంటరారు. అయితే కొన్ని కూరగాయలను కేవలం చల్లటి నీటితో కడిగితే సరిపోదట. వేడి నీటిలో అది కూడా కాస్త ఉప్పు వేసి మరీ కడగాలట. ముఖ్యంగా చలికాలంలో వేడినీటితో కడగకుండా అస్సలు తినకూడని కూరగాయలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
కొత్తిమీర:
కొత్తిమీర ఆకులు చూడటానికి పూర్తిగా తాజాగా కనిపించినప్పటికీ వాటి ఉపయోగం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండకతప్పదు. మార్కెట్ నుంచి తేగానే కొత్తిమీరను ఫ్రిజ్ లో పెట్టి నిల్వ చేసుకుని అవసరం అయినప్పుడల్లా వాడటం కొందరికి అలవాటు. తెచ్చిన వెంటనే కడిగి ఆరబెట్టుకున్న తర్వాత నిల్వ చేసుకోవడం మరికొందరికి అలవాటు. ఏదేమైనప్పటికీ కొత్తిమీరను ఉపయోగించడానికి ముందు ఆకులను పూర్తిగా శుభ్రపరచాల్సిన ఉంటుంది. దీన్ని చల్లటి నీటితో శుభ్రం చేయడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. దీంట్లోని హారి కారకాలు నశించవు. కనుక కొత్తిమీర ఆకులను ఉపయోగించే ముందు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి ఐదు నిమిషాల పాటు శుభ్రం చేసుకోవాలి.
కాలీఫ్లవర్, బ్రోకలీ:
కాలీఫ్లవర్, బ్రోకలీ ఎల్లప్పుడూ కీటకాల బారిన పడతాయి. కాబట్టి కాలీఫ్లవర్ ను ఎల్లప్పుడూ ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో కడగాలి. ఉపయోగించే ముందు బ్రోకలీని కనీసం రెండు నుండి మూడు సార్లు వేడి నీటిలో లేదా గోరువెచ్చని నీటిలో కడగడం కూడా అవసరం. అలా అయితేనే లోపల దాగి ఉన్న కీటకాలు బయటికి రావడం లేదా చనిపోవడం జరుగుతుంది. లేదంటే ఇవి మీ కడుపులోకి చేరి చాలా అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతాయి.
క్యాబేజీ:
క్యాబేజీలో మెదడుకు చేరే కీటకాలు దాగి ఉంటాయి. ఇవి పొరలుపొరలుగా ఉండటం వల్ల దాంట్లో మురికి, పురుగులు, బ్యాక్టీరియాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి క్యాబేజీని వాడే ముందు గోరువెచ్చని ఉప్పు నీటితో బాగా కడిగి వాడాలి.
రూట్ వెజిటేబుల్స్:
బంగాళాదుంపలు, క్యారెట్లు, ముల్లంగి, బీట్‌రూట్స్ వంటి రూట్ వెజిటేబుల్స్ ను చల్లటి నీటితో కడిగి వాడటం చాలా హానికరం. వీటిని ఎప్పుడు ఉపయోగించినా గోరు వెచ్చటి నీటిలో బాగా కడిగి మాత్రమే ఉపయోగించాలి. తద్వారా ఎలాంటి బ్యాక్టీరియా, కీటకాలు మీ శరీరంలోకి ప్రవేశించకండి.
వంకాయ, బీన్స్ వంటి కూరగాయలను
వంకాయలు, బీన్స్ వంటి కూరగాయలు గోరు వెచ్చని నీటిలో కడిగిన తర్వాత కూడా ఉప్పు కలిపిన నీటిలో కనీసరం ఐదు నుంచి పది నిమిషాల వరకూ ఉంచాలి. అలా అయితేనే వీటిపూ బ్యాక్టీరియా, కీటకాలు నశించి అవి ఆరోగ్యకరంగా మారతాయి.
టమాటాలు:
టమాటాలు పెస్టిసైడ్స్ , ఇతర రసాయనాలతో పెంచి, నిల్వ చేసి ఉంటాయి. కనుక వీటిని చల్లటి నీటితో కడగటం వల్ల పూర్తిగా శుభ్రం కావు. మిగిలిపోయిన కీటకాలు, రసాయనాలు మన ఆరోగ్యానికి హానికరంగా మారతాయి. వేడినీటితో కడగడం ద్వారా ఈ రసాయనాలు, బ్యాక్టీరియా తొలగిపోతాయి. కనుక టమాటాలను వేడి నీటితో కడగకుండా ఉపయోగించకండి.
సంబంధిత కథనం