మొక్కజొన్న రుచి చాలా మందికి ఇష్టం. మొక్కజొన్న తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ మొక్కజొన్నపై పెరిగే సన్నని, దారాల్లాంటి వాటిని తోలుతో పాటుగా తీసి పారేస్తారు. అయితే ఈ దారాలను పారేయకుండా తినొచ్చట. ఇందులో అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. మొక్కజొన్నపై పెరిగే ఈ రేకులను కార్న్ సిల్క్ (Corn Silk) అని పిలుస్తారు. వీటి వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి. అది తెలిస్తే మరోసారి వాటిని పారేయాలనే ఆలోచనే రాదు. ఈ విషయం తెలిశాక మీరే కాదు మీకు తెలిసిన వాళ్లతో కూడా మొక్కజొన్న తినేటప్పుడు Corn Silk గురించి చర్చించకుండా ఉండరు. మరి ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..?
Corn Silk తిన్న తర్వాత నీటిని తాగడం వల్ల మూత్ర వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. లేదా Corn Silk రసంగా చేసుకుని తాగడం వల్ల ఎక్కువ మూత్ర విసర్జన జరుగుతుంది. దీనివల్ల బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు తగ్గుతాయి. మూత్రాశయ ఇన్ఫెక్షన్‌లను నివారించడంలోనూ ఇది సహాయపడుతుంది. క్లీవ్‌ల్యాండ్ నివేదిక ప్రకారం, మూత్రాశయ ఇన్ఫెక్షన్ సమస్య ఉన్నవారికి Corn Silk నీరు తాగడం మంచిదని సూచిస్తుంది.
Corn Silk నీరు తాగడం వల్ల బ్లాడర్ బలపడుతుంది. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారికి Corn Silkతో చేసిన టీ తాగడం మంచిది. దీని వల్ల బ్లాడర్ పటిష్టంగా మారుతుంది.
Corn Silkను తీసుకున్న తర్వాత మూత్ర విసర్జన ఎక్కువగా అవుతుంది. ఇలా జరగడం వల్ల రక్తపోటు తీవ్రత తగ్గుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, రక్తపోటు (BP)తో బాధపడుతున్న వారు, మందులు వాడుతూ ఉంటే Corn Silk టీ తాగకూడదు. లేకపోతే రక్తపోటు చాలా తక్కువగా పడిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే, ఈ టీ తాగడం వల్ల పొటాషియం స్థాయిలు తగ్గే అవకాశం ఉంది.
Corn Silkలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి. దీనివల్ల డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.
Corn Silkలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ-ఏజింగ్‌గా పనిచేస్తాయి. మీరు కార్న్ సిల్క్ తరచూ తీసుకుంటూ ఉంటే నిత్యం యవ్వనంగా ఉంటారు.
Corn Silk జ్యూస్‌లా చేసుకుని తాగడం వల్ల శరీరం స్టార్చ్‌ను నెమ్మదిగా గ్రహిస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం తగ్గుతుంది.
Corn Silk మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అంటే, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో Corn Silk సహాయపడుతుంది. దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇన్ని ప్రయోజనాలు ఉన్న కార్న్ సిల్క్ ను నిర్లక్ష్య పెట్టకండి మరి.
సంబంధిత కథనం
టాపిక్