Copper bottle: రాగి వాటర్ బాటిల్ ఇలా వాడారంటే నష్టమే.. ఆయుర్వేద నియమాలు తెల్సుకోండి-disadvantages of using copper bottle know the best way to drink copper water ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Copper Bottle: రాగి వాటర్ బాటిల్ ఇలా వాడారంటే నష్టమే.. ఆయుర్వేద నియమాలు తెల్సుకోండి

Copper bottle: రాగి వాటర్ బాటిల్ ఇలా వాడారంటే నష్టమే.. ఆయుర్వేద నియమాలు తెల్సుకోండి

Koutik Pranaya Sree HT Telugu
Aug 04, 2024 04:30 PM IST

Copper bottle: మీరు రాగి సీసాలో నీరు త్రాగితే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేకపోతే రాగి విషపూరితంగా మారి అనేక నష్టాలు తెచ్చిపెడుతుంది. రాగి నీళ్లు తాగాల్సిన పద్ధతేంటో తెల్సుకోండి.

రాగి సీసాలో నీళ్లు తాగడం వల్ల నష్టాలు
రాగి సీసాలో నీళ్లు తాగడం వల్ల నష్టాలు (shutterstock)

గత కొన్నేళ్లుగా రాగి పాత్రల వాడకం బాగా పెరిగింది. ముఖ్యంగా రాగి సీసాలు మార్కెట్ లో విపరీతంగా అమ్మేస్తున్నారు. ప్రజల్లో ఆరోగ్యం మీద శ్రద్ధ పెరగడమే దీనికి కారణం. రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటూ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కానీ రాగి సీసాలను సరైన పద్ధతిలో వాడకపోతే కొన్ని నష్టాలూ ఉన్నాయి. అవేంటో చూడండి.

రాగి సీసాల వల్ల నష్టాలు:

  1. రాగి సీసాలు, గ్లాసులు, మగ్గుల్లో నీటిని నిరంతరం తాగడం వల్ల రాగి విషతుల్యత సమస్య పెరిగే ప్రమాదం ఉంది. ఈ సీసాల్లో రోజంతా ఉంచిన నీటిని తాగేస్తారు. రాగి ఒక హెవీ మెటల్, ఇది శరీరంలో అధికంగా చేరితే శరీరానికి హాని చేస్తుంది. . అనేక వ్యాధులు రావడానికి కారణం అవుతుంది.
  2. రాగి విషతుల్యత వల్ల జీర్ణాశయ సంబంధిత సమస్యలు, వికారం, వాంతులు, విరేచనాలు లాంటి సమస్యలు మొదలవుతాయి.
  3. శరీరంలో రాగి పరిమాణం పెరిగితే కాలేయం దెబ్బతినే ప్రమాదం కూడా పెరుగుతుంది. దీంతో పాటే కిడ్నీ సంబంధిత సమస్యలు, న్యూరోలాజికల్ డిజార్డర్ వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి.

రాగి విషతుల్యం ఎందుకు అవుతుంది?

రాగి సీసాను సరిగా శుభ్రం చేయకపోతే కాపర్ టాక్సిసిటీ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రాగిసీసాను లోపలిదాకా శుభ్రం చేయడం కష్టమే. దాంతో క్రమంగా సీసా లోపలి భాగాల్లో మురికి పేరుకుపోయి ఆక్సీకరణ జరుగుతుంది. హానికర బ్యాక్టీరియా తయారవుతుంది. ఇలాంటి రాగి సీసా వాడితే ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టేస్తాయి.

రాగి పాత్రలు వాడాల్సిన పద్ధతి?

1. రాగి సీసాను శుభ్రపరచడం కష్టం. కాబట్టి బదులుగా రాగితో చేసిన మగ్గు వాడొచ్చు. దీన్ని శుభ్రం చేయడం తేలికవుతుంది.

2. రాగి పాత్రలో ఎప్పుడూ వేడినీళ్లు వేయకూడదు. ఈ నీటిలో హానికరమైన రాగి శాతం ఉంటుంది. వీటిని తాగడం అంటే ఆరోగ్యంతో ఆడుకోవడమే.

3. రాగి సీసా లేదా రాగితో చేసిన మగ్గులో నిమ్మరసం వంటి ఆమ్ల పదార్థాలు వేసి తాగొద్దు. వీటితో రాగి వెంటనే చర్య జరుపుతుంది. అనేక సమస్యలు తెచ్చిపెడుతుంది. చాలా మంది ఫ్లేవర్డ్ వాటర్ పేరుతో రాగి పాత్రల్లో వేసిన నీటిలో ఆరెంజ్, నిమ్మ ముక్కలు వేస్తారు. అది తప్పు.

ఆయుర్వేద నియమాలివే:

1. ఆయుర్వేదం ప్రకారం రాగి పాత్రలో నీళ్లు కనీసం 8 నుంచి 10 గంటల దాకా లేదా రాత్రంతా ఉంచాలి. ఉదయాన్నే ఆ నీళ్లను తాగాలి. అంతేగానీ రోజు మొత్తం ఆ రాగి సీసాలోనే నీళ్లుంచి తాగాల్సిన అవసరం అస్సలు లేదు. అలా ఎక్కువ సేపు నీరు ఉంచితే రాగి టాక్సిసిటీ పెరుగుతుంది.

2. రాగి పాత్ర నుంచి ప్రయోజనాలు పొందాలంటే రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే దాంట్లో ఉంచిన నీళ్లు తాగితే సరిపోతుంది. దాంతో శరీరానికి కావాల్సినంత రాగి మాత్రమే లభిస్తుంది. ఆ తర్వాత రోజంతా మామూలు నీటినే తాగడం మంచిది.

3. రాగి పాత్ర ఆక్సీకరణం చెందకుండా, బ్యాక్టీరియా పెరగకుండా ప్రతిరోజూ శుభ్రపరచడం చాలా ముఖ్యం. లేదంటే కడుపునొప్పి, వికారం, వాంతులు, విరేచనాల సమస్య వస్తుంది.

టాపిక్