Belly Fat: కేవలం 21 రోజుల్లో బెల్లీ ఫ్యాట్ తగ్గించడం ఎలాగో చెప్పిన డైటీషియన్, ఇది చాలా సింపుల్
Belly Fat: కేవలం 21 రోజుల్లో బెల్లీ ఫ్యాట్ తగ్గించడం సులువేనా? అవును అనే చెబుతున్నారు డైటీషియన్లు. సరైన పద్ధతిని పాటిస్తే మీరు పొట్ట దగ్గర కొవ్వును కరిగించుకోవచ్చు.
అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారిలో అధికంగా పొట్ట కొవ్వు పేరుకుపోతుంది. దాన్ని తగ్గించేందుకు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. బెల్లీ ఫ్యాట్ కరిగించడం కష్టమని కూడా భావిస్తారు. దాన్ని చాలా మంది సవాలుగా తీసుకుంటారు. బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి ఏం తినాలి? ఏం తినకూడదు వంటి సందేహాలతో సతమతమవుతూ ఉంటారు. క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అర్బీ ఇటీవల తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో 21 రోజుల్లో పొట్ట కొవ్వును తగ్గించే చిట్కాలను షేర్ చేసుకున్నారు. ఐదు సాధారణ రోజువారీ అలవాట్ల ద్వారా బరువు తగ్గొచ్చని ఆమె వివరిస్తున్నారు.
21 రోజుల్లో బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం ఎలా?
మీరు పొట్ట కొవ్వును తగ్గించడానికి ముందుగా మానసికంగా సిద్ధమవ్వాలి. ఇది అసాధ్యం అనుకోకుండా, ఎలాగైనా సన్నబడాలని గట్టిగా నమ్మండి. కేవలం 21 రోజుల్లో మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కొన్ని సింపుల్ పద్ధతులు ఉన్నాయి అని ఆమె తన పోస్టులో చెప్పారు.
1. ఆహారంపై నియంత్రణ
భోజనం చేశాక ప్రతిరోజూ 12 నుంచి 14 గంటల పాటూ ఉపవాసం ఉండేందుకు పయత్నించండి. ఇది మీ శరీరం శక్తి కోసం నిల్వ చేసిన కొవ్వును కాల్చడానికి అనుమతిస్తుంది. దీని కోసం మీరు అల్పాహారం తిన్నాక మధ్యాహ్నం భోజనం తినడం మానేస్తేనే మంచిది. మధ్యలో కేవలం పండ్లు వంటివి మాత్రమే తీసుకోవాలి. రాత్రి 7 గంటలకు రాత్రి భోజనం ముగించాలి.
2. తరచుగా ఆహారం
భోజనం తగ్గించినప్పుడు శరీరం నీరసించి పోతుంది. కాబట్టి అల్పాహారం తిన్నాక రాత్రి భోజనం వరకు ఏమీ తినకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి రోజులో నాలుగు సార్లే ఏదో ఒకటి తింటూ ఉండాలి. అంటే ఒక పండు, లేదా గుప్పెడు నట్స్ వంటివి తింటూ ఉండాలి. ఇలా తింటే మీ జీవక్రియ చురుగ్గా ఉండడంతో పాటూ, అధిక ఆకలి తగ్గుతుంది.
3. ఎలాంటి ఆహారం తినాలి
మొదటగా మీరు ఏం తింటున్నారో అర్థం చేసుకోవాలి. కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని తినకూడదు. మొదట కూరగాయలను తినండి. తరువాత ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. కేలరీలను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డైటింగ్ తో పాటూ అవసరమైన పోషకాలను శరీరానికి అందుతున్నాయో లేవో చూసుకోండి.
4. ప్రాసెస్ చేసిన ఆహారాలు
మీ ఆహారం నుండి చక్కెర పానీయాలు, శుద్ధి చేసిన ధాన్యాలు, ప్రాసెస్ చేసిన స్నాక్స్ తొలగించండి. ఇవి బరువు తగ్గించే ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తాయి. మీ మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి వీటితో చేసిన ఏ ఆహారాన్ని మీరు తినకూడదు.
5. హైడ్రేటెడ్‌గా
బరువు తగ్గేందుకు మీరు రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటూ వ్యాయామం చేసేందుకు ప్రయత్నించాలి. రన్నింగ్, వాకింగ్ వంటివి చేస్తే చాలు.
ఈ సింపుల్ చిట్కాలతో బరువు తగ్గడం
మీ జీవక్రియ ఎంత చురుగ్గా ఉంటే అంత మంచిది. శరీరంలో ఇన్ఫ్లమ్మేషన్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. జీర్ణక్రియ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు.