Ragi Paratha Recipe: రాగి పరాటా.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది-delightful ragi paratha a wholesome recipe for a nutritious breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Delightful Ragi Paratha A Wholesome Recipe For A Nutritious Breakfast

Ragi Paratha Recipe: రాగి పరాటా.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది

HT Telugu Desk HT Telugu
Nov 17, 2023 06:15 AM IST

Ragi Paratha Recipe: రాగి పరాటా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారికి వరం లాంటిదనే చెప్పాలి. దీని తయారీ విధానం ఇక్కడ తెలుసుకోండి.

Ragi Paratha Recipe:: రాగి పరాటా, హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చాయిస్
Ragi Paratha Recipe:: రాగి పరాటా, హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చాయిస్ (Pixabay)

డయాబెటిస్ ఉన్న వారు ఏం తినాలన్నా ఓసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. కొన్ని రకాల ఆహారాలు తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోతాయి. అలా పెరగకుండా ఉండాలంటే డయాబెటిస్ ఫ్రెండ్లీ ఆహారాన్ని తినాలి. రాగి పరాటా తినడం వల్ల మధుమేహం ఉన్న వారికి మేలు జరుగుతుంది. దీని రుచి అదిరిపోతుంది. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించేలా ఉంటుంది. డయాబెటిక్ ఉన్న వారే కాదు సాధారణ వ్యక్తులకు కూడా ఇది మంచి బ్రేక్ ఫాస్ట్ అనే చెప్పాలి.

ట్రెండింగ్ వార్తలు

రాగి పరాటా తయారీకి కావాల్సిన పదార్థాలు

రాగి పిండి - ఒక కప్పు

గోధుమ పిండి - పావు కప్పు

ఉల్లిపాయలు - ఒకటి

కొత్తి మీర - ఒక కట్ట

పచ్చి మిర్చి - రెండు

జీలకర్ర - అరస్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - కాల్చడానికి సరిపడా

రాగి పరాటా తయారీ ఇలా

  1. ఒక గిన్నెలో రాగిపిండి, గోధుమ పిండి వేసి కలపాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి కలపాలి.
  2. ఆ మిశ్రమంలో నీళ్లు వేసి చపాతీ పిండి కలుపుకున్నట్టు బాగా కలపాలి.
  3. ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చిని సన్నగా తరగాలి. వాటిని పిండిలో వేసి బాగా కలపాలి. జీలకర్రను కూడా వేసి కలుపుకోవాలి.
  4. ఈ పిండిని ఒక పది నిమిషాలు పక్క పెట్టేయాలి. తరువాత చిన్న ఉండలుగా చుట్టి పరాటాల్లా ఒత్తుకోవాలి.
  5. స్టవ్ మీద పెనం పెట్టి పరాటాలను రెండు వైపులా కాల్చుకోవాలి.
  6. పరాటా అంచుల చుట్టూ నెయ్యి వేసి కాలిస్తే క్రిస్పీగా వస్తుంది.

ఈ పరాటాను చట్నీ లేకుండా తినవచ్చు. స్పైసీగా, టేస్టీగా ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం