మినపప్పు అన్నం తినాలని అనిపిస్తుందా? అయితే ఈ సింపుల్ రెసిపీ ఫాలో అయిపోండి!-delicious minapappu annam recipe and preparation with simple steps ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మినపప్పు అన్నం తినాలని అనిపిస్తుందా? అయితే ఈ సింపుల్ రెసిపీ ఫాలో అయిపోండి!

మినపప్పు అన్నం తినాలని అనిపిస్తుందా? అయితే ఈ సింపుల్ రెసిపీ ఫాలో అయిపోండి!

Ramya Sri Marka HT Telugu

రుచికరమైన మినపప్పు అన్నం సౌతిండియాలో ఒక ప్రత్యేకమైన వంటకం. నెయ్యి, ధనియాలు, కొబ్బరి కలయికతో తయారయ్యే ఈ అన్నం చాలా సులభంగా, త్వరగా చేసుకోవచ్చు. వేడి వేడిగా తింటేనే అద్భుతమైన టేస్ట్ చూడగలం.

మినపప్పు అన్నం తినాలని అనిపిస్తుందా? అయితే ఈ సింపుల్ రెసిపీ ఫాలో అయిపోండి!

మినపప్పు అన్నం ఒక సాంప్రదాయ దక్షిణ భారతీయ వంటకం, దీని ప్రత్యేక రుచి, సులభమైన తయారీ విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. ముందుగా వేయించిన ధనియాలు, ఎండుమిర్చి, మినపప్పుల సువాసన ఈ అన్నానికి ఒక ప్రత్యేకమైన రుచినిస్తుంది. పచ్చి కొబ్బరి చేర్చడం వల్ల మరింత కమ్మగా ఉంటుంది. చింతపండు కొద్దిపాటి పులుపు, పోపు దినుసుల కలయిక ఈ వంటకాన్ని మరింత రుచికరంగా మారుస్తాయి. వేడి వేడిగా తింటే ఈ మినపప్పు అన్నం ఒక సంతృప్తికరమైన భోజనం అవుతుంది.

మినపప్పు అన్నం రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు:

  • నెయ్యి - 1 టేబుల్ స్పూన్
  • ధనియాలు - 2 టీ స్పూన్లు
  • ఎండు మిరపకాయలు - 10-12
  • పొట్టుతో ఉన్న మినపప్పు - పావు కప్పు
  • పచ్చి కొబ్బరి - 1/3వ కప్పు
  • చింతపండు రెబ్బలు - కొద్దిగా
  • నూనె
  • ఆవాలు
  • జీలకర్ర
  • పచ్చి మిర్చి - 2 (చీలికలు)
  • కరివేపాకు - కొద్దిగా
  • వైట్ రైస్ - పొడిపొడిగా చేసుకున్నది

మినపప్పు అన్నం తయారీ విధానం:

  1. ముందుగా నెయ్యి పోసి అందులో 2 టీ స్పూన్ల ధనియాలు వేయండి.
  2. 10- 12 ఎండు మిరపకాయలను కూడా అందులోనే వేసి వేపుతూ ఉండండి.
  3. మిర్చి వేగిన తర్వాత అందులో పావు కప్పు పొట్టుతో ఉన్న మినపప్పు వేయండి.
  4. సన్నటి సెగ మీద మంచి సువాసన వచ్చేంతవరకూ వేపుకోండి.
  5. ఆ తర్వాత 1/3వ కప్పు పచ్చి కొబ్బరి వేసి వేయించండి. గుర్తుపెట్టుకోండి కొబ్బరిని బాగా వేయించుకోకూడదు. కేవలం ఒక నిమిషం కంటే ఎక్కు వస.
  6. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా చింతపండు రెబ్బలు, వేపుకున్నటువంటి మినపప్పు మిశ్రమాన్ని అందులో వేసి కాస్త బరకగా గ్రైండ్ చేయండి.
  7. ఇప్పుడు కడాయిలో ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేపండి.
  8. ఆ తర్వాత అందులో రెండు పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా తిప్పుకోండి.
  9. ఇప్పుడు అందులో వేయించి పొడి చేసుకున్న మినపప్పు వేసి పదిసెకన్ల పాటు వేపుకోండి.
  10. అలా తిప్పుకుంటూ ఉంటూనే దాంట్లో పొడిపొడిగా చేసుకున్న వైట్ రైస్ వేసుకోండి.

అలా కలుపుకున్న మినపప్పు అన్నాన్ని వేడిగా ఉన్నప్పుడు తినడమే బెటర్.

ఈ స్పెషల్ రైస్ వల్ల కలిగే ప్రయోజనాలు

  • మినపప్పులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది, ఇది కండరాల అభివృద్ధికి, మరమ్మత్తుకు తోడ్పడుతుంది.
  • మినపప్పు, ఇతర దినుసుల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
  • మినపప్పు, కొబ్బరి వంటి పదార్థాలు ఇనుము, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలను కలిగి ఉంటాయి.
  • బియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్లు తక్షణ శక్తిని అందిస్తాయి.
  • ఇది రుచిగా ఉండటమే కాకుండా, కడుపు నిండిన భావనను కలిగిస్తుంది.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.