Touch Me Not Plant Benefits : ఈ మెుక్క ముట్టుకుంటే ముడుచుకుపోతుంది.. కానీ ప్రయోజనాలు చాలా అందిస్తుంది
Touch Me Not Plant Benefits In Telugu : ముట్టుకుంటే ముడుచుకుపోయే మెుక్క పల్లెటూర్లలో చాలానే కనిపిస్తాయి. దీనితో ఆడుకుంటాం.. కానీ దీని నుంచి వచ్చే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.
అత్తిపత్తి లేదా సిగ్గాకు.. దీనినే సాధారణ భాషలో ముట్టుకుంటే ముడుచుకుపోయే మెుక్క అంటారు. ఊర్లలో ఎక్కువగా కనిపిస్తాయి. వీటి ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మెుక్క ముట్టుకుంటే ముడుకుపోతుంది.. కానీ ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా అందిస్తుంది.
మనుషుల స్పర్శకి లేదా కొంచెం గాలికి కూడా తన ఆకులను ముడుచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఏకైక మొక్క అత్తిపత్తి. దాని పూర్తి ప్రయోజనాలు మనకు తెలియవు కాబట్టి, మనం ఈ మొక్క గురించి పెద్దగా పట్టించుకోం. కానీ కనిపిస్తే మాత్రం దానిని టచ్ చేసి ముడుచుకునేలా చేస్తాం. కానీ ఈ అరుదైన మూలిక ఔషధ గుణాలతో శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ మెుక్క ఎక్కువగా నీటి ప్రదేశాలు, నదీతీరాలలో పెరుగుతుంది. వర్షాకాలంలో నేలపై దట్టంగా పెరిగే ఈ మొక్క అతి సూక్ష్మమైన అయస్కాంత శక్తితో ఉంటుంది. మానవులకు శారీరక ఒత్తిడిని మాత్రమే కాకుండా మానసిక ఒత్తిడిని కూడా తగ్గించే శక్తి దీనికి ఉంది.
ఈ మెుక్కతో చాలా ప్రయోజనాలు
ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ మొక్క చాలా విలువైనది. కానీ మనం మాత్రం పెద్దగా దీని గురించి ఆలోచించం. నెగటివ్ ఎనర్జీని బయటకు పంపి, పాజిటివ్ ఎనర్జీ ఆలోచనలను సృష్టించేందుకు ఇది శక్తివంతమైనది. ముట్టుకుంటే ముడుచుకుపోయే మెుక్కను సిద్ధ ఔషధంలో శరీర నొప్పికి ఔషధంగా వాడుతారు. మంత్రవిద్యలో మానసిక వేదనకు, కష్టాలు తొలగడానికి ఉపయోగిస్తారని కూడా అంటుంటారు. దీని ఆకులు, వేర్లు అత్యంత ప్రభావవంతమైనవి, శక్తివంతమైనవి.
శరీరంలో వేడి తగ్గుతుంది
అత్తిపత్తి ఆకులను మెత్తగా నూరి, పెరుగులో కలిపి రోజూ ఉదయాన్నే తింటే శరీరంలోని వేడి తగ్గుతుంది. మూత్ర చికాకులు తగ్గుతాయి. ఈ సిగ్గాకు పొడిని పాలలో కలిపి ప్రతి రాత్రి సేవించాలి. వేరును బాగా దంచి నీటిలో మరిగించి తాగితే పెద్దలకు మూత్రాశయంలోని వ్యాధులు నయమవుతాయి. ఇది శరీరానికి ఒత్తిడిని తగ్గించే, పోషకమైన పానీయంగా ఉపయోగపడుతుంది.
ఈ మెక్క ఆకులను ఎండలో ఎండబెట్టి పొడి చేసి మెత్తగా నూరాలి. అదేవిధంగా వేరును ఎండలో ఎండబెట్టి, వాటిని కలిపి అర టీస్పూన్ చొప్పున రోజుకు రెండు పూటలా తింటే శరీరంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఈ మిశ్రమాన్ని పాలలో కలిపి తాగితే మూలవ్యాధులు నయమవుతాయి.
వాపులకు మంచి మెడిసిన్
వాపులు ఉంటే.. ఈ అత్తిపత్తి ఆకులను మెత్తగా నూరి పేస్ట్ లాగా రాస్తే కీళ్ల వాపులు మాయమవుతాయి. మానని పుండ్లకు ఈ మెుక్క రసాన్ని పూసి, ఆకులను చూర్ణం చేసి కట్టితే పుండ్లు మానిపోతాయి. మహిళల్లో రొమ్ము వాపు చికిత్సలో కూడా ఇది ప్రభావవంతంగా ఉంటుంది.
స్త్రీల సమస్యలు ఔషధం
సిగ్గాకును నీళ్లలో వేసి మరిగించి తుంటి వెనుక భాగంలో కొద్దికొద్దిగా పోస్తే తుంటి నొప్పి నయమవుతుంది. ఆకులను మెత్తగా నూరి చెరువుల్లో దొరికే మట్టితో కలిపి కీళ్ల, తుంటి, కాళ్ల మంటలపై పూస్తే వాతవ్యాధి తగ్గుతుంది. స్త్రీలకు బహిష్టు సమయంలో వచ్చే సమస్యలను ముట్టుకుంటే ముడుచుకుపోయే మెుక్కతో తగ్గించుకోవచ్చు. ఈ ఆకులను సేకరించి చిన్న ఉల్లిపాయలు, జీలకర్రతో మెత్తగా నూరి మజ్జిగలో కలిపి తీసుకుంటే ప్రయోజనాలు ఉంటాయి. ఈ మెుక్కల ఆకు రసాన్ని తీసుకుని పాదం మీద రాసుకుంటే చాలా కాలంగా ఉన్న మానసిక సమస్యలు తగ్గుతాయి.