Deepika Padukone Pregnancy: 38 ఏళ్ళ వయసులో గర్భం దాల్చిన దీపికా పదుకొనే, లేట్ ప్రెగ్నెన్సీతో వచ్చే సమస్యలు ఇవే-deepika padukone who got pregnant at 38 these are the problems that come with late pregnancy ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Deepika Padukone, Who Got Pregnant At 38, These Are The Problems That Come With Late Pregnancy

Deepika Padukone Pregnancy: 38 ఏళ్ళ వయసులో గర్భం దాల్చిన దీపికా పదుకొనే, లేట్ ప్రెగ్నెన్సీతో వచ్చే సమస్యలు ఇవే

Haritha Chappa HT Telugu
Feb 29, 2024 01:22 PM IST

Deepika Padukone Pregnancy: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే. తను గర్భవతినని సోషల్ మీడియా వేదిక ప్రకటించింది. ఆమె వయసు ఇప్పుడు 38 ఏళ్లు.

దీపికా పడుకునే
దీపికా పడుకునే

Deepika Padukone Pregnancy: బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు, ఈ విషయాన్ని దీపిక అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. ఇప్పుడు ఆమె వయసు 38 ఏళ్లు. సాధారణంగా 30 ఏళ్లలోపే బిడ్డలు కనమని చెబుతున్నారు వైద్యులు. ఇలా 38 ఏళ్ళ వయసులో బిడ్డను కనడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో వివరిస్తున్నారు వైద్య నిపుణులు.

30 ఏళ్లు దాటిన మహిళలు గర్భం ధరిస్తే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 35 ఏళ్ల తర్వాత గర్భం ధరించిన స్త్రీలు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారి సంతాన ఉత్పత్తి క్షీణత కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక మహిళ సంతానోత్పత్తి 20 ఏళ్లకు ప్రారంభమై 30 ఏళ్లకు క్షీణించడం మొదలవుతుంది. 35 వయసుకి చేరుకున్న తర్వాత ఆ క్షీణత చాలా వేగంగా ఉంటుంది. 40 ఏళ్లు ధరించాక సహజంగా గర్భం దాల్చే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. లేదా గర్భస్రావం రావడం, పుట్టే పిల్లల్లో లోపాలు రావడం వంటివి జరుగుతాయి.

ఈ సమస్యలు రావచ్చు

35 ఏళ్లు దాటాక మహిళలు గర్భం ధరిస్తే వారికి మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది తల్లీ, బిడ్డ ఇద్దరి ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. లేట్ ప్రెగ్నెన్సీలు గర్భధారణ సమయంలో అధిక రక్తపోటుకు దారి తీయవచ్చు. దీనివల్ల ప్రీ ఎక్లాంప్సియా పరిస్థితి వస్తుంది. ఇది తల్లి ప్రాణానికే ప్రమాదం. అలాగే 35 ఏళ్లు దాటిన తర్వాత పిల్లల్లో ఎక్కువగా కవలలు జన్మించే అవకాశం కూడా ఉంది. అలాగే పుట్టే పిల్లలకు డౌన్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన సమస్యలు రావచ్చు.

ఆలస్యంగా గర్భం దాల్చడం అనేది మానసికంగా, శారీరకంగా స్త్రీలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. అది వారిని చాలా కుంగదీస్తుంది. తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు 30 ఏళ్లలోపే బిడ్డను కనేందుకు ప్లాన్ చేసుకోవాలి.

30 ఏళ్లు దాటాక గర్భం ధరించాలని భావిస్తున్న మహిళలు క్రమం తప్పకుండా వ్యాయామాన్ని చేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి. అలాగే ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేసుకుంటూ ఉండాలి. కుటుంబం, స్నేహితులు, వైద్యుల మద్దతును తీసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్న మహిళలు ఎంతోమంది 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో గర్భం ధరించి ఆరోగ్యకరమైన శిశువులను ప్రసవించారు.

35 ఏళ్లు దాటిన తర్వాత గర్భం ధరించిన మహిళలకు సాధారణ ప్రసవం అయ్యే అవకాశం చాలా తక్కువ. వీరికి సిజేరియన్ పద్ధతిలోనే ప్రసవాన్ని చేస్తారు. ఇలాంటి లేటు వయసులో ఉన్న తల్లులకు పుట్టిన పిల్లలు తక్కువ బరువును కలిగి ఉండే అవకాశం ఉంది. అలాగే ముందస్తుగా కూడా ప్రసవం కావచ్చు. పిల్లల్లో కొన్ని రకాల వైకల్యాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే వీటిని అడ్డుకోవచ్చు.

కొన్ని లాభాలు ఉన్నాయి

35 ఏళ్లు దాటిన తర్వాత పిల్లల్ని కనడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆ వయసుకు వచ్చేసరికి తల్లిదండ్రులు ఆర్థికంగా స్థిరపడతారు. వారి ఆలోచనలు మెరుగ్గా ఉంటాయి. వారిలో సహనం ఎక్కువగా ఉంటుంది. అంతే కాదు పిల్లలను కనడం వల్ల వారి చర్మం యవ్వనంగా మారుతుంది. వారికి దీర్ఘాయువు ఉండే అవకాశం ఉంది. ఒక అధ్యయనం ప్రకారం 29 ఏళ్లలోపు చివరి బిడ్డను కన్నవారితో పోలిస్తే 33 ఏళ్ల తర్వాత తమ చివరి బిడ్డను ప్రసవించిన తల్లులు ఎక్కువ కాలం జీవించే అవకాశం రెండింతలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఒకప్పుడు పెళ్లయిన వెంటనే పిల్లల్ని కనేవారు కానీ ఇప్పుడు కెరీర్ కోసం ఆర్థికంగా స్థిరపడడం కోసం ఎంతోమంది పిల్లలను వాయిదా వేస్తున్నారు అందుకే 35 ఏళ్ల తర్వాత పిల్లల్ని కనే వారి సంఖ్య పెరిగిపోతోంది

టాపిక్