Tight Underwear Problems : డియర్ గర్ల్స్ స్టైల్ కోసమని టైట్ అండర్ వేర్ ధరిస్తే సమస్యలు తప్పవు
Tips To Girls : ఈ మధ్య కాలంలో ఇన్నర్స్ ధరించడంలోనూ స్టైల్ వెతుకుతున్నారు యూత్. అయితే దీనితో కూడా ఇబ్బందులు కలుగుతాయి. టైట్ అండర్ వేర్ ధరిస్తే అమ్మాయిలు యోని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

యోని పరిశుభ్రతను కాపాడుకోవడానికి మీరు ధరించే లోదుస్తులపై కూడా మీరు శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఇవి చాలా రకాలుగా ఆరోగ్యానికి హానికరం. బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు కచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. బిగుతుగా ఉండే బట్టలు వేసుకోవడం వల్ల బాడీ టోన్ స్లిమ్ గా కనబడుతుందనేది నిజమే కానీ శరీర భాగాలపై కొన్ని ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని తెలుసుకోవాలి.
వాతావరణంలో మార్పుల ప్రభావం ఆరోగ్యంపై అనేక విధాలుగా చూపుతుంది. చలికాలంలో చర్మం పొడిబారడం, ఎండాకాలంలో చెమట సమస్య కారణంగా యోని ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. అయితే బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం వల్ల యోనికి అనేక సమస్యలు వస్తాయి.
బిగుతుగా ఉండే లోదుస్తులు అనేక విధాలుగా ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని తెలుసుకోవాలి. బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం వల్ల సమస్యలు వస్తాయి. తప్పుడు లోదుస్తులను ఎంచుకోవడం వలన యోనికి సంబంధించిన అనేక సమస్యలు చూడాల్సి ఉంటుంది.
అంతేకాదు మీ శరీరాన్ని పర్ఫెక్ట్ షేప్ లో కనిపించేలా చేయడానికి షేప్ వేర్ వాడినా కూడా బ్లాడర్ సమస్య కనిపించడం మొదలవుతుంది. బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం వల్ల కలిగే దుష్ప్రభావాలనూ తెలుసుకుందాం..
ఈస్ట్ ఇన్ఫెక్షన్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం టైట్ ప్యాంటు, టైట్ లోదుస్తులను ధరించడం వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. నిజానికి యోని దగ్గర తేమ చేరడం వల్ల, బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది. దీనివల్ల దురద, చికాకు, ఈస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం వల్ల రక్త ప్రసరణ కూడా దెబ్బతింటుంది.
రక్త ప్రసరణపై ప్రభావాలు
బిగుతైన లోదుస్తులను క్రమం తప్పకుండా ధరించడం రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. ఇది కణజాలం దెబ్బతినే ప్రమాదాన్ని పెంచేలా చేస్తుంది. తక్కువ బిగుతుగా ఉండే ప్యాంటీలు వేసుకునే స్త్రీలకు వారి తొడల పైభాగంలో రక్త ప్రసరణ సక్రమంగా ఉండదు. ఇది కాకుండా, చిరాకు, జలదరింపు, తిమ్మిరి వంటి సమస్యలు కూడా వస్తాయి.
యాసిడ్ రిఫ్లక్స్
బిగుతుగా ఉండే ప్యాంటీలు ధరించిన స్త్రీలు కడుపు నొప్పి, గట్టిగా ఉండటంలాంటివి అనుభవించడం ప్రారంభిస్తారు. ఇది చికాకు, యాసిడ్ రిఫ్లక్స్ ప్రమాదాన్ని పెంచుతుంది. బిగుతుగా ఉండే లోదుస్తులు కడుపు సమస్యలను తీవ్రతరం చేస్తాయి. కడుపుపై ఒత్తిడి పెరగడం వల్ల తిమ్మిరి, అజీర్ణం కూడా ఎదురవుతాయి.
వెజినల్ బాయిల్ రిస్క్
బిగుతుగా ఉండే లోదుస్తులను ఎక్కువ సేపు ధరించడం వల్ల యోని దగ్గర తేమ పేరుకుపోయి ఎర్రటి మొటిమలు ఏర్పడే వెజినల్ బాయిల్స్ వంటి సమస్యలు వస్తాయి. అటువంటి సమస్యను నివారించడానికి, కాటన్, రెగ్యులర్ ఫిట్ ప్యాంటీలను ధరించండి.
అందుకే నిపుణులు చెప్పిన ప్రకారం టైట్‌గా ఉండే లోదుస్తులను ధరించకండి. అసలే ఇది వేసవి కాలం మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఫ్రీగా ఉండే ఇన్నర్స్ వాడటం ఆరోగ్యానికి మంచిది. ఈ విషయాన్ని అస్సలు మరిచిపోవద్దు. లేదంటే యోని సంబంధిత సమస్యలను కచ్చితంగా ఎదుర్కొంటారు.